AP High Key Comments Over Janasena Glass Tumbler Symbol, Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ!

Published Wed, May 1 2024 12:44 PM | Last Updated on Wed, May 1 2024 4:54 PM

AP High Key Comments Over Janasena Glass Tumbler Symbol

సాక్షి, విజయవాడ: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు హైకోర్టులో ఊహించని షాక్‌ తగిలింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజ గ్లాస్‌ గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు ‍గ్లాస్‌ గుర్తు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈసీకి వ్యతిరేకంగా జనసేన కోర్టుకు వెళ్లించింది. దీంతో, ఈ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది.

ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేయనున్నట్టు ఈసీ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement