ప్రధాన వార్తలు
టీడీపీది ప్రజాగళం కాదు ‘యమ’గళం: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దేవా చేశారు.కాగా, వరుదు కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘అబద్ధానికి పసుపు రాసినట్టు టీడీపీ ‘మాయా’నిఫెస్టో ఉంది. 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ఇవీ అని.. చెప్పే దమ్ము టీడీపీకి లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు నోబెల్స్ అయితే.. చంద్రబాబు ఆలోచనలు గోబెల్స్. గత టీడీపీ మేనిఫెస్టోలో కనీసం ఐదు హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు.రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని.. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పిన చంద్రబాబును జనం నమ్మరు. మీ మేనిఫెస్టోను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. టీడీపీ మేనిఫెస్టో చూసి ఓటు వేస్తే ప్రజలు నిండా మునిగిపోతారు. అమ్మ ఒడి, గోరుముద్ద, స్కూల్ విద్యార్థులకు ట్యాబ్స్ వద్దనుకుంటే టీడీపీకి ఓటెయ్యాలి. టీడీపీకి ఓటు వేస్తే నాడు-నేడు, ఆరోగ్య శ్రీ కొనసాగే పరిస్థితి లేదు. బీజేపీతో కూటమి కట్టిన చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా, రైల్వే జోన్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించవచ్చు కదా. టీడీపీది ప్రజాగళం కాదు.. యమగళం.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. మూలపేటలో పోర్ట్.. భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. విశాఖ రాజధాని ద్వారా ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగిపోతాయి. సీఎం జగన్ అభివృద్ధి పనులతో ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే ఉపాధి అవకాశాలు పెరిగాయి’ అని చెప్పుకొచ్చారు.
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న
ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా కమామిషు ఏంటో మీరే చదవండి..! సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్ జపాంగ్లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. దోపిడీకి ఆయనే ‘మూలం’ సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించింది. ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువే.రౌడీయిజం..ఆరణి నైజం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్‌లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్‌పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
AP పాలిటిక్స్
‘ఉండి’ టీడీపీ టికెట్: ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సాక్షి,పశ్చిమగోదావరి: తన నియోజకవర్గం నుంచి వేరొకరి...
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్
సాక్షి, పల్నాడు: మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (...
ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల రె...
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political U...
జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు
ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ ఎవరి మధ్య...
సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం
సాక్షి, పల్నాడు జిల్లా: ఉగాది సందర్భంగా ముఖ్యమంత్ర...
మన్యం ప్రజలు మీ వెంటే..
పార్వతీపురం మన్యం: మన్యంలో ‘ఫ్యాన్’ జోరు తగ్గలేదు...
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గు...
వీడియోలు
రైల్వే జోన్ పై కొత్త రాజకీయం
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
ఈరోజే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు