
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (మే 1) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పటిష్టమైన సీఎస్‌కేను సంచలనాల పంజాబ్ ఢీకొట్టబోతుంది. చెన్నై హోం గ్రౌండ్‌లో జరుగనున్న ఈ మ్యాచ్ జరుగనుంది.
చెన్నై ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. పంజాబ్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే సీఎస్‌కే ఈ మ్యాచ్ అత్యంత కీలకం కాగా.. ప్లే ఆఫ్స్ ఆశలను వదులుకున్న పంజాబ్ ప్రత్యర్దులను ఇరుకున పెట్టే పనిలో ఉంది. సీఎస్‌కే, పంజాబ్‌లు ఈ సీజన్‌లో మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 15, పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
తుది జట్లు (అంచనా)..
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతిరణ, ముస్తాఫిజుర్ రెహమాన్ [ఇంపాక్డ్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్/సమీర్ రిజ్వీ]
పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, జానీ బెయిర్‌స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ [ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ చాహర్]
Comments
Please login to add a commentAdd a comment