ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు | Sakshi
Sakshi News home page

ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు

Published Thu, May 2 2024 1:19 PM

AP Pensioners facing Distribution Problems Infront of banks

గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్‌ కో బ్యాచ్‌ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.  

చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్‌ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు క్షుద్ర రాజకీయం

 చంద్రబాబు కుట్రలకు పెన్షన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్‌ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.

వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్‌ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో  పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.  కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.

చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో  అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని  ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement