IPL 2024 MI Vs LSG: Lucknow Super Giants Beat Mumbai Indians By 4 Wickets, Check Full Score Details | Sakshi
Sakshi News home page

IPL 2024 MI Vs LSG Highlights: సూపర్‌ స్టొయినిస్‌...

Published Wed, May 1 2024 4:21 AM | Last Updated on Wed, May 1 2024 6:20 PM

Seventh defeat for Mumbai Indians

లక్నో ఖాతాలో ఆరో విజయం

ముంబై ఇండియన్స్‌కు ఏడో ఓటమి

లక్నో: బౌలర్లు శాసించిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పైచేయి సాధించింది. 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. తొలుత ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. నేహల్‌ వధెరా (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

 మోసిన్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్నో 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టొయినిస్‌ (45 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌) నెమ్మదించిన పిచ్‌పై కీలకపాత్ర పోషించాడు. హార్దిక్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. 

ముంబై 28/4 
మెరుపులు మెరిపించాల్సిన పవర్‌ ప్లేలో ముంబై కష్టాలపాలైంది. రోహిత్‌ (4), సూర్యకుమార్‌ (10), తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (0) ఇలా హిట్టర్లంతా వరుస కట్టడంతో 6 ఓవర్లలో ముంబై 28/4 స్కోరు చేసింది. 9వ ఓవర్లో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్‌ కిషన్‌కు లైఫ్‌ వచ్చింది... లేదంటే పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉండేది.

పదో ఓవర్లో ముంబై కష్టంగా 50 పరుగులు దాటింది. కిషన్‌ (36 బంతుల్లో 32; 3 ఫోర్లు), నేహల్‌ వధెరా ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. వీళ్లిద్దరు అవుటయ్యాక ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ ధాటిగా ఆడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 

మొదటి ఓవర్లోనే అర్శిన్‌ కులకర్ణి (0) డకౌటైనా... కెప్టెన్‌ రాహుల్‌ (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), స్టొయినిస్‌ క్రీజులో పాతుకుపోవడంతో పవర్‌ ప్లేలో లక్నో 52/1 స్కోరు చేసింది. కాసేపటికే రాహుల్‌ నిష్క్రమించినప్పటికీ స్టొయినిస్‌ తర్వాత వచ్చిన బ్యాటర్స్‌తో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు.

 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో స్టొయినిస్, టర్నర్‌ (5) అవుటైనప్పటికీ పూరన్‌ (14 బంతుల్లో 14 నాటౌట్‌; 1 సిక్స్‌) బాధ్యతగా ఆడి మిగతా లక్ష్యాన్ని పూర్తి చేశాడు. 

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) మయాంక్‌ (బి) బిష్ణోయ్‌ 32; రోహిత్‌ (సి) స్టొయినిస్‌ (బి) మోసిన్‌ 4; సూర్యకుమార్‌ (సి) రాహుల్‌ (బి) స్టొయినిస్‌ 10; తిలక్‌ వర్మ (రనౌట్‌) 7; హార్దిక్‌ (సి) రాహుల్‌ (బి) నవీనుల్‌ 0; నేహల్‌ (బి) మోసిన్‌ 46; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 35; నబీ (బి) మయాంక్‌ 1; కొయెట్జీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8;  మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–7, 2–18, 3–27, 4–27, 5–80, 6–112, 7–123. బౌలింగ్‌: స్టొయినిస్‌ 3–0–19–1, మోసిన్‌ 4–0–36–2, నవీనుల్‌ 3.5–0–15–1, మయాంక్‌ 3.1–0–31–1, రవి బిష్ణోయ్‌ 4–0–28–1, దీపక్‌ హుడా 2–0–13–0. 

లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) నబీ (బి) హార్దిక్‌ 28; అర్శిన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) తుషార 0; స్టొయినిస్‌ (సి) తిలక్‌ (బి) నబీ 62; హుడా (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 18; పూరన్‌ (నాటౌట్‌) 14; టర్నర్‌ (బి) కొయెట్జీ 5; బదోని (రనౌట్‌) 6; కృనాల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–1, 2–59, 3–99, 4–115, 5–123, 6–133. బౌలింగ్‌: తుషార 4–0–30–1, బుమ్రా 4–0–17–0, కొయెట్జీ 3–0–29–1, పియూశ్‌ చావ్లా 3–0–23–0, హార్దిక్‌ పాండ్యా 4–0–26–2, నబీ 1.2–0–16–1.   

ఐపీఎల్‌లో నేడు
చెన్నై X  పంజాబ్‌ 
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement