
ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు హైదరాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.
ఈ సీజన్‌లో రాజస్థాన్ ఒక్క గుజరాత్ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్‌లో ఉండగా.. సన్‌రైజర్స్ కొన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.
తుది జట్లు (అంచనా)..
సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్: అన్మోల్‌ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్: రోవ్‌మన్ పావెల్]
Comments
Please login to add a commentAdd a comment