Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Dont Do That In Team Game: Irfan Pathan Slams Dhoni Act Against PBKS
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ మరో ఎండ్‌ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్‌ మూడో బంతికి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ధోని షాట్‌ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్‌ మిచెల్‌ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్‌ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్‌ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్‌ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్‌ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్‌ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్‌ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్‌ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్‌ మిచెల్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ధోని చర్యను తప్పుబట్టాడు.‌చదవండి: గిల్‌ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024

Pakistan Announced 18 Men Team For Ireland And England T20 Series
ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ సిరీస్‌ల కోసం పాక్‌ జట్టు ప్రకటన.. ప్రపంచకప్‌ జట్టులో కూడా వీరే..!

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లతో జరిగే ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్‌ జట్టును ఇవాళ (మే 2) ప్రకటించారు. ఇదే జట్టు నుంచే ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేస్తామని పాక్‌ సెలెక్టర్లు తెలిపారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 (మే 22) అనంతరం వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన ఉంటుందని వెల్లడించారు. జట్ల ప్రకటనకు మే 24 డెడ్‌లైన్‌ కావడంతో ఆలోపే తమ వరల్డ్‌కప్‌ జట్టును వెల్లడిస్తామని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. పాక్‌ ఐర్లాండ్‌ పర్యటన ఈనెల 10న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్‌ మూడు టీ20ల సిరీస్‌ ఆడుతుంది. మే 10, 12, 14 తేదీల్లో డబ్లిన్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం పాక్‌ ఐర్లాండ్‌ నుంచి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో పాక్‌ నాలుగు టీ20లు ఆడుతుంది. మే 22, 25, 28, 30 తేదీల్లో నాలుగు టీ20 జరుగనున్నాయి. ఈ సిరీస్‌ ముగిసిన అనంతరం పాక్‌ ఇక్కడి నుంచే నేరుగా టీ20 ప్రపంచకప్‌ వేదికకు బయల్దేరుతుంది. టీ20 వరల్డ్‌కప్‌ యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1న ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీలో పాక్‌ ప్రయాణం జూన్‌ 6న మొదలవుతుంది. ఆ రోజున జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ ఆతిథ్య యూఎస్‌ఏతో తలపడనుంది. డల్లాస్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ప్రపంచకప్‌లో పాక్‌.. భారత్‌, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా జట్లతో కలిసి గ్రూప్‌-ఏలో ఉంది. ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా జరుగనుంది.పాక్‌ జట్టు విషయానికొస్తే.. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు ఎంపిక చేసిన పాక్‌ జట్టుకు బాబర్‌ ఆజమ్‌ నాయకత్వం వహించనున్నాడు. పేసర్‌ హసన్‌ అలీ చాలాకాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అఘా సల్మాన్‌ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల కిందట స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న హరీస్‌ రౌఫ్‌, ఆజమ్‌ ఖాన్‌ తిరిగి జట్టులోకి చేరారు. మణికట్టు స్పిన్నర్‌ ఉసామా మీర్‌, పేసర్‌ జమాన్‌ ఖాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు పాక్‌ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్‌), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్‌ అయూబ్‌, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్

Johnson Charles Unbeaten Ton Powers Windies A To 76 Run Victory Over Nepal In Third T20
విండీస్‌ ఓపెనర్‌ ఊచకోత.. బెంబేలెత్తిపో​యిన పసికూన

ఐదు మ్యాచ్‌ల అనధికారిక టీ20 సిరీస్‌ కోసం వెస్టిండీస్‌-ఏ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా నిన్న (మే 1) జరిగిన మూడో మ్యాచ్‌లో పర్యాటక జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ జాన్సన్‌ ఛార్లెస్‌ మెరుపు శతకం (61 బంతుల్లో 119 నాటౌట్‌; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఛార్లెస్‌ ఊచకోత ధాటికి నేపాల్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ గెలుపుతో విండీస్‌ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ సంచలన విజయం సాధించగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో విండీస్‌ విజయం సాధించింది. ఇవాళ (మే 2) నాలుగో టీ20 జరుగుతుంది.మూడో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. జాన్సన్‌ ఛార్లెస్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఛార్లెస్‌తో పాటు ఆండ్రీ ఫ్లెచర్‌ (33 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. అలిక్‌ అథనాజ్‌ 17, ఫేబియన్‌ అలెన్‌ 19 పరుగులు చేసి ఔట్‌ కాగా.. కీమో పాల్‌ 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్‌ బౌలర్లలో కరణ్‌, సాగర్‌ ధకల్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. అథనాజ్‌ రనౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌.. విండీస్‌ బౌలర్ల దెబ్బకు 19.2 ఓవర్లలో 151 పరుగులకే బిచానా సర్దేసింది. విండీస్‌ బౌలర్లలో హేడెన్‌ వాల్ష్‌ 3 వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్‌ మోటీ 2, మాథ్యూ ఫోర్డ్‌, ఓబెద్‌ మెక్‌కాయ్‌, ఫేబియన్‌ అలెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో లోకేశ్‌ బమ్‌, కరణ్‌ తలో 28 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఈ సిరీస్‌లో వరుసగా సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేదు.  

