
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అదరగొట్టారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు.
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32), నేహల్ వధేరా (46), టిమ్ డేవిడ్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (0), మొహమ్మద్ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
తుది జట్లు..
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్
Comments
Please login to add a commentAdd a comment