-
సత్యదేవ్ కృష్ణమ్మ మూవీ.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఈ మూవీలో అతీరా రాజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓకేసులో సత్యదేవ్‌ను అన్యాయంగా ఇరికిస్తారు.. అతను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్లో కథ నడకకైనా.. నది నడకకైనా మలుపులే అందం.. కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్.. అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ట్రైలర్లో సత్యదేవ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. మరీ సత్య ఖాతాలో కమర్షియల్ హిట్ పడుతుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్‌కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్‌ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్‌కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ తన సైట్ ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి ప్రస్తుతం అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్, రుద్రన్ చిత్రాలతో అలరించారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ తనవంతు సాయంగా మాత్రం ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు కూడా పంపిణీ చేశారు. పేదల కోసం ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు మన కోలీవుడ్ స్టార్.తాజాగా మరో పది పేద రైతు కుటుంబాలకు అండగా నిలిచారు లారెన్స్. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఉచితంగా పది ట్రాక్టర్లు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ తన ట్విటర్లో పంచుకున్నారు.రాఘవ తన ట్విటర్లో రాస్తూ..' స్నేహితులు అభిమానులు! మాత్రమ్ సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. గతంలో ప్రెస్మీట్లో చెప్పినట్లుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామని చెప్పాం. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ రోజు అతను కొత్త ట్రాక్టర్ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే అతన్ని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం!' అంటూ పోస్ట్ చేశారు. Hi friends and fans! I am excited to announce that Maatram's service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024 -
నాన్నను అలా చూడటం ఇప్పటికీ గుర్తుంది: మహేశ్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు తెలుగు సినిమాలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. 1974లో రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అల్లూరి సీతారామరాజు మూవీ విడుదలై మే 1వ తేదీ నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. నాన్న నటించిన చిత్రంపై ప్రశంసలు కురిపించారు.మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' నాన్నగారిని తెరపై గంభీరమైన లుక్‌లో చూసి ఆశ్చర్యపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చూసినా మొదటిసారి చూసినట్లే ఉంది. ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడిగా నా ప్రయాణం, తెలుగు సినిమాపై నా ప్రభావాన్ని గుర్తుచేసుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఈ ఏడాది గుంటూరు కారంతో అభిమానులను అలరించిన మహేశ్‌బాబు.. నెక్ట్స్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. #50YearsOfAlluriSeetaramaRaju… Still recall watching it for the first time and being awestruck by Nanna garu’s majestic presence on screen. As the film completes 50 years today, I’m reminded of its profound influence on my journey as an actor and on Telugu cinema. ♥️♥️♥️ pic.twitter.com/CdhAfSr0OI— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2024 -
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
‘‘రామాయణ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్ అయిన ఒక ఫొటో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు
చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
Advertisement