symbol dispute
-
‘గడియారం’ అజిత్ పవార్ వర్గానికే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టి(అజిత్ పవార్) అధ్యక్షుడు అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వాడుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ గుర్తు వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు ప్రచార సామగ్రిపై ముద్రించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గడియారం గుర్తుపై అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం మధ్య మొదలైన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల ప్రచారంలో ఈ గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోకుండా ఆదేశించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గడియారం గుర్తుతో శరద్ పవార్‌కు ఎంతో అనుబంధం ఉంది. గుర్తు విషయంలో ప్రజల్లో గందరగోళానికి తావు లేకుండా అజిత్ పవార్ వర్గానికి కొత్త గుర్తు కేటాయించాలని శరద్ పవార్ వర్గం సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఎన్నికల ప్రచారంలో వాడుకోవచ్చంటూ తేలి్చచెప్పింది. అయితే, ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ వర్గానికి నష్టం కలుగకుండా హామీ పత్రం సమర్పించాలని అజిత్ పవార్ వర్గాన్ని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీపీ రెండుగా చీలిపోగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించింది. -
ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ!
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజ గ్లాస్ గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈసీకి వ్యతిరేకంగా జనసేన కోర్టుకు వెళ్లించింది. దీంతో, ఈ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది.ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేయనున్నట్టు ఈసీ తెలిపింది. -
ములాయం ఆవేశం.. పార్టీకి ప్రమాదం!
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభంపై పార్టీ సీనియర్ నేత అబు అజ్మీ స్పందించారు. పార్టీ పగ్గాలు సీఎం అఖిలేశ్ యాదవ్‌కు అప్పగించడమే ఉత్తమమని, కుమారుడు అఖిలేశ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని నేతాజీ ములాయం సింగ్ యాదవ్‌కు సూచించారు. ములాయం కోపం విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, అఖిలేశ్‌కు మద్ధతు ఇవ్వాలని లేకపోతే పార్టీకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్' తమ వర్గానికే చెందాలని ములాయం ఈసీకి విన్నవించగా.. నేడు సీఎం అఖిలేశ్ వర్గం గుర్తు తమకే ఇవ్వాలని సీఈసీని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించనున్నారు. అఖిలేశ్ మద్ధతుదారుల వివరాలను బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ఈసీకి అందజేయనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తే పగ్గాలు ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని అఖిలేశ్ గతంలో పేర్కొన్నారు. పార్టీ నెగ్గితే మాత్రం తండ్రి ములాయం తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని అఖిలేశ్ గతంలోనే చెప్పారని ఎస్పీ నేత అబు అజ్మీ వివరించారు. సమష్టిగా పోటీచేసి భారీ మెజార్టీతో నెగ్గినా.. అఖిలేశ్‌ను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు కూడా అఖిలేశ్ వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకే ఆయనకు ములాయం సహకరిస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. యూపీ నేతలతో పాటు పార్టీ మహారాష్ట్ర నేతల మద్ధుతును అఖిలేశ్ కూడగట్టుకుని అభివృద్ధి వైపు నడిపిస్తారని తాజా సంక్షోభంపై యూపీ సీఎంకు అబు అజ్మీ తన మద్ధతు తెలిపారు. -
ఈసీ ముంగిట్లో ‘సైకిల్’ పంచాయితీ
-
ఈసీ ముంగిట్లో ‘సైకిల్’ పంచాయితీ
• ఎన్నికల సంఘాన్ని కలిసిన ములాయం వర్గం • అధ్యక్షుడిగా అఖిలేశ్ ఎంపిక చట్ట విరుద్ధమని ఫిర్యాదు • నేడు ఎన్నికల చీఫ్‌ను కలవనున్న అఖిలేశ్ వర్గం • ఎటూ తేలని ‘గుర్తు’ వివాదం న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీలో ‘గుర్తు’ వివాదం ఆసక్తికరంగా మారింది. పార్టీ స్థాపించినప్పటినుంచీ తనే అధ్యక్షుడిననీ.. పార్టీ గుర్తు తనకే చెందాలని ములాయం సింగ్ ఈసీకి విన్నవించగా.. మంగళవారం అఖిలేశ్ తరపున రాంగోపాల్ యాదవ్ తమ మద్దతుదారుల వివరాలు అందజేయనున్నారు. అయితే ఇరువర్గాల వాదనలను విన్నతర్వాతే గుర్తుపై నిర్ణయం ఉంటుందని ఈసీ తెలపటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. సోమవారం సాయంత్రం ములాయం సింగ్ నాయకత్వంలో శివ్‌పాల్, అమర్‌సింగ్, జయప్రద, తదితరుల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమై తమ వాదనలను వినిపించింది. ప్రస్తుత జాతీయాధ్యక్షుడిని తనేనని పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’ను మరెవరికీ కేటాయించకూడదని ములాయం ఈసీని కోరారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం పూర్తిగా అనధికారమని, రాజ్యాంగ విరుద్దమని, పార్టీలో పూర్తి మద్దతు తమకే ఉందని ములాయం అధికారులకు వివరించారు. ఎస్పీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ అధ్యక్షుడి తొలగింపునకు పార్లమెంటరీ బోర్డుకే ఉందని.. కానీ అలాంటి భేటీ జరగకుండానే తనను తప్పించటం చట్టవిరుద్ధమన్నారు. ఇప్పట్లో తేలటం కష్టమేనా? తాజా వివాదం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి సైకిల్ గుర్తు కేటాయిస్తారనే దానిపై నిర్ణయించేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ తెలిపారు. ఈసీ కూడా అఖిలేశ్ వర్గం వాదన వినకుండా గుర్తుపై నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సైకిల్ గుర్తును స్తంభింపజేయటమే ఈసీ ముందున్న మార్గమని రాజకీయ నిపుణులంటున్నారు.