India Great Slams BCCI For Ignoring CSK Star T20 WC Favouritism Bombshell
గిల్‌ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం

టీ20 ప్రపంచకప్‌-2024 జట్టు ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయాలపై మాజీ కెప్టెన్‌ క్రిష్టమాచారి శ్రీకాంత్‌ మండిపడ్డాడు. తమకు ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేకపోయినా వారికి వరుస అవకాశాలు ఇస్తోందంటూ మేనేజ్‌మెంట్‌ తీరును తప్పుబట్టాడు.తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసేందుకు.. అర్హత కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టడం ద్వంద్వనీతికి నిదర్శనం అంటూ బీసీసీఐ విధానాలను విమర్శించాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది.ఐర్లాండ్‌తో జూన్‌ 5 నాటి మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.శుబ్‌మన్‌ గిల్‌ అసలు ఫామ్‌లోనే లేడుఇందులో ఓపెనర్ల కోటాలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి చోటు దక్కించుకోగా.. శుబ్‌మన్‌ గిల్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందిస్తూ.. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ అసలు ఫామ్‌లోనే లేడు.అయినా అతడికి జట్టులో స్థానం కల్పించారు. నిజానికి రుతురాజ్‌ గైక్వాడ్‌కు టీమ్‌లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌లో 500 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద సెంచరీ చేశాడు.కానీ సెలక్టర్లకు శుబ్‌మన్‌ గిల్‌ మాత్రమే కనిపిస్తాడు. వరుసగా విఫలమైనా అతడికే ఛాన్సులు ఇస్తారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వరుస వైఫల్యాలు జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయలేవు.తమకు నచ్చిన ఆటగాళ్లకేసెలక్షన్‌ విషయంలో ఫేవరిటిజం ఉంది. తమకు నచ్చిన ఆటగాళ్లకే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు’’ అంటూ తూర్పారబట్టాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ చీకి చిక్కా వేదికగా కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లో కలిపి 509 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు.. శుబ్‌మన్‌ గిల్‌ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా, ఆటగాడిగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 320 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చిక్కా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్‌-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. వెంటనే డకౌటయ్యాడు! వీడియో “Gill playing ahead of Rutu baffles me. Be is out of form and Rutu has had a better t20i career than gill. Gill will keep failing and he ll keep getting chances, he has favouritism of the selectors, this is just too much of favouritism” Krishnamachari Srikanth in his YT vid pic.twitter.com/PJmeiihxVx— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) May 1, 2024

Canada Announced Their Squad For T20 World Cup 2024
టీ20 వరల్డ్‌కప్‌ కోసం జట్టును ప్రకటించిన కెనడా

