-
యంగ్ ముఫాసా వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా?
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ప్రీక్వెల్‌కు సంబంధించి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిన పెంచేస్తున్నాయి. ముఫాసా చిన్నప్పటి కథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. -
నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్‌ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్లో నా కెరీర్ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్ హీరోయిన్ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. -
ఓటీటీలోకి 20 సినిమాలు.. హిట్ మూవీస్‌తో పాటు సిరీస్ కూడా!
బాక్సాఫీస్ దగ్గర కొన్నిసార్లు సీన్ డిఫరెంట్‌గా ఉంటుంది. టాక్ బాగున్నా పెద్దగా కలెక్షన్స్ ఉండవు. బాలీవుడ్లో మైదాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. వందల కోట్లు పెట్టి తీసిన అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియా అట్టర్ ఫ్లాప్ దిశగా అడుగులేస్తోంది. భీమా, ఫ్యామిలీ స్టార్.. రెండూ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ కంటే దిగువనే ఉన్నాయి.ఓటీటీ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్, భీమా వంటి పలు చిత్రాలు వెబ్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ గురు, శుక్రవారాల్లో ఇంకా ఏయే సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయో చూసేద్దాం..నెట్ఫ్లిక్స్శిక్షనేరక (ఇండోనేషియన్ చిత్రం)- ఏప్రిల్ 25ఫేస్ టు ఫేస్ (ఈజిప్షియన్ చిత్రం) - ఏప్రిల్ 25సిటీ హంటర్ (జపనీస్ చిత్రం) - ఏప్రిల్ 25డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 25టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ) - ఏప్రిల్ 26గుడ్‌బై ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26అమెజాన్ ప్రైమ్దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 26హాట్స్టార్భీమా (తెలుగు సినిమా) - ఏప్రిల్ 25థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్ జోవి స్టోరీ (ఇంగ్లీష్ డాక్యు సిరీస్) - ఏప్రిల్ 26క్రాక్: జీతేగా తో జియేగా (హిందీ మూవీ) - ఏప్రిల్ 26 జియో సినిమాయారియాన్ 2 (హిందీ మూవీ) - ఏప్రిల్ 25రాన్నీతి: బాలకోట్ అండ్ బియాండ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25ధక్ ధక్ - ఏప్రిల్ 25ఓ మై గాడ్ 2 (తెలుగు వర్షన్) - ఏప్రిల్ 25వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27బుక్ మై షోకుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 26లయన్స్ గేట్ ప్లేద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26అమెజాన్ మినీ టీవీచాచా విధాయక్ హై మారే (సిరీస్, మూడో సీజన్) - ఏప్రిల్ 25చదవండి: నా పిల్లలు చూస్తే నా పరువేం కావాలి.. నటుడు ఎమోషనల్ -
మార్వెల్ యూనివర్స్ నుంచి మరో సినిమా.. ట్రైలర్ అదుర్స్
మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
Monkey Man In OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ హాలీవుడ్ చిత్రం.. గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల భారత్ తప్ప అన్నిచోట్ల కూడా విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. మనోళ్లు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తుండగా.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం సర్ప్రైజ్ చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్.. ఆ తర్వాత హాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడే 'మంకీ మ్యాన్' మూవీతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగానూ చేశాడు. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ మూవీని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తీశాడు. ఫైట్స్ లాంటివి ఇష్టపడే ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూడొచ్చు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) ఇకపోతే సెన్సార్ ఇబ్బందుల వల్ల 'మంకీ మ్యాన్' మూవీ మన దేశంలో రిలీజ్ కాలేదు. ఇంకెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్న టైంలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే భారతీయ ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతానికైతే రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. 'మంకీ మ్యాన్' కథ విషయానికొస్తే.. ముంబైని పోలినట్లు యాతనా అనే సిటీ ఉంటుంది. ఇక్కడ ఉండే హీరో.. రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని మల్లయుద్ధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి ప్రత్యేకంగా పేరేం ఉండదు. ఇతడు.. ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి రక్షించేందుకు క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కొంటాడు. హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా నటించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్‌పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement