Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్‌లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

    కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన  సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో తనకు  బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. 

    చందు, పవిత్రజయరాం

    కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్‌ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం ఆక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. 
     

  • శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ దేవరలో జూనియర్ సరసన నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ప్రస్తుతం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఇటీవలే తన కాబోయే వరుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్ ‍పహారియా గురించి  మొదటిసారి  నోరు విప్పింది దేవర భామ.

    జాన్వీ మాట్లాడుతూ..'నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా లైఫ్‌లోకి వచ్చాడు. మేమిద్దరం కలసి పెరిగాం. అతను నా కలలను తనవిగా ఫీలవుతాడు. అలాగే నేను కూడా అతని కలలు నా సొంతం అనుకుంటా. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు మేము మద్దతుగా ఉంటాం' అని తెలిపింది. 

    కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఇలాంటి లక్షణాలు ఉండాలంటూ చెప్పుకొచ్చింది. గతంలోనూ బోనీ కపూర్‌ సైతం శిఖర్‌పై ప్రశంసలు కురిపించారు. మంచివాడని.. అందరితో త్వరగా కలిసిపోతారని తెలిపారు. జాన్వీతో పరిచయం కాకముందు ముందునుంచే శిఖర్‌ తనకు తెలుసని బోనీ అన్నారు. కాగా.. జాన్వీ  నటించిన మిస్టర్‌ అండ్‌ మిసెస్ మహీ ఈనెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.

  • యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్‌ అనే పేరుతో ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయనున్నారు.

    తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్‌ సంగీతమందిస్తున్నారు. ఫియర్ సాంగ్ అంటూ వస్తున్న ఫస్ట్‌ సింగిల్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్‌ బీజీఎం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో జైలర్‌లోని హుకుమ్‌ సాంగ్‌ కంపోజ్‌ చేసి అనిరుధ్‌ తనదైన మార్క్‌ చూపించారు. దీంతో దేవర సాంగ్‌ తర్వాత హుకుమ్‌ సాంగ్‌ మర్చిపోతారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్‌ చేయడంతో గూస్‌ బంప్స్‌ ఖాయంగా కనిపిస్తోంది.  

  • సింగర్‌ సుచిత్ర కోలీవుడ్‌ షేక్ చేస్తోంది. రోజుకొక బాంబు పేలుస్తోంది. గతంలో సుచీలీక్స్‌ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఆమె మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి సంచలన కామెంట్స్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.

    ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్‌ చేసింది. ‍అయితే ఈ సారి బాలీవుడ్‌ ప్రముఖులను టార్గెట్‌ చేసింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్‌ జోహార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్‌ ట్రిప్‌లో కార్తీక్‌ కుమార్, షారుక్, కరణ్‌ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.

  • రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కాస్త విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కన్నడ సీరియల్‌లో ఓ నటి హెల్మెట్‌ పెట్టుకోకుండా స్కూటీ నడపడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకీ అదేం సీరియల్‌? ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసుల రియాక్షనేంటో చూసేద్దాం..

    హెల్మెట్‌ లేకుండా..
    కన్నడలో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో సీతారామ ధారావాహిక ఒకటి. ఈ సీరియల్‌లోని ఓ ఎపిసోడ్‌లో నటి వైష్ణవి గౌడ స్కూటీ నడిపింది. అయితే హెల్మెట్‌ లేకుండా రోడ్డుపై దర్జాగా వెళ్లిపోయింది. ఇది చూసిన జయప్రకాశ్‌ అనే వ్యక్తి ఈ సీన్‌ను లైట్‌ తీసుకోలేదు. సెలబ్రిటీలను చూసి జనాలు కూడా చెడిపోతారని.. సమాజానికి తప్పుడు సందేశం పంపిన నటి వైష్ణవిపై, సీరియల్‌ డైరెక్టర్‌పై, సదరు ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    బండి యజమానికి సైతం ఫైన్‌
    దీనిపై స్పందించిన పోలీసులు ఈ సీన్‌ చిత్రీకరణ బెంగళూరులోని నందిని లే అవుట్‌లో షూట్‌ చేసినట్లుగా గుర్తించారు. వైష్ణవితో పాటు, ఆమె వాడిన బండి యజమానికి రూ.500 చొప్పున చలానా విధించారు. ఇది జరిగి ఐదారు రోజులు కావస్తోంది. ఈ ఘటనపై సీతారామ సీరియల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ స్పందిస్తూ.. ఇక మీద రాబోయే ఎపిసోడ్లలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

    చదవండి: భర్త కోసం స్పెషల్‌ పోస్ట్‌.. ఆ క్యాప్షన్‌ అర్థం అదేనా?

  • టైటిల్‌: విద్య వాసుల అహం
    నటీనటులు: రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, అవసరాల శ్రీనివాస్‌, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులు
    నిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్
    నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి 
    దర్శకత్వం: మణికాంత్‌ గెల్లి
    సంగీతం: కళ్యాణి మాలిక్‌
    ఎడిటర్‌ : అఖిల్‌ వల్లూరి
    ఓటీటీ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా(మే 17 నుంచి)

    ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్‌ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్‌ సినిమా మాదిరి ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    వాసు(రాహుల్‌ విజయ్‌) ఓ సంస్థలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్‌ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్‌ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్‌ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్‌ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్‌ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. 

    పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి?  గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్‌ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.. 
    పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్‌టైనింగ్‌గా తీస్తే చాలు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్‌ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్‌టైనింగ్‌ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్‌ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను తెరపై చక్కగా పండించాడు.

    పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతుంది. 

    అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే  బాగుండేదేమో.  డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్‌ చేయడం సినిమాకు ప్లస్‌ పాయింట్‌.  ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుంది కాబట్టి ఎంటర్‌టైన్‌ కావడానికి వీకెండ్‌లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. 

    ఎవరెలా చేశారంటే..
    ఈ జనరేషన్‌ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్‌ విజయ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.  ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్‌, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు  తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

    సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  
    -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

  • టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో టాలీవుడ్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం నటిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సైతం కన్నప్ప సెట్స్‌లో సందడి చేశారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ నటించనుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

    కన్నప్ప చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఈ చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. ఇటీవలే అక్షయ్‌కుమార్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్‌, నయనతారలు కీలక పాత్రల్లో నటించనున్నారు. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్‌ చేయనున్న సంగతి తెలిసిందే.
     

  • ఎవరైనా దేని గురించైనా ఆరా తీస్తే చాలు.. కొందరు ఏదీ దాచుకోకుండా ఉన్నదంతా కక్కేస్తారు. దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌ కూడా అంతే! మీడియా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా బదులిస్తుంటాడు. ఇంటి విషయాలను కూడా పూసగుచ్చినట్లు చెప్తుంటాడు. ఈ వైఖరి వల్ల పిల్లలు ఇబ్బందిపడుతున్నారట! ఈ విషయాన్ని బోనీ కపూరే వెల్లడించాడు.

    నా కుటుంబం గురించి అడగొద్దు
    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్‌కు.. పబ్లిక్‌గా కుటుంబం గురించి పొరపాటున ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? దీనివల్ల ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చాయా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకతడు 'ఇది చాలాసార్లు జరిగింది. అందుకే ఇంటర్వ్యూకి కూర్చునే ముందు అక్కడున్నవారికి కేవలం నా గురించి మాత్రమే అడగండి, నా కుటుంబం గురించి అడగొద్దు అని మరీ మరీ చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాను. 

    వాళ్లకు నచ్చదు
    అది నా పిల్లలకు అస్సలు నచ్చదు. ఎందుకలా ప్రతీది చెప్తావని కోప్పడతారు. ముఖ్యంగా యాక్టింగ్‌కు సంబంధించిన విషయాలను జనాలే తెలుసుకోవాలి తప్ప తమంతట తాముగా చెప్పకూడదంటారు. నేనేమో అవన్నీ ముందే లీక్‌ చేస్తుంటాను. వారు హర్ట్‌ అయ్యారని అర్థమవగానే తప్పయిపోయిందంటూ సారీ చెప్పేస్తాను' అని బదులిచ్చాడు.

    అందరం ఏడ్చేశాం
    ఈ మధ్య అలాంటిదేమైనా జరిగిందా? అన్న ప్రశ్నకు.. 'ఇప్పట్లో ఏమీ జరగలేదు కానీ గతంలో నేను మీడియా ముందు ఉన్నదంతా మాట్లాడటం వల్ల వాళ్లు చాలా అప్‌సెట్‌ అయ్యారు. నన్ను తిట్టారు. నేను బాధపడేసరికి ఏడ్చేశారు. నేనూ ఏడ్చేశాను. సారీ చెప్తుంటే అలా మాట్లాడొద్దని వాళ్లే బుజ్జగించారు' అని బోనీకపూర్‌ చెప్పుకొచ్చాడు.

    చదవండి: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది!

  • మరో క్రేజీ సినిమా ఓటీటీ రిలీజ్‪‌కి రెడీ అయిపోయింది. సుహాస్ హీరోగా నటించిన ఆ సినిమా పేరే 'ప్రనస్న వదనం'. విడుదలకు ముందే అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండటంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

    తెలుగులో ఈ మధ్య కాలంలో సుహాస్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. రీసెంట్‌గా 'ప్రసన్న వదనం'తో వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)

    'ప్రసన్నవదనం' కథేంటి?
    సూర్య (సుహాస్) ఓ రేడియో జాకీ. ఓ యాక్సిడెంట్ కారణంగా ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఇది ఓ లోపం. అదేంటంటే ఇతడికి మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్‌నెస్ అంటారు. ఈ సమస్యతో ఉన్నోడు కాస్త ఓ హత్యలో సాక్షి అవుతాడు.  అసలా మర్డర్ చేసిందెవరు? లోపమున్న హీరో నిందుతుల్ని ఎలా పోలీసులకు పట్టిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.

    ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో చూడాలంటే కాస్త కష్టం కానీ ఓటీటీలో మాత్రం క్రేజీగా ఆడేస్తాయి. ప్రస్తుతం అటు థియేటర్, ఇటు ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. వచ్చే వారం ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి 'ప్రసన్నవదనం'.. డిజిటల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్సులు గట్టిగా ఉంటాయనమాట.

    (ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్‍‌లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)

  • శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా(2022) సిమ్రితి హిరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డర్టీ ఫెలో. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి. యస్. బాబు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ దర్శకులు మల్లిడి వశిష్ఠ శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. 

    ఈ సందర్భంగా డైరెక్టర్‌ మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాం. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.

     

     

  • కోలీవుడ్ స్టార్‌ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా.  శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్‌ షూట్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్‌కు కళ్లు చెదిరే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

  • టైటిల్‌: మిరల్‌
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కే.ఎస్‌ రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు
    నిర్మాణ సంస్థ: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ & యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
    నిర్మాత: సీహెచ్‌ సతీష్‌ 
    దర్శకుడు: ఎం శక్తివేల్
    సంగీతం: ప్రసాద్‌ ఎస్‌ఎన్‌
    సినిమాటోగ్రఫీ:సురేష్ బాలా
    ఎడిటర్‌: కలైవానన్‌ ఆర్‌

    ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్‌ హీరో భరత్‌. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్‌ మూవీ ‘మిరల్‌’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తమిళ్‌లో 2022లోనే విడుదలై మంచి విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత అదేపేరుతో తెలుగులో విడుదల చేశారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఇటీవల విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(మే 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    సివిల్‌ ఇంజనీరింగ్‌ హరి(భరత్‌), రమ(వాణి భోజన్‌)లది ప్రేమ వివాహం. ఓ అపరిచితుడు ముసుగు వేసుకొని వచ్చిన తమ కుటుంబాన్ని హతమార్చినట్లు రమకు కల వస్తుంది. అదే నిజం అవుతుందని రమ భయపడుతుంది. ఇదే సమయంలో హరి ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటాడు. జాతకంలో దోషం ఉందని రమ తల్లి చెప్పడంతో తమ స్వస్థలంలో ఉన్న కులదైవానికి పూజలు చేయాలని ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. స్నేహితుడు ఆనంద్‌ ఫ్యామిలీని కూడా అక్కడకు రప్పిస్తాడు హరి. అక్కడ పూజలు చేసి ఓ ముఖ్యమైన పని కోసం అర్థరాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా నిజంగానే ముసుగు వేసుకున్న వ్యక్తి హరి ఫ్యామిలీపై దాడికి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడు? రమ కలలోకి ముసుగు వేసుకుంటున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు?  ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం హరి ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే?
    హారర్, సస్పెన్స్ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. అయితే కథనం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ భయపెట్టే విధంగా ఉంటేనే.. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు ఎం శక్తివేల్ కూడా ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మిరల్‌ కథను రాసుకున్నాడు. అయితే రాసుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. సస్పెన్స్‌ పేరుతో అసలు కథను దాచి.. అనవసరపు సన్నివేశాలతో ఫస్టాఫ్‌ సాగదీశాడు. కేవలం భయపెట్టడానికే కొన్ని సీన్లను రాసుకున్నాడు కానీ.. అసలు కథని ఆ సీన్లకి ఎలాంటి సంబంధం ఉండదు. 

    అయితే సెకండాఫ్‌లో అసలు మ్యాటర్‌ రివీల్‌ అయిన తర్వాత కథపై ఆసక్తిపెరుగుతంది. ప్రారంభం నుంచి ప్రీక్లైమాక్స్‌ వరకు సినిమాపై ఉన్న ఓ అభిప్రాయం.. ఆ తర్వాత మారిపోతుంది.  ప్రేక్షకుడు ఊహకందని విధంగా చివరి 20 నిమిషాల కథనం సాగుతుంది.  అయితే ఈ సస్పెన్స్‌, థ్రిల్లర్‌కి హారర్‌ ఎలిమెంట్స్‌ని యాడ్‌ చేయడం.. దానికి గల కారణం కూడా అంత కన్విన్సింగ్‌ అనిపించదు.  చాలా చోట్ల చిన్న చిన్న లాజిక్స్‌ మిస్‌ అయ్యారు.  కొన్ని సీన్లకు సరైన ముగింపే ఉండదు.  ఇక ఈ సినిమాకు మరో ప్రధానమైన లోపం డబ్బింగ్‌. కొన్ని సన్నివేశాల్లో అక్కడ జరుగుతున్న దానికి.. చెప్పే డైలాగ్స్‌కి సంబంధమే ఉండడు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. కొన్ని చోట్ల సన్నివేశాలకు సంబంధం లేకుండా బీజీఎం ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. 

    ఎవరెలా చేశారంటే.. 
    హరి పాత్రలో భరత్‌ జీవించేశాడు. మంచి భర్తగా, బాధ్యతాయుత కుటుంబ పెద్దగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమగా వాణి భోజన్‌ చక్కగా నటించింది. హీరోయిన్‌ తండ్రిగా నటించిన కేఎస్‌ రవికుమార్‌.. తనకున్న నటనానుభవంతో ప్రేక్షకులను ఎంగేజ్‌ చేశాడు.  మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణితో పాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా జస్ట్‌ ఓకే.  సినిమాటోగ్రఫీ బాగుంది.  ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

     

     

  • తమిళ నటుడు అజిత్‌ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.

    ఇదిలా ఉండగా.. అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. మార్క్‌ ఆంటోని చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్‌, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.

    కాగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల సైలెంట్‌గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటుందని అజిత్‌ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు, అజిత్‌ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.

    కాగా అజిత్‌ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారని.. జూన్‌ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్‌ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. 
     

  • వికాస్, శాంతిప్రియ జంటగా నటించిన సినిమా 'దర్శిని'. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించగా, ఎల్వీ సూర్యం నిర్మాత వ్యవహరించారు. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

    కథేంటి?
    సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య) ఫ్రెండ్స్. ముగ్గురూ కలిసి ఔటింగ్ కోసం సైంటిస్ట్ డాక్టర్ దర్శిని ఫామ్ హౌస్‌కి వెళ్తారు. అనుకోకుండా ఓ గదిలో సెన్సార్ ఉన్న పెన్ దొరుకుతుంది. దాని  బటన్ ప్రెస్ చేయగానే స్క్రీన్‌పై భవిష్యత్ చూపిస్తుంది. మరోవైపు అదే ఫామ్ హౌస్‌లో దర్శిని శవంలా కనిపిస్తుంది. ఇకపోతే ఓ పోలీస్ తన చెల్లి కనపడట్లేదని ఇక్కడికి వస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? ముగ్గుర్ని బెదిరించేది ఎవరు? ఆ భవిష్యత్తు మిషిన్ కథేంటి? అనేదే సినిమా స్టోరీ.

    (ఇదీ చదవండి: స్థల వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)

    ఎలా ఉందంటే?
    టైమ్ ట్రావెల్ కథలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాయి. అలా భవిష్యత్ చూపించే మెషీన్ అనే కాన్సెప్ట్‌తో స్టోరీ బాగానే అనుకున్నారు. కానీ కథనం మాత్రం కాస్త సాగదీశారు. సైన్స్ ఫిక్షన్ కథతో పాటు ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముగ్గురు ఫ్రెండ్స్‌ని ఎవరో చంపబోతున్నట్టు ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. అయితే తక్కువ పాత్రలతో దాదాపు ఒకే ఇంట్లో సినిమా అంతా తీశారు. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు!

    ఎవరెలా చేశారు?
    'దర్శిని'లో చేసిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ప్రధాన పాత్రల్లో చేసిన వికాస్, శాంతి ప్రియ పర్వాలేదనిపించారు. లివింగ్ స్టోన్ పాత్ర చేసిన సత్య నవ్వించగా, మిగిలిన వాళ్లు ఫరిది మేరకు యాక్ట్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. పాటలు ఓకే. దర్శకత్వం కూడా చాలా మెరుగుపరుచుకోవాల్సింది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉ‍న్నాయి.

    (ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)

  • కట్టుకున్న భర్త పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తేనే మహిళలు భరించలేరు. కానీ ఇక్కడ చెప్పుకునే మహిళ మాత్రం భర్త రెండో పెళ్లి చేసుకుంటే వారి పెళ్లికి వెళ్లి మరీ ఆశీర్వదించింది. ఇంతకీ ఆ మహిళ మరెవరో కాదు బాలీవుడ్‌ సీనియర్‌ నటి పూజా బేడీ. భర్త రెండో పెళ్లి చేసుకుంటే ఆమెతో స్నేహం కూడా చేసిందట. ఈ విషయాలన్నింటినీ పూజా బేడీ కూతురు, నటి ఆలయ ఎఫ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

    నాన్న రెండో పెళ్లికి..
    'నా తల్లిదండ్రులు విడిపోయారు. కానీ ఎప్పుడూ కలిసే కనిపించేవారు. మంచి ఫ్రెండ్స్‌లా కలిసిమెలిసుంటారు. ఇప్పటికీ గొప్ప మిత్రులుగానే కొనసాగుతున్నారు. ఎంతలా అంటే.. మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఆ వేడుకకు అమ్మ కూడా హాజరైంది. నాక్కూడా ఆ పిన్ని అంటే చాలా ఇష్టం. ఆ పిన్నికి పుట్టిన కుమారుడిని నా సొంత సోదరుడిలానే భావిస్తాను. వాళ్లిద్దరూ నాకెంతో ఇష్టం.

    విడాకులు మంచి నిర్ణయం
    నా జీవితంలో వాళ్లు లేకపోయుంటే అన్న ఆలోచనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. నా వరకైతే అమ్మానాన్న విడాకులు తీసుకుని మంచి పనే చేశారు. విడాకులను అంత పెద్ద సమస్యగా చూడకుండా చక్కగా హ్యాండిల్‌ చేశారు. వీళ్లు విడిపోయాక నాకు మంచి మనసున్న పిన్ని, తమ్ముడు దొరికారు.

    అమ్మ, పిన్ని ఎలా ఉంటారంటే?
    విడిపోయారన్న మాటే కానీ అమ్మానాన్నలు ఎప్పుడూ ఒకరిగురించి మరొకరు చెడుగా మాట్లాడుకోవటం నేను వినలేదు. పైగా అమ్మ, పిన్ని కూడా ఫ్రెండ్స్‌లా కలిసిపోవడం విశేషం' అని ఆలయ చెప్పుకొచ్చింది. పూజా బేడీ, బిజినెస్‌మెన్‌ ఫర్హాన్‌ 1994లో పెళ్లి చేసుకున్నారు. 2003లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. కాగా ఆలయ ఎఫ్‌.. ఈ ఏడాది రిలీజైన బడే మియా చోటే మియా, శ్రీకాంత్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

    చదవండి: Laya: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది!

  • ప్రస్తుత దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కీలకమైన ఐదో దశకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో మిగిలిన 13 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరగనుంది.  అయితే సరిగ్గా ఎన్నికల సమయంలోనే సోషల్ మీడియో ఓ వీడియో పోస్ట్ చేసింది హీరోయిన్‌ రష్మిక మందన్నా. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది. అసలేంటి ఆ వీడియో? ఇంతకీ నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో చూసేద్దాం పదండి.