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (మొత్తం 20 జట్లు) తమతమ జట్లను ప్రకటించాయి. తొలుత న్యూజిలాండ్‌ తమ వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌ను అనౌన్స్‌ చేయగా.. తాజాగా కెనడా తమ జట్టు వివరాలను వెల్లడించింది.తొలిసారి ప్రపంచకప్‌ ఆడనున్న కెనడాకు సాద్‌ బిన్‌ జాఫర్‌ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో చాలామంది భారతీయ క్రికెటర్లు ఉన్నారు. కెనడా తమ వరల్డ్‌కప్‌ జర్నీని టోర్నీ ప్రారంభ రోజునే స్టార్ట్‌ చేయనుంది. జూన్‌ 1న కెనడా ఆతిథ్య యూఎస్‌ఏను డల్లాస్‌ వేదికగా ఢీకొట్టనుంది. కెనడా ఈ మెగా టోర్నీలో భారత్‌, యూఎస్‌ఏ, పాకి​స్తాన్‌, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్‌-ఏలో ఉంది.  కెనడా టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు: సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్‌), ఆరోన్ జాన్సన్, డిలోన్ హేలిగర్, దిల్‌ప్రీత్ బజ్వా, హర్ష్ థాకర్, జెరెమీ గోర్డన్, జునైద్ సిద్ధిఖీ, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్‌గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, పర్గత్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, రయ్యన్‌ పఠాన్‌, శ్రేయస్‌ మొవ్వ .ట్రావెలింగ్‌ రిజర్వ్‌లు: తాజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతీందర్ మాథారు, పర్వీన్ కుమార్.ఇదివరకే ప్రకటించిన జట్ల వివరాలు..ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్‌), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మద్, నూర్ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.రిజర్వ్‌లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీమ్ సఫీఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్. రిజర్వ్‌లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్నేపాల్: రోహిత్ పౌడెల్ (‍కెప్టెన్‌), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీన్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టి సౌత్‌నర్, ఇషీ సోధి .ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్ఒమన్: అకిబ్ ఇలియాస్ (కెప్టెన్‌), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్‌కీపర్‌), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషి (వికెట్‌కీపర్‌), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్ , ఖలీద్ కైల్.రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రాదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జార్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడా, ట్రీస్టాన్ రికెల్టన్, ట్రిస్టన్ రికెల్టన్, స్టబ్స్బంగ్లాదేశ్‌: ఇంకా ప్రకటించాల్సి ఉందిశ్రీలంక: ఇంకా ప్రకటించాల్సి ఉందిఉగాండా: ఇంకా ప్రకటించాల్సి ఉందియునైటెడ్ స్టేట్స్: ఇంకా ప్రకటించబడలేదువెస్టిండీస్: ఇంకా ప్రకటించాల్సి ఉందిఐర్లాండ్: ఇంకా ప్రకటించాల్సి ఉందినమీబియా: ఇంకా ప్రకటించాల్సి ఉందిపువా న్యూ గినియా: ఇంకా ప్రకటించలేదుపాకిస్థాన్: ఇంకా ప్రకటించాల్సి ఉందిస్కాట్లాండ్: ఇంకా ప్రకటించాల్సి ఉందినెదర్లాండ్స్‌: ఇంకా ప్రకటించాల్సి ఉంది 

IPL 2024: Punjab Is The 2nd Team After Mumbai To Defeat CSK In 5 Consecutive Matches
IPL 2024: సీఎస్‌కేను చిత్తు చేసిన పంజాబ్‌.. ఘనమైన రికార్డు

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ లేటుగా మేల్కొంది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం అయ్యాక వరుస విజయాలు సాధిస్తుంది. సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌, నాలుగో మ్యాచ్‌ గెలిచిన పంజాబ్‌.. ఇప్పుడు వరుసగా తొమ్మిది, పది మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌వైపు ఆశగా చూస్తుంది.ప్రస్తుతం పంజాబ్‌ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. నిన్న (మే 1) సీఎస్‌కేపై గెలుపు పంజాబ్‌లో ‍కొత్త జోష్‌ నింపింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి సీఎస్‌కేను 7 వికెట్ల తేడాతో చిత్తు చేశారు.పంజాబ్‌ ఈ సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు గెలవాల్సి ఉండగా.. అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో పంజాబ్‌ గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. మిగతా జట్లు కూడా మరో నాలుగైదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ప్లే ఆఫ్స్‌ బెర్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.పంజాబ్‌ ఖాతాలో ఘనమైన రికార్డు..నిన్నటి మ్యాచ్‌లో సీఎస్‌కేను చిత్తు చేసిన పంజాబ్‌ ఓ అరుదైన ఘనత సాధించింది. ముంబై ఇండియన్స్‌ తర్వాత ఐపీఎల్‌లో సీఎస్‌కేను వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. పంజాబ్‌కు సీఎస్కే హోం గ్రౌండ్‌ అయిన చెపాక్‌లో ఇది నాలుగో విజయం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ (5) మాత్రమే సీఎస్‌కేను వారి సొంత మైదానంలో ఇన్ని మ్యాచ్‌ల్లో ఓడించింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ (62) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ మినహా ఎవ్వరూ రానించలేదు. రహానే 29, సమీర్‌ రిజ్వి 21, మొయిన్‌ అలీ 15, ధోని 14 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లు రాహుల్‌ చాహర్‌ (4-0-16-2), హర్ప్రీత్‌ బ్రార్‌ (4-0-17-2), రబాడ (4-0-23-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌.. ఆడుడూపాడుతూ 17.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జానీ బెయిర్‌స్టో (46), రిలీ రొస్సో (43), శశాంక్‌ సింగ్‌ (25 నాటౌట్‌), సామ్‌ కర్రన్‌ (26 నాటౌట్‌) పంజాబ్‌ను గెలిపించారు. 

