పౌరసత్వ సవరణ చట్టంపై దు్రష్పచారం
జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కలు చెక్కలే
కేంద్రంలో వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే..
ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లూ పనిచేస్తా..
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
అజంగఢ్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ చట్టాన్ని మాత్రం మీరు ఎప్పటికీ రద్దు చేయలేరు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి తేలి్చచెప్పారు.
గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్, జాన్‌పూర్, బదోహీ, ప్రతాప్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. సీఏఏ కింద కాందీశీకులకు భారత పౌరసత్వం కలి్పంచే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, వీరంతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులేనని చెప్పారు. మతం ఆధారంగా భారత్‌ను విడగొట్టడంతో వీరంతా బాధితులుగా మారి మన దేశానికి వచ్చారని, చాలాఏళ్లుగా ఇక్కడే కాందిశీకులుగా బతుకుతున్నారని తెలిపారు. ప్రాణభయంతో వలస వచి్చన బాధితులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే..
ఈసారి మూడు డోసుల బుజ్జగింపు విధానాలు
‘‘ఉత్తరప్రదేశ్‌లో గతంలో భయానక పరిస్థితులు ఉండేవి. పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష ప్రసాదించి వదిలేసేవారు. ముష్కరులకు రాజకీయ ముసుగేసి కాపాడుతూ ఉండేవారు. దీనివల్ల ఉగ్రవాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అయినా కొందరు విపక్ష నాయకుల ధోరణిలో మార్పు రావడం లేదు. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం వచి్చన తర్వాత మార్పు మొదలైంది.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ అనేవి రెండు పార్టీలు. నిజానికి అవి ఒకే దుకాణం. అక్కడ బుజ్జగింపు రాజకీయాలు, అబద్ధాలు, కుటుంబస్వామ్యం, అవినీతిని అమ్ముతుంటారు. ఈసారి వారు మూడు డోసుల బుజ్జగింపు విధానాలతో ముందుకొస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కాజేసి ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టాలని ప్రయతి్నస్తున్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో సగం దోచుకొని ఓటు బ్యాంక్‌కు అప్పగించాలని కుట్రలు పన్నుతున్నారు. దేశ బడ్జెట్‌లో ఏకంగా 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని భావిస్తున్నారు.
ఎన్నికల తర్వాత రాహుల్, అఖిలేశ్ విదేశాలకు వెళ్లిపోతారు
పశి్చమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచక, అవినీతి పాలనను ఉత్తరప్రదేశ్‌లోనూ తీసుకురావాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు భావిస్తున్నాయి. హిందువులను హత్య చేయడం, దళితులను, ఆదివాసీలను వేధించడం, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడమే తృణమూల్ కాంగ్రెస్ పాలన.
అలాంటి పాలన మనకు కావాలా? అనేది ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. జూన్ 4 తర్వాత మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లూ పని చేస్తానని గ్యారంటీ ఇస్తున్నా. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ), సమాజ్‌వాదీ పార్టీ యువరాజు(అఖిలేశ్ యాదవ్) విదేశాలకు వెళ్లిపోతారు. నోట్లో బంగారు చెంచాతో పుట్టిన బడాబాబులు ఈ దేశాన్ని సమర్థంగా నడపలేరు’’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు
‘‘ఈ లోక్‌సభ ఎన్నికలు మనకొక సువర్ణావకాశం. బలమైన ప్రభుత్వాన్ని నడిపించడంతోపాటు ఇండియా బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పే నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలి. ప్రజలు వేసే ఓటు బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు నేరుగా నరేంద్ర మోదీ ఖాతాలోకి చేరుతుంది.
ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తామంటున్నారు. నేను బతికి ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగనివ్వను. ఎక్స్–రే యంత్రాలతో ప్రజల ఆస్తులను సర్వే చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. అందుకే మనమంతా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ అజెండాను నేను బయటపెట్టా. దాంతో కాంగ్రెస్ ఎక్స్–రే యంత్రాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్నాయి’’.
Comments
Please login to add a commentAdd a comment