    ఎలక్షన్స్‌ వేళ పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా చేసిన వీడియో పొలిటికల్‌ హాట్‌టాపిక్‌గా మారింది. అటు నార్త్‌లో ఇటు సౌత్‌లో టాప్ స్టార్‌గా దూసుకెళ్తున్న రష్‌.. కేంద్రంలోని మోదీ సర్కార్‌కు అనుకూలంగా చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో కొందరు నెటిజన్స్‌ ఆమెను ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.

    ముంబయిలోని సముద్రప్రాంతంలో నిర్మించిన అటల్‌ సేతు బ్రిడ్జిని ఉద్దేశించి రష్మిక ఓ వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్ చేసింది. అందులో ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతుందంటూ ప్రశంసలు కురిపించింది. రెండుగంటల పట్టే ప్రయాణం.. కేవలం 20 నిమిషాల్లోనే చేరుకుంటున్నట్లు ఆనందం వ్యక్తం చేసింది. యంగ్‌ ఇండియా అభివృద్ధిలో అద్భుతాలు సాధిస్తోందంటూ కొనియాడింది. దేశంలో మౌలికవసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉందన్న రష్మిక.. అభివృద్ధికే ఓటువేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ముద్దుగుమ్మ.

    ‍అయితే రష్మిక చేసిన వీడియోపై ఏకంగా మన ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారిని అనుసంధానం చేయడానికి మించిన సంతృప్తి ఏముంటుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రష్మిక మందన వీడియోను తన ఎక్స్‌ అకౌంట్‌లో షేర్ చేశారు ప్రధాని. అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌కు అటల్ సేతు అని పేరు పెట్టింది కేంద్రప్రభుత్వం. జనవరిలో ప్రధాని మోదీ దీనిని జాతికి అంకితం చేశారు. దేశంలోనే పొడవైన వంతెన అటల్ సేతు గుర్తింపును దక్కించుకుంది.

    కాగా.. ఈ నిర్మాణం అద్భుతమని ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. సీ లింక్‌  ప్రయాణం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా హర్షం వ్యక్తంచేశారు. తాజాగా ఎలక్షన్ టైమ్‌లో రష్మిక మందన వీడియో విడుదల చేయడంపై నెటిజన్లు రష్మికను ట్రోల్‌ చేస్తున్నారు. ఇదంతా బీజేపీ ప్రొపగాండాలో భాగమని కొందరు అంటుంటే.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లోకి వస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

  • భూవివాదంలో జూ.ఎన్టీఆర్.. ఏకంగా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. శుక్రవారం ఉదయం సడన్‌గా ఈ న్యూస్ బయటకొచ్చింది. పలు వెబ్ సైట్స్‌తో పాటు మీడియా ఛానెల్స్‌లోనూ ఇది వచ్చింది. దీంతో అసలేం జరిగిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో తారక్ టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. అసలు ఈ గొడవతో ఇతడికి సంబంధమే లేదని తేల్చి చెప్పింది.

    (ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్‍‌లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)

    అసలేం జరిగింది?
    జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లోని ఓ ఫ్లాట్‌ని ఎన్టీఆర్ 2003లో కొన్నాడు. గీత లక్ష‍్మి అనే మహిళ దీన్ని విక్రయించింది. అయితే 1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల్లో గీతలక్ష‍్మి కుటుంబం లోన్స్ తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎన్టీఆర్‌కి అమ్మేశారు. కానీ ఫ్లాట్ అమ్మేటప్పుడు కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే లోన్ ఉందని చెప్పి, దాన్ని క్లియర్ చేసిన తర్వాత తారక్‌కి భూమి తాలుకూ పేపర్లు తీసుకున్నారు.

    అయితే ఆ ఫ్లాట్‌ తనఖా పెట్టి లోన్ తీసుకుని, చెల్లించని కారణంగా ఆ భూమిపై హక్కులు తమవే అని పలు బ్యాంకులు నోటీసులిచ్చాయి. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్‌టీ(రుణ వసూళ్లు ట్రైబ్యునల్) తీర్పిచ్చిందని.. ఈ ఆదేశాల్ని రద్దు చేయాలని ఎన్టీఆర్ తాజాగా తెలంగాణ కోర్టుని ఆశ్రయించినట్లు వార్తలొచ్చాయి. అయితే తారక్ కోర్టుకెళ్లారనేది నిజం కాదని, అలానే ఆ ఫ్లాట్ 2013లోనే తారక్ అమ్మేశారని ఇప్పుడు అతడి పేరు ఉపయోగించొద్దని చెబుతూ  ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే ఈ ల్యాండ్ తో ఎన్టీఆర్ కి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న ఎన్టీఆర్.. తన పుట్టినరోజుని విదేశాల్లోనే కుటుంబంతో కలిసి జరుపుకోబోతున్నాడు.

    (ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)

  • కీర్తి సురేశ్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'మహానటి' మూవీతో నేషనల్ అవార్డు అందుకుంది. తనెంటో ప్రూవ్ చేసింది. దీని తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గానీ ఓ విషయంలో సంతృప్తి పడకూడదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

    (ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)

    ''మహానటి' తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథా పాత్రలు నటీనటుల జీవితం, వృత్తి పరమైన ఇమేజ్‌ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్ చేస్తాయి. మంచి పాత్రలకు ఉండే బలం అది. 'మహానటి' విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీని తర్వాత మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలనే భావన కలిగింది'

    'అయితే నేను చేసే అన్ని సినిమాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. షూటింగ్‌ స్పాట్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోని ఎమోషనల్‌ వెంటాడుతుందంటే అది మంచి పాత్ర. అయితే అలాంటి మ్యాజిక్‌ కొన్నిసార్లే జరుగుతుంది. అలానే ఒకేలాంటి పాత్రలు చేస్తుంటే అభిమానులకు బోర్‌ కొడుతుంది. అందుకే ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్)

  • బర్త్‌డే అంటేనే సెలబ్రేషన్స్‌.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్‌ డేలో వర్క్‌ పక్కనపెట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు, ఎంజాయ్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ 36వ బర్త్‌డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్‌.. విక్కీ బర్త్‌డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్‌ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్‌ సింబల్స్‌, మూడు కేక్‌ ఎమోజీలను క్యాప్షన్‌లో జత చేసింది. 

    ఆ క్యాప్షన్‌కు అర్థమదేనా!
    ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్‌లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్‌, కేక్స్‌.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్‌ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్‌ కదా.. అని ప్రశ్నించాడు. 

    రెండేళ్ల క్రితం కూడా..
    కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్‌.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!

    ఇద్దరూ సినిమాలతో బిజీ
    విక్కీ కౌశల్‌ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పీరియాడిక్‌ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్‌మస్‌ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది.

     

     

    చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ!

  • బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. రీసెంట్‌గా ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లలో హీరో బంధువులు కూడా ఉన్నారు. తాజాగా వాళ్ల అంత్యక్రియలకు సదరు హీరో హాజరు కావడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ అసలేం జరిగింది?

    (ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)

    సోమవారం సాయంత్రం మంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఘాట్‌కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. దాంతో దాని కింద 100 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. వీళ్లలో హీరో కార్తిక్ ఆర్యన్ అంకుల్ మనోజ్ చన్సోరియా(60), ఆంటీ అనిత (59) కూడా ఉన్నారు.

    తాజాగా వీళ్లిద్దరికీ అంత్యక్రియలు జరగ్గా.. కార్తిక్ ఆర్యన్ హాజరయ్యాడు. తన బంధువులకు తుది నివాళులు అర్పించాడు. ఇకపోతే హోర్డింగ్ కుప్పకూలిన కేసులో నిందితుడు భవేశ్ పాండేని పోలీసులు అరెస్ట్ చేశారు. భవేశ్ అత్యాశ, అధికారుల నిర్లక్ష‍్యమే ఈ ప్రమాదానికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

    (ఇదీ చదవండి: ఆ డైరెక్టర్‌ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు..: నటి లయ)

  • హీరోయిన్‌ లయ.. అప్పట్లో యూత్‌కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా ఫేవరెట్‌ హీరోయిన్‌. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే ఈ అందాల రాశి సినిమాలకు దూరమై దాదాపు పద్దెనిమిదేళ్లవుతోంది. మధ్యలో 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. తర్వాత సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిలైన ఈమె అక్కడ నాలుగేళ్లపాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టింది. కోవిడ్‌ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండటం మొదలుపెట్టింది.

    అందుకే ఇండియాకు వచ్చేశా
    తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. 'నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. నితిన్‌ 'తమ్ముడు' సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.

    నన్ను ఫాలో అవుతూ..
    అలాగే తన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ.. 'ఒక పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న డైరెక్టర్‌ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేటలో కారు పార్కింగ్‌ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ వచ్చాడు. మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండన్నాను' అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్‌ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.

    చదవండి: చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్

Business

  • బెంట్లీ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 'కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ' అధికారికంగా మార్కెట్లో లాంచ్ కాకముందే.. ఫోటోలు విడుదలయ్యాయి. ఇప్పటికి విడుదలైన ఫోటోల ప్రకారం.. బెంట్లీ కాంటినెంటల్ జీటీ మంచి స్టైలింగ్ అప్‌డేట్‌లను పొందుతుందని స్పష్టమవుతోంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.

    కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ టియర్‌డ్రాప్ డిజైన్ హెడ్‌లైట్‌లను పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇంకా టెస్టింగ్ దశలోనే ఉండటం వల్ల మొత్తం డిజైన్ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుందని స్పష్టమవుతోంది.

    బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈసీ ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్ రెండూ కలిసి 782 హార్స్ పవర్, 1001 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

    లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త బెంట్లీ కాంటినెంటల్ జీటీ పీహెచ్ఈవీ మొదట గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తరువాత భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు తెలియాల్సి ఉంది.

  • "మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.

    ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.

    'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు.

  • ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ  పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్‌ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్‌ యూరోలకు పెరిగింది.  

    ‘సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్‌ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.

    ఇన్ఫోసిస్‌లో
    2023లో రిషి సునాక్‌ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్‌ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్‌ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్‌ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. 

    కింగ్ చార్లెస్ సంపద
    ఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని,  600 మిలియన్‌ యూరోల నుండి  610 మిలియన్‌ యూరోలకు పెరిగినట్లు  సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్‌ చేసింది.  

    తగ్గిపోతున్న బిలియనీర్లు
    2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా..  మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .

    యూకేలోనూ భారతీయుల హవా
    బ్రిటన్‌లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్‌ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్‌ యూరోల నుండి 37.2 బిలియన్‌ యూరోలకు పెరిగింది. 
     

  • ట్విటర్‌ పూర్తిగా ఎక్స్‌.కామ్‌గా రీబ్రాండ్‌ అయ్యింది. ఎక్స్‌.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్‌ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్‌.కామ్‌ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్‌ మస్క్‌ శుక్రవారం తెలిపారు.

