
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 150 మ్యాచ్‌ల విజయాలలో భాగమైన మొదటి ఆటగాడిగా ధోని రికార్డులకెక్కాడు.
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించడంతో ధోని ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌లో ధోనికి ఇది ఆటగాడిగా 150వ విజయం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 259 మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్.. 150 విజయాలు, 109 ఓటుముల్లో భాగమయ్యాడు.
42 ఏళ్ల ధోని ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతనిథ్యం వహించాడు. సీఎస్‌కే తరపున 135 మ్యాచ్‌లు, పూణె తరపున 15 మ్యాచ్‌ల విజయాల్లో ధోని పలుపంచుకున్నాడు.
ఇక సీఎస్‌కేను సారథిగా ధోని 5 సార్లు రికార్డు స్థాయిలో టైటిల్‌ను అందించాడు. అయితే ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అప్పగించేశాడు.
ఐపీఎల్‌లో అత్యధిక విజయాలను అందుకున్న ప్లేయర్స్ వీరే..
ఎంఎస్ ధోని - 150
రవీంద్ర జడేజా - 133
రోహిత్ శర్మ - 133
దినేష్ కార్తీక్ - 125
సురేష్ రైనా - 122
Comments
Please login to add a commentAdd a comment