Gloucestershire Ben Wells Forced To Retire Due To Rare Heart Condition
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌

అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న ఇంగ్లండ్‌ కౌంటీ (గ్లోసెస్టర్‌షైర్‌) క్రికెటర్‌ బెన్‌ వెల్స్‌ 23 ఏళ్ల చిన్న వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.వెల్స్‌ అరుదైన అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతితో (ARVC) బాధపడుతున్నట్లు ఇటీవల జరిపిన హార్ట్‌ స్క్రీనింగ్‌ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ARVC సమస్యతో బాధపడుతున్న వారు శారీరక శ్రమకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు.శారీరక శ్రమ లేకుండా క్రికెట్‌ ఆడటం అసాధ్యం కాబట్టి వెల్స్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. కెరీర్‌ అర్దంతరంగా ముగియడంతో వెల్స్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. క్రికెట్‌ పట్ల తనకున్న మక్కువను వ్యక్తపరుస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. దీన్ని వెల్స్‌ కౌంటీ జట్టు గ్లోసెస్టర్‌షైర్‌ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.  వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అయిన వెల్స్‌.. 2021లో అరంగేట్రం చేసి స్వల్పకెరీర్‌లో ఓ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌, 15 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. వెల్స్‌ ఇటీవలే లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో మెరుపు సెంచరీతో మెరిశాడు. లండన్‌ వన్డే కప్‌లో భాగంగా డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్స్‌ ఈ సెంచరీ చేశాడు. వెల్స్‌కు లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇది తొలి శతకం. కాగా, ఇంగ్లండ్‌ జాతీయ జట్టు ఆటగాడు జేమ్స్‌ టేలర్‌ కూడా వెల్స్‌ బాధపడుతున్న గుండె సమస్య కారణంగానే క్రికెట్‌కు అర్దంతరంగా వీడ్కోలు పలికాడు. 

IPL 2024: SRH To Take On RR Today At Uppal Stadium, Hyderabad
ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం

ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు హైదరాబాద్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ​్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.  ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ఒక్క గుజరాత్‌ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ కొన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: అన్మోల్‌ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రోన్‌ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: రోవ్‌మన్ పావెల్]

Punjab Kings won by 7 wickets on chennai
‘కింగ్స్‌’ పోరులో పంజాబ్‌దే గెలుపు

చెన్నై: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించింది. గత శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పంజాబ్‌ కింగ్స్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. బుధవారం ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్లతో గెలిచింది. పంజాబ్‌ కింగ్స్‌ కెపె్టన్‌ స్యామ్‌ కరన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (48 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించాడు. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2/17), రాహుల్‌ చహర్‌ (2/16) చెన్నై జట్టును కట్టడి చేశారు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బెయిర్‌స్టో (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రిలీ రోసో (23 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 64 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక శశాంక్‌ సింగ్‌ (26 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), స్యామ్‌ కరన్‌ (20 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు) పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. గత మూడు సీజన్‌లలో చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. 2022లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్‌ 2023లో చెన్నైలోనే జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలిచింది.  కట్టడి చేసిన బ్రార్, చహర్‌ చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్, రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై వికెట్‌ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిశాక చెన్నై ఇన్నింగ్స్‌ తడబడింది. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్, రాహుల్‌ చహర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో బ్రార్‌ మూడు బంతుల తేడాలో రహానే, శివమ్‌ దూబే (0)లను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత పదో ఓవర్లో జడేజాను చహర్‌ అవుట్‌ చేశాడు. దాంతో చెన్నై జట్టు 64/0 నుంచి 70/3తో కష్టాల్లో పడింది. బ్రార్, చహర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ చెన్నై జట్టు బ్యాటర్లు వరుసగా ఎనిమిది ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. రబడ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ రెండో బంతికి రిజ్వీ బౌండరీ కొట్టి ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. స్యామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ రెండో బంతిని బౌండరీ దాటించిన రుతురాజ్, మూడో బంతికి సిక్స్‌ కొట్టి 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్‌ చివరి బంతిని రుతురాజ్‌ సిక్స్‌గా మలచడంతో ఈ ఓవర్లో చెన్నైకి 20 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన అర్‌‡్షదీప్‌ లయ తప్పి మూడు వైడ్‌లు వేసినా రుతురాజ్‌ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత అర్‌‡్షదీప్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లోనూ రెండు వైడ్‌లతో కలిపి ఎనిమిది బంతులు వేశాడు. ఈ ఓవర్లో ధోని ఒక ఫోర్, ఒక సిక్స్‌ కొట్టి చివరి బంతికి రనౌట్‌ అయ్యాడు. పంజాబ్‌ స్పిన్నర్లు బ్రార్, చహర్‌ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం.  స్కోరు వివరాలు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: అజింక్య రహానే (సి) రోసో (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 29; రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 62; శివమ్‌ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 0; రవీంద్ర జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) రాహుల్‌ చహర్‌ 2; సమీర్‌ రిజ్వీ (సి) హర్షల్‌ పటేల్‌ (బి) రబడ 21; మొయిన్‌ అలీ (బి) రాహుల్‌ చహర్‌ 15; ధోని (రనౌట్‌) 14; డరైల్‌ మిచెల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–64, 2–65, 3–70, 4–107, 5–145,  6–147, 7–162. బౌలింగ్‌: రబడ 4–0–23–1, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4–0–52–1, స్యామ్‌ కరన్‌ 3–0–37–0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–17–2, రాహుల్‌ చహర్‌ 4–0–16–2, హర్షల్‌ పటేల్‌ 1–0–12–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) రుతురాజ్‌ (బి) గ్లీసన్‌ 13; బెయిర్‌స్టో (సి) ధోని (బి) దూబే 46; రిలీ రోసో (బి) శార్దుల్‌ 43; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 25; స్యామ్‌ కరన్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1–19, 2–83, 3–113. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 0.2–0–4–0, శార్దుల్‌ ఠాకూర్‌ 3.4–0–48–1, గ్లీసన్‌ 3.5–0–30–1, ముస్తఫిజుర్‌ 4–1–22–0, జడేజా 3–0–22–0, మొయిన్‌ అలీ 2–0–22–0, శివమ్‌ దూబే 1–0–14–1. ఐపీఎల్‌లో నేడుహైదరాబాద్‌  X  రాజస్తాన్‌వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

IPL 2024: Punjab Kings beat CSK by 7 wickets
సీఎస్‌కేకు బిగ్‌ షాకిచ్చిన పంజాబ్‌.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ ఊహించని షాకిచ్చింది. చెపాక్‌ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. పంజాబ్‌ బౌలర్లలో పంజాబ్ బౌలర్లలో హార్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహ‌ర్ త‌లా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్‌, ర‌బాడ త‌లా వికెట్ సాధించారు.బెయిర్‌ స్టో, రోసౌ విధ్వంసం..163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు రుసౌ విధ్వంసం సృష్టించారు. బెయిర్‌ స్టో 46 పరుగులు చేయగా.. రుసౌ 43 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు కెప్టెన్‌ సామ్‌ కుర్రాన్‌(27), శశాంక్‌ సింగ్‌(25) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. సీఎస్‌కే బౌలర్లలో శివమ్‌ దూబే,శార్ధూల్‌ ఠాకూర్‌, గ్లీసన్‌ తలా వికెట్‌ సాధించారు. 

Advertisement
Advertisement

Sports

1
India
7020 / 58
odi
2
Australia
5309 / 45
odi
3
South Africa
4062 / 37
odi
4
Pakistan
3922 / 36
odi
5
New Zealand
4708 / 46
odi
6
England
3934 / 41
odi
7
Sri Lanka
4947 / 55
odi
8
Bangladesh
4417 / 50
odi
9
Afghanistan
2845 / 35
odi
10
West Indies
3109 / 44
odi
View Team Ranking
Advertisement
Advertisement