ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో ఉన్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసారిగా గెవాల్సిందే. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
స్టార్ పేసర్లు మతీషా పతిరానా, తుషార్ దేశ్‌పాండే దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో శార్ధూల్ ఠాకూర్, గ్లీసన్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఎటువంటి మార్పలు లేకుండా బరిలోకి దిగంది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, శశాంక్ సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రిచర్డ్ గ్లీసన్, ముస్తాఫిజుర్ రెహమాన్
Comments
Please login to add a commentAdd a comment