    ఎలోన్‌ మస్క్‌ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్‌. కామ్‌గా రీ బ్రాండ్‌ చేస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు.  

    అయితే నిన్నటి వరకు ట్విటర్‌ లోగో, బ్రాండింగ్‌ మారింది. కానీ డొమైన్‌ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్‌.కామ్‌ డొమైన్‌ స్థానంలో ఇప్పుడు ఎక్స్‌.కామ్‌ వచ్చి చేరినట్లు మస్క్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

    పోస్ట్‌ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని  గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్‌స్క్రిప్షన్‌ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.  

    2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్‌ కలిగి ఉన్న యూజర్‌ అకౌంట్‌లు ఎక్స్‌.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్‌ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్‌ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • ఏలియన్స్‌.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్‌ కలిగించే టాపిక్‌. ఎలియన్స్‌ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఎలియన్స్‌ లేవని తేల్చేశారు. 



    ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్‌ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్‌ లిస్ట్‌లోకి యాడ్‌ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఏలియన్స్‌ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.



    ఎలాన్‌ మస్క్‌..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్‌ మస్క్‌.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్‌ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్‌లో చిప్‌ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్‌ ఎక్స్‌ పేరుతో శాటిలైట్‌లు లాంచ్‌ చేసినా.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌ అని పేరు మార్చినా అది.. ఎలాన్‌ మస్క్‌కే సాధ్యం.



    అలాంటి ఇలాన్‌ మస్క్‌.. ఏలియన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్‌ లేవని మస్క్‌ తేల్చిపారేశారు. ఏలియన్స్‌ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్‌లో పాల్గొన్న మస్క్‌.. ఏలియన్స్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్‌ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్‌ బ్యాండ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్‌ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్‌ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్‌ ఉనికే లేదని చెప్పేశారు.

    మరి నిజంగానే ఏలియన్స్‌ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్‌ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్‌ మస్క్‌ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..!

  • దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,464 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 249 పాయింట్లు పుంజుకుని 73,917 వద్ద ముగిసింది.

    సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీసుజుకీ, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

    టీసీఎస్‌, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, భారతీఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా తన కస్టమర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తన జెరోధా కైట్‌లో ట్రేడర్ల కోసం నోట్స్‌ అనే ఫీచర్‌ను డెవలప్‌ చేసింది.

    జెరోధా కైట్‌లో ట్రేడింగ్‌ చేసే ఇన్వెస్టర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్విరామంగా ట్రేడింగ్‌ చేసుకోవచ్చు. అదే సమయంలో ట్రేడర్లు ఆయా స్టాక్స్‌పై ఇన్వెస్ట్‌మెంట్‌ ఎందుకు చేస్తున్నామో తెలుసుకునేందుకు ఈ నోట్స్‌ ఫీచర్స్‌తో ట్రాక్‌ చేసుకోవచ్చని జెరోధా ప్రతినిధులు చెబుతున్నారు.  

     

     ప్రస్తుతం ఈ ఫీచర్‌ కౌట్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉందని, త్వరలోయాపల్‌లో సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు జెరోధా ట్వీట్‌ చేసింది. ‘ఏ సమయంలోనైనా, మీరు వివిధ కారణాల వల్ల పలు స్టాక్స్‌ను ట్రాక్‌ చేయొచ్చు. కొన్ని సార్లు మీరు ఆయా స్టాక్స్‌ ఎందుకు ఎంచుకున్నారో గుర్తించుకోవడం కష్టం. ఆ సమస్యను అధిగమించేలా నోట్‌ అనే టూల్‌ను అందిస్తున్నట్లు జెరోధా తన ట్వీట్‌లో పేర్కొంది.

     

  • భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విభాగంలో భారీ పెట్టుబడులను పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఏకంగా రూ. 12000 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.

    కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పెట్టుబడిన పెట్టింది. 2027 నాటికి మహీంద్రా ఆరు బ్యాటరీతో నడిచే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్దికి వేలకోట్ల పెట్టుబడి పెట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ భారీగా పెరిగాయి.

    UK ఆధారిత కంపెనీ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (BII) 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, Temasek మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంగీకరించిన కాలక్రమం ప్రకారం మిగిలిన రూ.900 కోట్లను టెమాసెక్ పెట్టుబడి పెడుతుందని కంపెనీ తెలిపింది.

  • ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాలసీ సమయంలో మోసపూరిత పద్ధతులను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 36వేల మంది పాలసీదారులు ఈ సర్వేలో పాల్గొన్నారని సంస్థ తెలిపింది. ఇందులో 66 శాతం మంది పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నట్లు చెప్పింది. 49% మంది టైర్ 1 సిటీ నుంచి, 24% మంది టైర్ 2 సిటీ, 27% మంది టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు సర్వేలో పాల్గొన్నట్లు లోకల్‌సర్కిల్స్‌ తెలియజేసింది.

    సర్వేలోని వివరాల ప్రకారం.. ఆన్‌లైన్ బీమాను కొనుగోలు చేసిన 61 శాతం మంది ‘సబ్‌స్క్రిప్షన్ ట్రాప్’లో పడుతున్నారు. తర్వాత తమ పాలసీని రద్దు చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. 86% బీమా ప్లాట్‌ఫారమ్‌లు తరచూ ‘నగ్గింగ్’ విధానాన్ని ఉపయోగిస్తున్నాయి. పాలసీని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సరైన పరిష్కారం చూపకుండా సందేశాలతో సమాధానమిస్తున్నాయి. 57% మంది పాలసీదారుల నుంచి ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు అనవసరమైన వ్యక్తిగత వివరాలు కోరుతున్నాయి. ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.

    ‘జీవిత బీమా, ఆరోగ్య బీమా, మోటారు, ఆస్తి.. వంటి బీమా పాలసీలను అమ్మేప్పుడు పాలసీదారులకు ఏజెంట్లు పూర్తి వివరాలు తెలియజేయడం లేదు. తమ టార్గెట్లు చేరుకోవాలనే ప్రయత్నంలో ఎక్కువ ఇన్సెంటివ్‌ ఉన్నవాటికే ఏజెంట్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులోని పరిమితులు, నిబంధనలను చెప్పడంలేదు. పాలసీదారులు కూడా ఆ ‘టర్మ్స్‌ అండ్‌ కండిషన్‌’ పత్రాలను పూర్తిగా చదవకుండానే పూర్తిగా ఏజెంట్‌ను నమ్మి బీమా తీసుకుంటున్నారు. ఏదైనా ఒక పాలసీ పరిమిత కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇస్తూ లేనిఅత్యవసరాన్ని సృష్టిస్తున్నారు’ అని లోకల్‌ సర్కిల్స్‌ తెలిపింది.

    ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీమా రెన్యువల్‌, రద్దుకు సంబంధించిన ఫిర్యాదులు అధికమవుతున్నాయని నివేదిక తెలిపింది. గత 9 నెలల్లో ఆన్‌లైన్ బీమా ప్లాట్‌ఫామ్‌లపై మిస్ సెల్లింగ్, మానిప్యులేటివ్ సెల్లింగ్ ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సర్వే ద్వారా తెలిసింది.

    ఇదీ చదవండి: ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!

    ఆన్‌లైన్‌ బీమా ప్లాట్‌ఫామ్‌లు పాటించకూడని 13 అంశాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గతేడాది నవంబర్‌లో నిషేధం విధించినట్లు నివేదిక తెలిపింది. అందులో ప్రధానంగా అత్యవసరాన్ని సృష్టించడం, వినియోగదారులకు పాలసీ లేదంటూ హేళన చేయడం, బలవంతంగా పాలసీని కట్టబెట్టడం, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్, ప్లాన్‌ ధర తగ్గినట్లు చూపడం, అస్పష్టమైన ప్రకటనలు.. వంటి అంశాలపై నిషేధం విధించారు.

  • ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్‌ సూపర్‌ రిచ్‌ క్లబ్‌లో చేరినట్లు తెలుస్తోంది.  

    బ్లూంబెర్గ్‌ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది.  

    15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్‌ దిగ్గజం ‘లో రియాల్‌’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌, డెల్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్‌లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు.  

    1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.

    ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్‌ కారణంగా  డెట్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.

    లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్‌వీఎంహెచ్‌ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ రెండవ స్థానం, ఎలాన్‌ మస్క్‌ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్‌ గ్రూప్‌లోకి  భారత్‌ నుంచి ముఖేష్‌ అంబానీ గౌతమ్‌ అదానీ సైతం చోటు  దక్కించుకోవడం గమనార్హం. 

  • ప్రముఖ నటి 'మలైకా అరోరా' ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశిష్ హన్స్‌కి మూడు సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంట్‌ నెలవారీ రెంట్ రూ. 1.57 లక్షలు. అయితే ఓ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా అద్దె 5 శాతం పెరుగుతుంది.

    అద్దెదారు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1.5 లక్షలు, రెండవ సంవత్సరంలో నెలకు రూ. 1.57 లక్షలు, మూడవ సంవత్సరంలో నెలకు రూ. 1.65 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దెదారు కాశిష్ హన్స్  4.5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది.

    మలైకా అరోరా తన అపార్ట్‌మెంట్‌లను అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె తన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను ది జెఫ్ గోల్డెన్‌బర్గ్ స్టూడియో యజమాని జెఫ్రీ గోల్డెన్‌బర్గ్‌కు నెలకు రూ.1.2 లక్షలకు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు మరోమారు తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చింది.

  • రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తనయుడు, రిలయన్స్‌ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అనంత్‌ అంబానీపై క్రిప్టోముఠా సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేస్తోంది. క్రిప్టో కరెన్సీతో అధిక లాభాలు వస్తాయని అనంత్‌ అంబానీ అంగీకరించినట్లు అమాయకులను మోసగిస్తూ ఆయన పేరును వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

    వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేసినట్లుగా, ఆయనపై బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు వేసినట్లుగా బీబీసీ పేరుతో క్లిక్‌బైట్‌ హెడ్డింగ్‌లతో క్రిప్టో ముఠా రూపొందించిన తప్పుడు కథనాలు ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

    'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబానీ తన సహాయకుడు "1X ఆల్రెక్స్ ప్లాట్‌ఫారమ్"ని ఉపయోగించి డబ్బు సంపాదించాడని చెప్పినట్లుగా ఓ కథనం పేర్కొంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో కూడా అంబానీ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయించారని, అతను వెంటనే లాభం పొందాడని పేర్కొంది. ఇవన్నీ తప్పుడు కథనాలే అని ఆయా వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. నెటిజన్లను తప్పుదోవ పట్టించి క్రిప్టో కరెన్సీ ద్వారా మోసగించేందుకే క్రిప్టో ముఠాలు ఇలా చేసినట్లు తెలుస్తోంది.

  • కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఫలితంగా భారీగా తొలగింపులు జరిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్‌ వ్యాపారంలో డిమాండ్‌ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికలకు, గణనీయమైన నియామకాలకు దారితీసింది.

    రానున్న 18 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు
    హోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలలో వృద్ధిని పొందేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాయి. టీమ్స్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనాల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగం రాబోయే 12-18 నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకమిక్‌ టైమ్స్‌ నివేదించింది.

    దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుదలను సూచిస్తున్న అంచనాలతో, హోటల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫార్చ్యూన్ హోటల్స్ ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళికల ద్వారా నియామకంలో 8-10 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇక లెమన్ ట్రీ తమ ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు మద్దతుగా వేలాది మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    డిమాండ్ వీరికే..
    ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్‌ రిలేషన్స్‌ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్‌ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు మ్యాన్‌పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు ప్రత్యేకించి పరిశ్రమలో విస్తృత ఆధారిత పునరుద్ధరణను సూచిస్తున్నాయి.

    ఇక్రా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ 7-9 శాతం స్థిరమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇది ఈ రంగం స్థితిస్థాపకత, పునరుద్ధరణ పథాన్ని నొక్కి చెబుతోంది. సాంప్రదాయ హోటల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా హైరింగ్‌లో స్పీడ్‌ పెంచనున్నాయి.

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ:  ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం)
    ఏర్పాటైంది.  ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను  ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    సిట్‌లో సభ్యులుగా.. ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు..వీ శ్రీనివాసరావు, రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, ఎన్‌ ప్రభాకర్, శివ ప్రసాద్‌లు సిట్ సభ్యులుగా నియామకమయ్యారు.

    కాగా ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్రపైన విచారణ జరపనుంది. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

  • విజయవాడ:   ఓ మహిళా డాక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఓ బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురై గుండె ఆగిన క్రమంలో సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు మహిళా డాక్టర్‌

    వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్‌లో సాయి అనే ఆరేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.  దాంతో ఆ బాలుడి గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్‌ రవళి ఆ ఘటనను చూశారు.  

    ఆ బాలుడి పరిస్థితిని గమనించిన ఆమె..  ఉన్నపళంగా సీపీఆర్‌ చేశారు.  కొన్ని నిమిషాల పాటు సీపీఆర్‌ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్‌ చేసిన పెద్ద సాయానికి, ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Sports

  • ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ ప్లేయర్‌ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించారు. ఇందులో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో చేలరేగాడు. అర్జున్‌ టెండూల్కర్‌ వేసిన 15 ఓవర్లో వరుస బంతుల్లో నికోల పూరన్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 29 బంతుల్లో 75 పరుగులు నికోలస్‌ పూరన్‌ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరికీ నువాన్ తుషార బౌలింగ్‌లో ఔటై వెనుదిరిగారు. 
     

    అయితే ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు లక్నో సూపర్‌ జైయింట్స్‌కు సైతం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేనట్లే. ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న లక్నోకు రన్‌రేట్‌ లేకపోవడం వారి అవకాశాలు దెబ్బతీసింది. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదు. కాగా.. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. మరో స్థానం కోసం ఆర్సీబీ, చెన్నై పోటీ పడుతున్నాయి. 
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చేసిన పనికి ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘‘నువ్వు చాలా మంచోడివి కమిన్స్‌ మామా.. మా హృదయాలు గెలుచుకున్నావు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    ఇదంతా కేవలం.. సన్‌రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చినందుకు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే! ఆరెంజ్‌ ఆర్మీ ఆఖరిసారిగా 2020లో ప్లే ఆఫ్స్‌ చేరింది.

    ఆ తర్వాత గత మూడేళ్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడింది. అయితే, ఐపీఎల్‌-2024లో మాత్రం పూర్తిగా సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడు టాప్‌-2 రేసులోనూ సన్‌రైజర్స్‌ముందు వరుసలో ఉంది.

    టికెట్‌ కన్ఫామ్‌
    ఆస్ట్రేలియా సారథి, 2023 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ప్యాట్‌ కమిన్స్‌, కొత్త కోచ్‌ డానియల్‌ వెటోరి రాకతో ఆరెంజ్‌ ఆర్మీ ఇలా విజయవంతమైన పంథాలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్తుపై కన్నేసిన కమిన్స్‌ బృందం గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దు కావడంతో టికెట్‌ కన్ఫామ్‌ చేసుకుంది.

    ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తర్వాత టాప్‌-4లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది. లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే టాప్‌-2కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

    ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కమిన్స్‌
    ఇదిలా ఉంటే.. రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌ చేర్చిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కెప్టెన్‌ సాబ్‌.. అక్కడి పిల్లలతో సరదాగా క్రికెట్‌ ఆడాడు.

     ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. 

    కాగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటి దాకా ఆడిన 13 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఒకటి రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. కమిన్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటి దాకా 14 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. కాగా 2024 వేలంలో సన్‌రైజర్స్‌ అతడిని రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

  • ‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్‌ వర్కర్‌ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునిల్‌ ఛెత్రి అన్నాడు.  అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.

    కాగా భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్ సునిల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్‌ 6న తన చివరి మ్యాచ్‌ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.

    ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతా
    వచ్చే నెల 6న ప్రపంచకప్‌ ఆసియా జోన్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా కువైట్‌తో జరిగే మ్యాచే తన కెరీర్‌లో చివరిదని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియో షేర్‌ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.

    అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతానని  ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. 

    ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్‌ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్‌బాల్‌లో అసాధారణ ఫార్వర్డ్‌ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు.  

    ఆరోజు ఏడుస్తూనే ఉంటా
    ఇక తన రిటైర్మెంట్‌ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్‌ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్‌ అవుతాను.. జూన్‌ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్‌ 8న కాస్త రిలాక్స్‌ అవుతాను. జూన్‌ 8 నుంచి బ్రేక్‌ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.

    సునిల్‌ ఛెత్రి సాధించిన ఘనతలు 
    👉150 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన సునీల్‌ 94 గోల్స్‌ కొట్టాడు. భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌ కాగా... ఓవరాల్‌గా ఫుట్‌బాల్‌ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్‌–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్‌; పోర్చుగల్‌), మెస్సీ (106 గోల్స్‌; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 
    👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్‌ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 
    👉దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) చాంపియన్‌షిప్‌లో భారత్‌ మూడు (2011, 2015, 2021) టైటిల్‌ విజయాలకు కృషి చేశాడు. 
    👉2008లో ఏఎఫ్‌సీ చాలెంజ్‌ కప్‌ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచాడు. భారత్‌లోని ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌లైన ఈస్ట్‌ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్‌ ట్రోఫీలు అందించాడు.

    ‘అతనో ఫుట్‌బాల్‌ శిఖరం’ 
    భారత బ్యాటింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్, భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్‌ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్‌ లెజెండ్‌గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్‌ చేశాయి.

    నాకు ముందే తెలుసు
    ఛెత్రి రిటైర్మెంట్‌ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి.  అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్‌ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్‌ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.

    చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్‌ రెడ్డి రియాక్షన్‌ ఇదే

  • ఐపీఎల్‌-2024 ముగిసిన వారం రోజుల్లోపే మరో మెగా ఈవెంట్‌ క్రికెట్‌ ప్రేమికుల ముందుకు రానుంది. టీ20 ప్రపంచకప్‌-2024 రూపంలో మరోసారి పొట్టి ఫార్మాట్‌ మజాను అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌ సహా మిగిలిన ప్రధాన దేశాల క్రికెట్‌ బోర్డులు జట్లను ప్రకటించాయి.

    అప్పుడు సెమీస్‌లోనే
    జూన్‌ 1 నుంచి ఆరంభం కానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు అమెరికాతో కలిసి వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు రోహిత్‌ శర్మనే సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్‌ రెండో దఫా కెప్టెన్‌ హోదాలో బరిలోకి దిగనున్నాడు.

    గత ప్రపంచకప్‌-2022లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ సేన ‌సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ మధ్య ఫైనల్‌ జరుగగా ఇంగ్లిష్‌ జట్టు విజేతగా అవతరించింది. ఇక ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

    టైటిల్‌ రేసులో నిలిచే జట్లు ఇవే
    ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో గట్టి పోటీనిచ్చే, టైటిల్‌ రేసులో నిలిచే జట్లు ఇవేనంటూ తన అంచనా తెలియజేశాడు.

    ‘‘ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. అలాగే ఆతిథ్య  వెస్టిండీస్‌.. ఈ నాలుగు జట్లే మెగా ఈవెంట్లో కీలకంగా మారనున్నాయి’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. అయితే, ఈ లిస్టులో ఆయన డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌, గత ఎడిషన్‌ రన్నరప్‌ పాకిస్తాన్‌ పేర్లను విస్మరించడం గమనార్హం.

    కాగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్‌ గ్రూపు-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు కెనడా, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఇక జూన్‌ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత జూన్‌ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది.

    టీ20 ప్రపంచకప్‌-2024- ఏ గ్రూపులో ఏ జట్టు?
    👉గ్రూప్‌-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్‌, పాకిస్తాన్‌(ఏ2), యూఎస్‌ఏ
    👉గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్‌(బీ1), నమీబియా, ఒమన్‌, స్కాట్లాండ్‌.
    👉గ్రూప్‌-సి: అఫ్గనిస్తాన్‌, న్యూజిలాండ్‌(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్‌ ఇండీస్‌(సీ2).
    👉గ్రూప్‌-డి: బంగ్లాదేశ్‌, నేపాల్‌, నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2). 

    చదవండి: RCB vs CSK: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరదు! అదెలా?.. మధ్యలో లక్నో!

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.

    జోనల్‌ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో భాగమవుతున్నారు.

    బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్‌లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్‌.. మూడో సీజన్‌ కోసం సిద్ధమైంది.

    ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్‌ చేసుకున్నాయి.

    ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.

    ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్‌ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్‌ సెన్సేషన్‌ కోసం గోదావరి టైటాన్స్‌ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.

    ఈ విషయం తెలియగానే నితీశ్‌ కుమార్‌ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

    కాగా ఐపీఎల్‌-2024 వేలంలో భాగంగా వైజాగ్‌ కుర్రాడు నితీశ్‌ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ  ఆల్‌రౌండర్‌ 7 ఇన్నింగ్స్‌ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు. 

     

National

  • పశ్చిమ బెంగాల్‌లోని బన్‌గావ్‌ నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సీఏఏ అనుకూల ప్రచారంతో బీజేపీ.. వ్యతిరేక ప్రచారంతో టీఎంసీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి.. ఎక్కువ సంఖ్యలో ఉన్న మథువాల మద్దతు ఎవరికి ఉంది..? బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకుంటుందా..? లేక టీఎంసీ మళ్లీ పుంజుకుంటుందా..?

