Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement

A to Z మూవీ న్యూస్‌

Advertisement

గాసిప్స్

View all

రివ్యూలు

View all
Advertisement

సినీ ప్రపంచం

Sanjay Leela Bhansali Heeramandi The Diamond Bazar Streaming In Telugu
తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్‌ వెబ్ సిరీస్‌..!

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్  హిట్‌ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం మరో విశేషం.ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్‌ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‍లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోషించారు.కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్‌లోని  రెడ్‍లైట్‍ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్‌లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‍లోని లాహోర్‌లో ఉంది. 

Naveen Chandra Got Best Actor At Dada Saheb Phalke Film Festival
హీరో నవీన్‌ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం

హీరో నవీన్‌ చంద్రకు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఆయనను వరించింది. ఈ ఏడాది  దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది.  భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్  పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఇన్స్పెక్టర్ రుషి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు 

Rajamouli Shares Latest Video Of Bahubali Trailer announcement
త్వరలోనే బాహుబలి ట్రైలర్‌.. రాజమౌళి పోస్ట్ వైరల్!

తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించారు. అంతకుముందే బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచింది. రెండు భాగాలుగా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వర్షం కురిపించింది.అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్ పేరుతో యానిమేటేడ్‌ సిరీస్‌ వస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో బాహుబలిని చిత్రాన్ని యానిమేటేడ్‌ వర్షన్‌లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.కాగా.. బాహుబ‌లి చిత్రాన్ని వివిధ రూపాల్లో తీసుకువ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని రాజ‌మౌళి గతంలో చాలాసార్లు ప్రస్తావించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజ‌మౌళి ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు హీరోగా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమాని తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.When the people of Mahishmati chant his name, no force in the universe can stop him from returning.Baahubali: Crown of Blood, an animated series trailer, arrives soon! pic.twitter.com/fDJ5FZy6ld— rajamouli ss (@ssrajamouli) April 30, 2024

Indraja Sankar Respond Negative Comments On Her Wedding
పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి

ప్రముఖ నటి ఇంద్రజ శంకర్.. సోషల్ మీడియా దెబ్బకు బలైపోయింది. తమిళ నటుడు రోబో శంకర్ కూతురు ఈమె. దళపతి విజయ్ 'విజిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసింది. నెల క్రితం చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తున్నా గానీ వివాదాలు మాత్రం ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్తతో కలిసి పాల్గొన్న ఇంద్రజ.. ఆ వివాదాలపై క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్‌ప్రైజ్)కార్తీక్ అనే వ్యక్తిని ఇంద్రజ శంకర్ పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకలకు తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల దగ్గర చాలామంది సెలబ్రిటీల వరకు హాజరయ్యారు. అయితే పెళ్లిలో ఇంద్రజ తన తండ్రికి ముద్దు పెట్టడం, కార్తీక్.. ఇంద్రజ తల్లితో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే వాటిని దురుద్దేశంతో చూడొద్దని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది.అలానే భర్తతో కలిసి తాను ఓ ఫొటోని పోస్ట్ చేయగా.. దానికి అసహ్యకరమైన కామెంట్స్ వచ్చాయని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది. 'నా మీద ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతడి పేరు సరిగా గుర్తులేదు. 'ఇప్పుడు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఎక్కువరోజులు కలిసుండలేరు. కొన్నిరోజులు ఆగితే విడివిడిగా ఇంటర్వ్యూ ఇస్తారు. త్వరలో విడాకులు తీసుకుంటారు' అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇలా కామెంట్స్ పెట్టడంతో నేను చాలా బాధపడ్డాను. అయినా వేరొకరి గురించి అలా ఎలా కామెంట్ చేస్తారు?' అని ఇంద్రజ తన ఆవేదనని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

Veteran actor Krishna Alluri Sitaramaraj 50 years completes in tollywood
అల్లూరికి అర్ధ శతాబ్దం

‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర  అల్లూరి సీతారామ రాజు గెటప్‌ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్‌లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్‌ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్‌’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్‌ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్‌ స్టార్‌. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్‌ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్‌లో స్కెచ్‌తో గీసిన ఎన్టీఆర్‌ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్‌బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్‌) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్‌. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్‌ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్‌ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్‌ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్‌ వాహినీ స్టూడియోలో షూటింగ్‌ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణపై ఫస్ట్‌ షాట్‌ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్‌ కాబట్టి అక్కడ గెస్ట్‌ హౌస్‌లు లేకపోవడంతో యూనిట్‌లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్‌. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్‌. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్‌.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్‌ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్‌ఆర్‌ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసేందుకు రెండే లెన్స్‌లు ఉండేవట. కాగా సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసే లెన్స్‌కి కెమెరా వ్యూఫైండర్స్‌ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్‌ సెట్‌ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్‌ఆర్‌ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు.   అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్‌ హిట్‌. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా,  ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్‌..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్‌లోని సంగం థియేటర్‌లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్‌ గోపాలకృష్ణన్‌ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్‌ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్‌ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్‌తో అన్నారు ఎన్టీఆర్‌. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్‌ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ.  ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’  తీయను’’ అన్నారు ఎన్టీఆర్‌.మహారథి చేతికి స్క్రిప్ట్‌ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్‌లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్‌ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్‌  ఈస్ట్‌మన్‌ కలర్‌లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్‌ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్‌... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన  విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్‌ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. 

Shalini Gave Ducati Bike To Ajith On His Birth Day 2024
స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్‌ప్రైజ్

డై హార్డ్ ఫ్యాన్స్ ఉండే హీరోల్లో తలా అజిత్ ఒకడు. తమిళనాడులో ఇతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. తెలుగులోనూ ఇతడికి ఓ మాదిరి గుర్తింపు ఉంది. అడపాదడపా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకునే ఇతడు ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. బుధవారం ఇతడి 53వ పుట్టినరోజు. ఈ క్రమంలోనే అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇతడి భార్య మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)1990లోనే నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజిత్.. 'ప్రేమ పుస్తకం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. తాజాగా బుధవారం అజిత్ 53వ పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.ఈ క్రమంలోనే అజిత్ భార్య షాలిని.. భర్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. బైక్స్ అంటే అజిత్ ఎంత ఇష్టమో బాగా తెలిసిన షాలిని.. ఈ బర్త్ డే కానుకగా డుకాటీ బైక్ బహుమతిగా ఇచ్చింది. మార్కెట్‌లో దీని ధర రూ.10 లక్షలు పైమాటే. ఏదేమైనా ఇలా బైక్ ఇచ్చి పుట్టినరోజు సర్‌ప్రైజ్ చేయడం అజిత్ అభిమానులకు తెగ నచ్చేసింది. (ఇదీ చదవండి: పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్) Shalini Ajith gifted Ducati bike for Thala #Ajith 🥰#HBDAjithKumar 🎉🎂#VidaaMuyarchi .. #AjithKumar#GoodBadUgly #Ajithkumar𓃵 pic.twitter.com/aWYnXAI5CU— 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) May 1, 2024

Upcoming OTT Release Movies In Telugu May 1st Week 2024
ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. ఈసారి కూడా థియేటర్లలో 'ప్రసన్నవదనం', 'కృష్ణమ్మ', 'జితేందర్ రెడ్డి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఉన్నంతలో సుహాస్ 'ప్రసన్నవదనం'పై కాస్త అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం చాలావరకు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఓ రెండు మాత్రమే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్-హిందీ చిత్రాల సంగతి పక్కనబెడితే 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' చిత్రాలు మాత్రమే చూడదగ్గవి అనిపిస్తున్నాయి. మిగతా వాటి గురించి రిలీజైతే తప్ప ఏం చెప్పలేం. ఇంతకీ ఈసారి ఓటీటీల్లోకి ఏం రాబోతున్నాయి. ఎందుకు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు)నెట్‌ఫ్లిక్స్ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) - ఏప్రిల్ 30టీ పీ బన్ (జపనీస్ సిరీస్) - మే 02సైతాన్ (హిందీ సినిమా) - మే 03ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04అమెజాన్ ప్రైమ్అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) - మే 01ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ) - మే 02క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03హాట్‌స్టార్ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 30మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 05మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05జియో సినిమామైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 01హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03ఆపిల్ ప్లస్ టీవీఅకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 01(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)

Naga Chaitanya Thandel Movie Ott Rights Sold For Huge Margin
భారీ ధరకు తండేల్‌ డిజిటల్ రైట్స్‌.. ఎన్ని కోట్లంటే?

అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రాజు అనే మత్స్యకారుడి పాత్రలో చైతూ కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. తండేల్‌ మూవీ ఓటీటీ డీల్‌ భారీ ధరకు అమ్ముడయ్యాయి. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న తండేల్‌ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 

Sanjay Leela Bhansali Crazy Web Series Streaming On This OTT
రియల్ స్టోరీతో వస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గంగూభాయి కతియావాడి. స్టార్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ముంబయిలో వేశ్యవాటిక నేపథ్యంలో వచ్చిన గంగూభాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.తాజాగా అలాంటి కథతోనే  సరికొత్త వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంజయ్. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ క్రేజీ వెబ్ సిరీస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమైంది. హీరామండి: ది డైమండ్ బజార్ పేరుతో వస్తోన్న  వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదికరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్‌లో మల్లికాజాన్‌గా మనీషా కొయిరాలా, ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా, బిబ్బోజాన్‌గా అదితి రావు హైదరీ, అలంజేబ్‌గా షర్మిన్ సెగల్, వహీదాగా సంజీదా షేక్, లజ్జోగా రిచా చద్దా నటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందించారు. పాక్‌లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  

Actress Samyuktha Menon Visited Kamakhya Temple
ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?

హీరోయిన్లు హిట్ కొట్టడం కాస్త కష్టమైన విషయం. కానీ హీరోయిన్ సంయుక్త మేనన్ మాత్రం తెలుగులో వరస సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా మూవీస్ ఏం చేయట్లేదు. దానికి కారణమేంటి తెలియదు గానీ సడన్‌గా ఈ మధ్య దేవాలయాలని సందర్శిస్తూ కనిపించింది. అయితే అసలు ఇలా ఎందుకు చేస్తుంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్)మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్.. 2016లోనే నటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 2022లో 'భీమ్లా నాయక్' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. బింబిసార, సర్, విరూపాక్ష చిత్రాలతో వరసగా హిట్స్ కొట్టింది. కానీ గతేడాది వచ్చిన 'డెవిల్' మూవీతో ఈమెకు దెబ్బపడింది. ఈ సినిమా వచ్చి నాలుగు నెలలు పైనే అవుతున్న కొత్త ప్రాజెక్టులైతే ఒప్పుకోలేదు.కొన్నిరోజుల ముందు తిరుపతిలో కనిపించిన సంయుక్త.. ఇప్పుడు అసోంలోని ప్రముఖమైన కామాఖ్య దేవాలయంలో కనిపించింది. అయితే ఈ గుడికి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, పెళ్లయిన తర్వాత పిల్లలు కోసం చూసే తల్లులు మాత్రమే ఇక్కడికి వెళ్తుంటారు. దీంతో సంయుక్త పెళ్లి కావాలని ఏమైనా వెళ్లిందా అని మాట్లాడుకుంటున్నారు. అలానే బాలీవుడ్‌కి వెళ్లే ప్రయత్నాల్లో ఉందని, అందుకే ఈ గుడికి వెళ్లిందని మరో కామెంట్ కూడా వినిపిస్తుంది. ఇన్నాళ్లు సినిమాలు అంటూ తిరిగిన సంయుక్త ఇలా పూజలు, భక్తి మోడ్ లోకి మారిపోవడం చూసిన ఆమె ఫ్యాన్స్.. ఇలా మారిపోయిందేంటి అని అనుకుంటున్నారు. అసలు నిజమేంటనేది సంయుక్తనే చెప్పాలి.(ఇదీ చదవండి: 'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!)     View this post on Instagram           A post shared by Samyuktha (@iamsamyuktha_)

Advertisement


Advertisement