ఎంపీ టికెట్‌ నిరాకరణ.. ఆప్‌లో చేరిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

ఎంపీ టికెట్‌ నిరాకరణ.. ఆప్‌లో చేరిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే

Published Wed, May 1 2024 3:57 PM

Former Congress Mla Dalvir Singh Goldy Join Aap

పంజాబ్‌ కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దల్వీందర్‌ సింగ్‌ గోల్డీ ఆమ్‌ ఆద్మీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

దల్వీందర్‌ కాంగ్రెస్‌ నుంచి సంగ్రూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం దల్వీందర్‌ సింగ్‌కు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్‌పాల్ సింగ్‌ ఖైరా పేరును కాంగ్రెస్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పంజాబ్‌ ఆప్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దల్వీందర్‌ సింగ్‌ పార్టీ చేరికపై భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ.. నా తమ్మడు, కష్టపని చేసే యువకుడు గోల్డీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గోల్డీ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ స్థానం నుంచి భగవంత్‌ మాన్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గోల్డీ పరాజయం పాలయ్యారు. ఆప్‌లో చేరిన అనంతరం పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించాని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు.  
 
పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌కు రాసిన రాజీనామా లేఖలో గోల్డీ, రాష్ట్ర నాయకత్వం పట్ల విసుగు చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
Advertisement