    బన్‌గావ్‌.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ సరిహద్దులోని లోక్‌సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పార్టీల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దీంతో బీజేపీ, తృణమూల్‌ ఈ రెండూ పార్టీలు మథువా సామాజికవర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్‌ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బిశ్వజిత్‌ దాస్‌ రంగంలో దిగారు.

    బన్‌గావ్‌ లోక్‌సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రం అనంతరం, 1971లో హిందూ శరణార్థులు భారీగా బనగావ్‌ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధ సమయంలో ఎక్కువ మంది వలస వచ్చారు. వీరిలో అత్యధికులు మథువాలే. ప్రస్తుతం బన్‌గావ్‌ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తేవడంతో సహజంగానే వీరంతా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు.

    ఇక.. బన్‌గావ్‌ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్‌ ప్రచారాన్ని బన్‌గావ్‌ నుంచి ప్రారంభించిన మోదీ.. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు బీజేపీకే పడ్డాయి. అలా బన్‌గావ్‌లో తొలిసారి బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి శంతను ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

    అటు.. బన్‌గావ్‌ రాజకీయాలను బీనాపాణి దేవి కుటుంబం శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్‌ రంజన్‌ ఠాకూర్‌ బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్‌లో స్థిరపడ్డారు. ప్రమథ్‌ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం కోసం.. స్థానిక ఠాకూర్‌ నగర్‌లో ఆయన భూమి కొనుగోలు చేశారు.

     ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్‌ కాలనీ నిర్మించారు. ఆ తర్వాత ప్రమథ్‌ 1962లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా హన్స్‌ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలవగా.. కుమారుడు కపిల్‌ కృష్ణ ఠాకూర్‌ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్‌ కృష్ణ ఠాకూర్‌ టీఎంసీ ఎమ్మెల్యేగా చేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆయన కుమారుడే బీజేపీ అభ్యర్థి శంతను.

    మరోవైపు.. సీఏఏను తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని మండిపడుతోంది. మథువాలకు ఇప్పటికే పౌరసత్వం, ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఉండగా.. మళ్లీ కొత్తగా పౌరసత్వం ఇస్తామని బీజేపీ ఎలా చెబుతోందంటూ టీఎంసీ ప్రశ్నిస్తోంది. అసలు మథువాలు భారతీయ పౌరులు కాకపోతే.. వారు ఓటు ఎలా వేశారు..? ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్‌కు.. బెంగాల్‌ అసెంబ్లీకి ఎలా ఎన్నికయ్యారు అని నిలదీస్తోంది. మొత్తానికి హోరాహోరీగా ప్రచారం చేస్తున్న రెండు పార్టీల్లో మథువాలు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.

  • న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి ఘటన  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్‌ నివాసంలోని డ్రాయింగ్‌ రూంలో సీఎం కోసం  ఆప్‌ ఎంపీ ఎదురుచూస్తుండగా.. బిభవ్‌ కుమార్‌ అక్కడికి వెళ్లి, ఆమెతో అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు స్వాతి మలీవాల్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బిభవ్‌ కుమార్‌ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతున్నారు.

    దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మలీవాల్‌ను ఆమెపై దాడి జరిగిన సీఎం కేజ్రీవాల్‌ నివాసానికి శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లారు. మే 13న జరిగిన క్రైం సీన్‌ను రీక్రియెట్‌ చేయడానికి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    ఆప్‌ ఎంపీని కేజ్రీవాల్‌ ఇంటికి తీసుకెళ్లే ముందు అయిదుగురు ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది.  అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అంజిత చెప్యాల నాయకత్వంలో నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఇంటి నుంచి పలు ఆధారాలను సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం కేజ్రీవాల్‌ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయింది.

     

    కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
    చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు

    దాడి ఆరోపణల నేపథ్యంలో మలీవాల్‌కు నేడు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు దాడికి ముందు కేజ్రీవాల్‌ నివాసంలో మలీవాల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.

    దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్‌ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని విమర్శించారు.  అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆప్ అధినేత ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో కేజ్రీవాల్‌ మౌనంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

     

  • ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) పేరును నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్‌ షీట్‌ను దాఖలు చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లైంది.  

    మద్యం పాలసీ కేసులో తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.

    కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. ఆప్‌పై ఛార్జ్ షీట్‌ నమోదు చేస్తున్నామని, అందులో ఆప్‌ పార్టీని నిందితులుగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు.  

    ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణ జరిపే సమయంలో మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్‌ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు  ప్రశ్నించింది.

    ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్‌.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. తాజాగా ఆప్‌ను నిందితుల జాబితాలో చేరుస్తూ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది.  

    ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 18 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేశాయి.  

    వీరిలో సంజయ్‌ సింగ్‌ బెయిల్‌ మీద బయటకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో మే 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 
     

  • సోలార్ పంప్ ఇన్‌స్టాలేషన్ సౌలబ్యాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. రైతులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సోలార్ పంప్ ఇన్‌స్టాలేషన్ ఎక్కువగా అమలు కాలేదు. ఇప్పుడు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ ఏడాది ప్రారంభమైన 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' మాదిరిగానే.. ఇప్పుడు రైతులు ఈ సోలార్ పంప్ ఇన్‌స్టాలేషన్ కోసం నేషనల్ పోర్టల్ ద్వారా విక్రేతలతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రైతులు ఇష్టపడే సోలార్ పంపుల రకాన్ని ఎంచుకోవడంలో మాత్రమే కాకుండా ఇన్‌స్టాలేషన్ సమయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.

    కుసుమ్ యోజన స్కీమ్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. అవి 10000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం, 2 మిలియన్ స్టాండ్-అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేయడం, 1.5 మిలియన్ వ్యవసాయ పంపులను సోలారైజ్ చేయడం. వ్యవసాయ పంపుల ఇన్‌స్టాలేషన్, సోలారైజేషన్ కోసం హేతుబద్ధీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ సబ్సిడీలో ఎటువంటి మార్పులు లేదు. కేంద్రం దీనికోసం రూ.34,422 కోట్లు కేటాయించింది.

    సోలార్ పంప్ ఇన్‌స్టాలేషన్‌లు, సోలారైజేషన్ కోసం కేంద్రం 30% సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్రాలు కూడా 30 శాతం సబ్సిడీ అందిస్తాయి.  ఈ పథకం కోసం బ్యానుకులు కూడా తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర సబ్సిడీ కాంపోనెంట్‌ కూడా పోర్టల్‌లో పేర్కొనటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

    రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ ప‌వ‌ర్‌ను డిస్కంల‌కు విక్ర‌యించుకోవ‌చ్చు. దీని ద్వారా రైతు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం రైతులు ఆయా డిస్కంల‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. డిస్కంల‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బ‌ట్టి 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు రైతుల నుంచి క‌రెంటు కొంటారు.

    ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో 10 మిలియన్ల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్‌లను ఇన్‌స్టాల్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన పథకానికి ఇప్పటి వరకు 8,00,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

  • న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి  మలీవాల్‌ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్‌ రూమ్‌లో ఉన్న కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్‌ ఇంట్లోనే ఉన్నారని  పేర్కొన్నారు.

    కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.

    ఈ విషయంలో స్వాతి మలీవాల్‌ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్‌ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.

    పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్‌ లైన్స్‌లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్‌ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.

    ‘కుమార్‌ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు.  హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.

    బిభవ్‌ చర్యలతో పూర్తిగా షాక్‌కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు.  పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా’’ అని స్వాతి మలీవాల్వె‌ ల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

    ఈ ఘటనపై మలీవాల్‌  గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్‌కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని  విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

  • బీహార్‌ రాజధాని పాట్నా నిరసనలతో అట్టుడికిపోతోంది. కోపంతో ఊగిపోతున్న కొందరు నడివీధుల వెంట చేరి చేతికి దొరికిన వస్తువుల్ని కాలుస్తున్నారు. ఆ ఆగ్రహావేశాలకు కారణం.. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చిన్నారి అనుమానాస్పద రీతిలో చనిపోవడం.  

    పాట్నాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదరీతిలో చనిపోవడం, ఆ విషయాన్ని దాచేందుకు స్కూల్‌ సిబ్బంది యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా తోడైన ఓ కులం.. పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి.. సత్వర న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.  

    టినీ టాట్‌ అకాడమీ స్కూల్‌లో చదివే చిన్నారి.. గురువారం స్కూల్‌ ట్యూషన్‌ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్‌కు వచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది  పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా స్కూల్‌లోకి అర్ధరాత్రి దాకా వెతికారు.

    చివరకు.. ఈ వేకువ ఝామున 3గం. ప్రాంతంలో స్కూల్‌ ఆవరణలోని డ్రైనేజీలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు స్కూల్‌కు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్‌కు చేరుకుని  ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. ఎస్పీ చంద్రప్రకాష్‌ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

     

    స్కూల్‌లోకి వెళ్లిన చిన్నారి.. తిరిగి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యింది. దీంతో ఆ అవరణాలోనే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాం. అయితే చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్పీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, సిబ్బంది మృతదేహాన్ని దాచే యత్నం ఎందుకు చేసిందో తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఉద్రిక్తతలు విస్తరించకుండా పోలీస్‌ బలగాలను మోహరించినట్లు తెలిపారాయన. 

Politics

  • ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిపై ఆమ్‌ ఆద్మీ సంచలన ఆరోపణలు చేస్తోంది. 

    స్వాతి మలివాల్‌ ఆరోపణల్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కొట్టి పారేశారు.  ఆమె చేస్తోన్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు.  

    మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ అపాయింట్‌మెంట్ లేకుండా సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించారు. కేజ్రీవాల్‌ అందుబాటులో లేరు. అపాయింట్‌ లేకపోవడంపై సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఆమెను అడ్డుకున్నారు. డ్రాయింగ్ రూమ్‌లో వాదించడం ప్రారంభించింది’ అని అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.

    ‘అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది. కాబట్టే బీజేపీ ఓ కుట్ర పన్నింది. అందులో భాగంగా స్వాతి మలివాల్‌ను పావుగా వినియోగించుకుంది. మే 13 ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పంపింది. అక్కడే ఆమె కథంతా నెరిపింది. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈరోజు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆమె డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని పోలీసు అధికారులను బెదిరించడం కనిపించింది. తనపై క్రూరంగా దాడి చేశారిన స్వాతి ఆరోపణలకు.. వీడియోలో కస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయి

    ఆ వీడియోలో స్వాతి మలివాల్‌ కనిపించారు. కొట్టినట్లు వీడియో తీస్తున్నదెవరు..ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తేనే అందరికీ నిజం తెలుస్తుంది. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆ నిజం ప్రపంచానికి తెలుస్తోంది’ అని అతిషి అన్నారు.

