-
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా అమూల్...
టీ20 వరల్డ్‌కప్-2024 మరో నెల రోజుల్లో తెరలేవనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే ఆయా క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత డెయిరీ దిగ్గజం అమూల్ అమెరికా, దక్షిణాఫ్రికా జట్ల ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మెరకు గురువారం న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో అమూల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించాయి. కాగా గతంలో కూడా దక్షిణాఫ్రికాకు స్పాన్సర్‌గా అమూల్ వ్యవహరించింది. దక్షిణాఫ్రికాతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్లకు సైతం అమూల్ స్పాన్సర్ చేసింది. కాగా ఈ మెగా ఈవెంట్లో బాగా రాణించాలని అమెరికా, దక్షిణాఫ్రికా జట్లకు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అమెరికా, ప్రోటీస్ క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న కెనడాతో తలపడగా.. దక్షిణాఫ్రికా జూన్ 3న శ్రీలంకను ఢీకొట్టనుంది. -
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా'.. ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపైన ఒక నెటిజన్ స్పందిస్తూ మహీంద్రా కార్లు అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడలేవని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనికి ఆనంద్ మహీంద్రా రిప్లై కూడా ఇచ్చారు.ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO కారును ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్లకు షేర్ చేశారు. ఈ వీడియోపైన ఘాటుగా వ్యాఖ్యానించిన వ్యక్తికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ.. మీ సందేహానికి ధన్యవాదాలు, ఇలాంటివి మాలో ఇంకా కసిని పెంచుతాయని అన్నారు.1991లో నేను కంపెనీకి చేరినప్పుడు సరిగ్గా ఇలాగే అన్నారు. కార్ల తయారీ రంగంలో తప్పుకోవాలని అంతర్జాతీయ సంస్థలు సూచించాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడగలిగాము. వచ్చే వందేళ్ల తరువాత కూడా మా బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నాము. దీనికోసం ప్రతిరోజు పోరాడుతూ ఉంటామని.. ఆనంద్ మహీంద్రా సున్నితంగా సమాధానం ఇచ్చారు.నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ పోస్టుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన యూజర్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడి నేతృత్వంలో మహీంద్రా బ్రాండ్ వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటుందని నమ్ముతున్నట్టు మరో నెటిజన్ ట్వీట్ చేశారు.Thank you for your skepticism. It only fuels the fire in our bellies. I was told exactly the same thing when I joined the company in 1991. Global consultants advised us to exit the industry. We were told the same thing when Toyota and other global giants in the UV space… https://t.co/oYMBO6HcWk— anand mahindra (@anandmahindra) April 29, 2024 -
పుంజుకున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 43.35 పాయింట్లు లాభపడి 22648.20 వద్దకు చేరింది. సెన్సెక్స్ పాయింట్లు 128.33 పాయింట్ల లాభంతో 74611.11 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, టీసీఎస్, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు 2024 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో తగ్గాయి. మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో నెలవారీగా 1 శాతం, మొత్తం విలువలో 0.7 శాతం తగ్గినట్లు ఎన్పీసీఐ వెల్లడించింది.మార్చిలో రూ.19.78 ట్రిలియన్లుగా నమోదైన యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఏప్రిల్‌లో రూ.19.64 ట్రిలియన్లకు చేరింది. మార్చిలో మొత్తం 13.44 బిలియన్ల సంఖ్యలో జరిగిన లావాదేవీలు ఏప్రిల్‌లో 13.3 బిలియన్లకు తగ్గింది. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 7 శాతం(రూ.6.35 ట్రిలియన్ల నుంచి రూ.5.92 ట్రిలియన్లు), విలువలో 5 శాతం(581 మిలియన్ల నుంచి 550 మిలియన్లు) తగ్గాయి. ఏప్రిల్‌లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు విలువలో 3 శాతం (మార్చిలో రూ.5,939 కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ.5,592 కోట్లు) తగ్గాయి. వాల్యూమ్‌లో 6 శాతం.. మార్చిలో 339 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్‌లో 328 మిలియన్లకు తగ్గాయి.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..యూపీఐ చెల్లింపుల వాల్యూమ్‌లు, విలువలు నెలవారీగా తగ్గినా ఏడాది ప్రాతిపదికన మాత్రం ఘననీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వాల్యూమ్ పరంగా 50 శాతం, విలువలో 40 శాతం పెరిగాయి. -
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.7600 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement