సమాజ్‌వాదీ పార్టీలో ‘గుర్తు’ వివాదం ఆసక్తికరంగా మారింది. పార్టీ స్థాపించినప్పటినుంచీ తనే అధ్యక్షుడిననీ.. పార్టీ గుర్తు తనకే చెందాలని ములాయం సింగ్ ఈసీకి విన్నవించగా.. మంగళవారం అఖిలేశ్ తరపున రాంగోపాల్ యాదవ్ తమ మద్దతుదారుల వివరాలు అందజేయనున్నారు. అయితే ఇరువర్గాల వాదనలను విన్నతర్వాతే గుర్తుపై నిర్ణయం ఉంటుందని ఈసీ తెలపటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. సోమవారం సాయంత్రం ములాయం సింగ్ నాయకత్వంలో శివ్‌పాల్, అమర్‌సింగ్, జయప్రద, తదితరుల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమై తమ వాదనలను వినిపించింది.