    కాగా, స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతిషి తెలిపారు.
     

  • దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార హోరు జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు సైతం క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ అధినేత్రి 'సోనియా గాంధీ' శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.

    రాహుల్ గాంధీకి తన (సోనియా గాంధీ) పట్ల చూపిన అదే ప్రేమ, ఆప్యాయతలను అందించాలని సోనియా గాంధీ ప్రజలను కోరారు. ''నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను మీవారిలా భావించినట్లే, అతనికి కూడా అదే ప్రేమ, ఆప్యాయతని అందించండి''. రాహుల్ మిమ్మల్ని మీరసపరిచేది లేదని అన్నారు.

    తమ కుటుంబానికి ఎప్పుడూ మద్దతు ఇచ్చే రాయ్‌బరేలీ ఈ సారి కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు, వయసు రీత్యా తాను లోక్‌సభ ఎన్నికలలో పాల్గొనడం లేదని సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈమె 2004 నుంచి రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది.

    ప్రజలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ ప్రజలకు 20 ఏళ్ల పాటు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించారు. అదే నాకు పెద్ద ఆస్తి. రాయ్‌బరేలీకి చెందిన నా కుటుంబ సభ్యులు, చాలా కాలం తర్వాత మీ మధ్య ఉండే అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

    రాయ్‌బరేలీ మాదిరిగానే.. అమేథీ కూడా నా ఇల్లు అని పేర్కొంటూ.. నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు, కుటుంబ మూలాలు ఈ మట్టితో ముడిపడి ఉన్నాయి. గంగామాత వలె పవిత్రమైన ఈ సంబంధం అవధ్ మరియు రాయ్‌బరేలీ రైతుల ఉద్యమంతో ప్రారంభమైంది, ఇది నేటికీ కొనసాగుతోందని సోనియా గాంధీ అన్నారు.

  • పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..

    అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్‌ ఉన్నాయంటోంది ఆపార్టీ. 

    నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

    సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ  అంచనా వేస్తోంది.

    పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా  ఉన్నారు. 

    మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పా‌లో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది. 

    ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్‌ ఎస్‌ పార్టీకి ఇప్పుడు  పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది  జూన్ 4న తేలనుంది.

  • జనసేన డీలా పడింది... పోలింగ్ తర్వాత సరళి చూసిన నేతలలో నిరుత్సాహం ఆవహించింది. క్రాస్ ఓటింగ్ భయమూ జనసేన నేతలను వెన్నాడుతోంది. సొంత పార్టీ నేతలను నమ్మకపోవడమూ నష్టమే కలిగించిందంటున్నారు. దీనికి తోడు టీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాపు సామాజికవర్గం మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని భావిస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్నారు. ఈ నేపధ్యంలో ఫలితాలపై నేతలు అయోమయంగా ఉన్నారు. పోలింగ్ తర్వాత పవన్ ప్యాకప్ చెప్పేయడమూ జనసేన పరిస్ధితిని తెలియజేస్తోంది.

    పార్టీ పెట్టి పదేళ్లు అయినా..
    పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన గప్ చుప్ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  ప్యాకప్ చెప్పేయడం పార్టీని డైలమా పడేస్తోంది. పోలింగ్ సరళిపై విశ్లేషణ తర్వాత ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. జనసేన ఏర్పడి దశాబ్ధకాలం దాటుతున్నా ఇప్పటికీ అద్యక్షుడు పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోవడం పెద్ద మైనస్ గానే చెప్పుకోవాలి. ఆది నుంచి పవన్ వ్యవహార శైలే పార్టీని నట్టేట ముంచిందని భావిస్తున్నారు. ఇపుడు కూడా టీడీపీతో జతకట్టడం..పైగా టీడీపీ కోసం దిగజారిపోయి బలమైన సీట్లను సైతం వదులుకోవడం. కేవలం 21 సీట్లకే పరిమితమవడం ఇవన్నీ జనసేన పార్టీని కొంపముంచాయంటున్నారు.

    ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండా
    కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహడ్డిని పదవి నుంచి దింపడానికే తాను కూటమిగా ఏర్పడ్డామని, ఓటు చీలకూడదంటూ పవన్ ప్రతీ సభలోనూ చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా నెగటివ్‌గా మారాయంటున్నారు. పార్టీకి ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండా సీఎం వైఎస్ జగన్‌పై అక్కసుతో కేవలం ఎదుట పార్టీపై బురదజల్లడం ప్రజలలో వ్యతిరేకత పెంచిందంటున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ కనీసం 50, 60 సీట్లలో నైనా పోటీ చేయాలని కాపు నేతలు సూచించారు.

    నేతల మాటలను పెడచెవినట్టి..
    మాజీ మంత్రి హరిరామజోగయ్య లాంటి నేతలైతే ఏకంగా పలుమార్లు పవన్‌కు లేఖ రాయడమే కాదు స్వయంగా కలిసి కూడా సగం సీట్లలోనైనా పోటీ చేయాలని సూచించారు. అయితే పవన్ ఆ మాటలన్నీ పెడచెవిన పెట్టి కేవలం 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లకే పరిమితమయ్యారు. అందులోనూ కూడా జనసేనని నమ్ముకుని దశాబ్ధకాలంగా పార్టీకోసం కష్టపడుతున్న నేతలకి కాకుండా ఇతర పార్టీ నేతలకి అవకాశం ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేయాల్సిన స్ధానాలని టీడీపీకి వదిలేయడం పార్టీలో చిచ్చురేపింది 

    సీనియర్ నేతలకు తీవ్ర ఆగ్రహం
    ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలోనూ ఈ వ్యవహారాలే పార్టీని రోడ్డున పడేశాయి. ఇలా మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో అవనిగడ్డ సీటులో టిడిపి నుంచి మండలి బుద్ద ప్రసాద్ లాంటి నేతలను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇక పాలకొండలో సైతం ఇదే విధంగా టీడీపీకిి చెందిన నిమ్మక జయరాజుని జనసేనలో చేర్చుకుని టికెట్‌ ఇవ్వడం వివాదాన్ని రాజేసింది. అలాగే తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకి కూడా చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపై జనసేనలో అలజడి రేపింది.

    జనసేన బలం ఉన్న సీట్లని టీడీపీకి త్యాగం
    అదే విదంగా మచిలీపట్నం ఎంపి సీటుని వైఎస్సార్‌సీపీ  సిట్టింగ్ ఎంపి బాలశౌరికి ఇవ్వడం జనసేన నేతలని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇక గోదావరి జిల్లాలలో అయితే అక్కడ పార్టీ నియోజకవర్గి ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేన బలం ఉన్న సీట్లని సైతం టీడీపీకి త్యాగం చేయడం తీవ్ర నిరాశలోకి నెట్టింది. 

    జనసేనకు గుడ్‌బై
    దీంతో కాకినాడ రూరల్ నుంచి మాజీ మేయర్ సరోజ, అమలాపురం ఇన్ చార్జి శెట్టి బత్తుల రాజాబాబు, రాజోలు ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడవరం ఇన్ చార్జి పితాని బాలకృష్ణ తదితరులు ఏకంగా జనసేనికు గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో  చేరారు. అలాగే విజయవాడ పశ్చిమ సీటు ఆశించిన పోతిన మహేష్ కి కాకుండా బీజేపీకి వదిలేయడం కూడా పెద్ద వివాదాన్నే సృష్టించింది. 

    పవన్ శైలిపై విమర్శలు
    చివరి నిమిషం వరకు పోతిన మహేష్ పెద్ద ఎత్తున విజయవాడ పశ్చిమ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమై ఆఖరికి వైఎస్సార్‌సీపీలో చేరిపోయి పవన్ శైలిపై పూర్తి స్ధాయిలో ద్వజమెత్తారు. అడుగడుగునా  పవన్‌ను ప్రశ్నిస్తూ ఇరకాటంలో పెట్టారు.ఇక జగ్గంపేటలో అయితే పాఠంశెట్టి సూర్యచంద్ర జనసేనకు షాక్ ఇచ్చి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇక అనకాపల్లి సీటు విషయంలో కూడా చివరి నిమిషంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృ్ణ కి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక కాకినాడ రూరల్‌లో పంతం నానాజీకి టిక్కెట్ ఇవ్వడంతో నిరాశపడిన మాజీ మేయర్ సరోజ తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తుతూ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. 

    ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ
    ఇక రాజమండ్రి రూరల్ ఆశించి జనసేనకి పనిచేసిన కందుల దుర్గేష్‌ను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోసం బుజ్జగించి చివరికి ఆయనను ఏమాత్రం అవగాహనలేని నిడదవోలు నియోజకవర్గానికి చివరి నిమిషంలో పంపడం అక్కరకు రాకుండా పోయిందంటున్నారు. ఇక గత ఎన్నికల సమయంలో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ స్ధానాన్ని టీడీపీ ఇన్ చార్జి రామాంజనేయులుకి జనసేన కండువా కప్పి ఇవ్వడంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడంపైనా మహిళా నేతలలో తీవ్ర నిరాశని మిగిల్చింది..ఇలా సీట్ల పంపకాలలోనే సొంత పార్టీలోనే పవన్ తన తీరుతో నిప్పు రాజేసుకున్నారు.

    ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టికెట్‌
    జనసేన పోటీ చేసిన నాలుగైదు స్ధానాలు మినహా మిగిలిన స్ధానాలను ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం వల్ల జనసేన బలం ఎన్నికల ముందే తేలిపోయిందని చెబుతున్నారు. ప్రజల్లోకి ఈ సంకేతాలు బలంగా వెళ్లడంతో ఎదురుగాలి వీచిందంటున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు .ఆ తర్వాత ఆ రెండు నియోజకవర్గాలను పవన్ పట్టించుకోలేదు. 

    ఎన్నికలు ముగియగానే పవన్ రెండు నియోజకవర్గాలలో ఇళ్లతో పాటు పార్టీ కార్యాలయాలను ఖాళీ చేశారు. ఆ తర్వాత తనకి ఓటు వేసిన ఆ రెండు నియోజకవర్గాల ప్రజలను పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల తర్వాత పవన్ తమకు అందుబాటులో ఉండరనే భావన ప్రజలలో పెరిగిపోయింది. ఈ ఎన్నికలలో పవన్ ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగకుండా పిఠాపురం ఎంచుకోవడం వెనుక కారణం ఇదే అంటున్నారు. 

    అలాగే తన గెలుపుకోసం పవన్ వారంలో మూడు రోజుల పాటు పిఠాపురంలోనే ప్రచారం చేసినా ఫలితం తమకు అనుకూలంగా ఉంటందని నేతలు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇక పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే టీడీపీ ఇంచార్జి చార్జి వర్మ నుంచి వచ్చిన వ్యతిరేకత తీవ్ర ఇరకాటంలో పడేసింది. ఆ తర్వాత పవన్ చంద్రబాబుతో చెప్పించుకుని స్వయంగా వర్మ ఇంటికి వెళ్లి షో చేసినా అది పనిచేయలేదంటున్నారు.

    వంగా గీత పోటీ పవన్‌కు  మైనస్ 
    పిఠాపురం నుంచి ఒకసారి పవన్ కళ్యాణ్ నెగ్గితే శాశ్వతంగా తన సీటుకి ఎసరే అన్న ఉద్దేశంతో వర్మ పవన్ గెలుపుకోసం పూర్తి స్ధాయిలో పనిచేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ చేయడం పవన్‌కు  మైనస్ అయిందంటున్నారు. నాలుగు దశబ్ధాలగా రాజకీయాల్లో ఉన్న వంగా గీతకి కాకినాడ జిల్లాలో మంచి పేరుంది. వంగా గీత జెడ్పీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజలలో కలిసిపోయినవైనం వంగా గీతకి పాజిటివ్ అయిందంటున్నారు.

    దీనికి తోడు వంగాగీతపై పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రజలలో ఆమెపై సానుభూతి పెంచేలా చేశాయంటున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు వంగా గీత చేసిన ప్రసంగం. అదే సమయంలో గీతమ్మని గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇవన్నీ ఓటర్లని ఆలోచింపచేశాయంటున్నారు.

    పవన్‌ గెలిచినా ఎలాగూ సీఎం కాలేరు
    పవన్ గెలిచినా కూడా 21 సీట్లతో ఎలాగూ సీఎం కాలేరని... కనీసం మంత్రిగా కూడా అవకాశం ఇస్తారో లేదో తెలియదని భావించిన ఓటర్లు వంగా గీతని గెలిపిస్తే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం అవుతుందన్న ఉద్దేశంతోనే మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలు కట్టారంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ గెలుపుపై పోలింగ్ ముందు వరకు భారీ బెట్టింగ్‌లకు దిగిన జనసేన నేతలు ఇపుడు మాత్రం ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారట.

    జనసేన పార్టీ గోదావరి జిల్లాలనే నమ్ముకుని బరిలోకి దిగింది. మొదట నుంచి తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు.ఈ రెండు జిల్లాలలో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో పవన్ తనకి ఈ రెండు జిల్లాలలో ఎదురు ఉండదనుకున్నారు. జనసేన మొత్తంగా 21 అసెంబ్లీ స్ధానాలలో పోటీ చేస్తే ఇందులో ఈ రెండు జిల్లాల నుంచి 11 స్ధానాలు ఉన్నాయి. అయితే గోదావరి జిల్లాలలో కాపు ఓటర్లను తప్పితే మిగిలిన సామాజికవర్గాలని పట్టించుకోకపోవడం. అందరి నాయకుడిగా ఉండాల్సిన పవన్ కాపు చట్రంలోనే ఉండిపోవడం పార్టీకి చేటు తెచ్చాయంటున్నారు.

    ఈ నేపథ్యంలో కాపు ఓట్లలో కూడా పూర్తిగా తమకు పడలేదని నేతలు చెబుతున్నారు. ఇక టీడీపీ కోసం పవన్ ఎన్ని త్యాగాలు చేసినా టిడిపి నుంచి మాత్రం పూర్తి స్ధాయిలో ఓట్ల బదిలీ జరగలేదని జనసేన నేతలు భావిస్తున్నారు. టీడీపీకి ఎంతలా సహకరించినప్పటికీ కూడా తమకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్ధాయిలో సహకారం అందలేదని, చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ కూడా కొంప ముంచిందంటున్నారు. ఇలా పోటీ చేసిన 21 స్ధానాలలో కనీసం రెండు,మూడు స్ధానాలలో కూడా గెలుపు కష్టమేనని, వైఎస్ జగన్ గాలి వీస్తే ఆ సీట్లు కూడా రావడం కష్టమేనంటున్నారు.

    ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలం
    ఈసారైనా తమ అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడతారని ఆశించామని, కానీ చేతులారా పవన్ ఆ అవకాశాలను సైతం జారవిడుచుకున్నారని, ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలమయ్యారని, కానీ చంద్రబాబు నమ్మకాన్ని సంపాదించుకున్నారని సొంతపార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఇక ఎన్నికల ముగిసిన తర్వాత పోలింగ్ సరళి చూసుకున్న జనసేన నేతలు మీడియాకు పూర్తిగా ముఖం చాటేశారు. నేతలెవరూ మీడియా ముందుకురాలేదు.

    ఇక పవన్ అయితే తన ఓటు కూడా తనకి వేసుకోలేకపోయారు.. మంగళగిరిలో ఓటు వేసిన తర్వాత అదే రోజు సాయంత్రం పవన్ వారణాసి వెళ్లి ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా వారణాసి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్నికల ముగియడంతో ఆంద్రా నుంచి ప్యాకప్ చెప్పారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా అటు పవన్ తీరుతో జనసేన పార్టీ పూర్తిగా డీలా పడింది.

  • సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్‌ పోలీసు అధికారి ఏక పక్ష నిర్ణయంపై గవర్నర్‌ను కలిసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయని, అందుకే  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని అన్నారు.

    తొందరపాటు నియమకాల వల్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మంత్రి బొత్స పేర్కొన్నారు అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వపరాలు తెలుసుకోవాలని తెలిపారు. రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు. 

    ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా తమపై నిందలు వేయడం సరికాదని అన్నారు. హింసాకాండకు వైఎస్సార్‌సీపీ పూర్తి వ్యతిరేకమని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు.

    పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

    మళ్లీ అధికారంలో వచ్చేది తామనేనని అన్నారు బొత్స సత్యనారాయణ. 175 సీట్లకు దగ్గరగా గెలవబోతున్నామని చెప్పారు. జూన్‌ 9న విశాఖలోనే సీఎంగా వైఎస్‌ జగన్‌మోమన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు.  

    ‘టీడీపీ ఫలితాల పై ఢీలా పడింది.. అందుకే మహానాడు వాయిదా వేసుకున్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న సంఘటనలను ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడే ప్రయత్నం చేయొద్దు. పోలీసులు కూడా న్యాయ బద్దంగా వ్యవహరించండి. రాజకీయ పార్టీలు హింసను ప్రోత్సహించవద్దు. వైయస్సార్ సీపీ అలాంటి హింసలు ప్రోత్సహించదు. నిన్న విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ ఘటనను రాజకీయం చేస్తున్నారు

    త్వరలో విశాఖ కేంద్రంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభిస్తున్న దశలో విశాఖ ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. విశాఖ ప్రశాంతతను కాపాడాలని కోరుకుంటున్నా. .రాజకీయ నాయకునిగా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మా పార్టీ సీట్లు అవసరం వుండేలా కేంద్రంలో అధికారం రావాలని కోరుకుంటున్నా. ఉత్తరాంధ్ర లో 34 సీట్లు వస్తాయి. ప్రజా తీర్పు ఆధారంగా విశాఖ పరిపాలన రాజధాని చేయాలని కోర్టును కూడా కోరుతాo’ అని పేర్కొన్నారు.

     

  • లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్‌ స్థానం వైపే. ఎందుకంటే ప్రధాని మోదీ ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో స్టాండప్ కమెడియన్‌ 'శ్యామ్ రంగీలా' ప్రధాని మోదీపై పోటీ చేయాలనీ ప్రయత్నించారు. అయితే అతని నామినేషన్ 
    నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో తిరస్కరణకు గురైంది. దీంతో మోదీ పోటీ చేస్తున్న వారణాసి బరిలో దిగాలనుకున్న శ్యామ్ రంగీలా ఎవరనేది ప్రశ్నగా మారిపోయింది.. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూసెయ్యండి.

    రాజస్థాన్‌కు చెందిన శ్యామ్‌ రంగీలా.. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ సోషల్ మీడియాలో పాపులర్‌ అయ్యాడు. ఈ ఎన్నికల్లో ఆయనపైనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించి వార్తల్లోకెక్కాడు. ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై బీజేపీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాడు శ్యామ్ రంగీలా. నామినేషన్ తిరస్కరణకు గురవడంతో.. ప్రధానిపై పోటీ చేసే అవకాశం మిస్‌ అయ్యాడు. అయితే నామినేషన్‌ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

    మే 10, 13వ తేదీల్లో నామినేషన్‌ వేయడానికి ప్రయత్నించగా.. తన పత్రాలను ఎవరూ తీసుకోలేదంటూ ఎక్స్‌(ట్విటర్)లో పోస్ట్‌ చేశాడు శ్యామ్ రంగీలా. చివరి రోజైన మే 14న ఇదే పరిస్థితి అని తెలిపాడు. అనేక ప్రయత్నాల తరువాత నామినేషన్ల గడువు ముగియడానికి రెండు నిమిషాల ముందు.. అధికారులు తన డాక్యుమెంట్లు తీసుకున్నారని చెప్పాడు.

    మరుసటిరోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్‌ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్‌ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్‌పై ప్రమాణం చేయలేదని పేర్కొన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే తన పత్రాలను తిరస్కరించారని శ్యామ్ రంగీలా ఆరోపించారు.

    మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

    లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్‌ 1న వారణాసి స్థానానికి పోలింగ్‌ జరగనుంది. దీనికి మే 14న ప్రధాని మోదీ 
    నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున యూపీ పీసీసీ చీఫ్‌ అజయ్‌ రాయ్‌ బరిలోకి దిగారు. వారణాసిలో పోటీకి మొత్తం 55 మంది నామినేషన్లు వేయగా.. 36 పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోజార్టీ పెంచేందుకే పోటీలో ఉన్నవారిని తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

    ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీచేయడం వరుసగా ఇది మూడోసారి. తొలిసారి 2014లో ఇక్కడి నుంచి పోటీచేసిన ప్రధాని.. 56శాతం ఓట్లతో విజయం సాధించారు. 2019లో దాదాపు 5 లక్షల మోజార్టీతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. ఈసారి మెజార్టీ 5లక్షలు దాటి పోతుందని ధీమా వ్యక్తంచేస్తోంది బీజేపీ. ఓ కమెడియన్ పోటీచేసినంత మాత్రాన.. మోదీ ఆధిక్యత తగ్గుతుందని అనుకోవడం విపక్షాల తెలివితక్కువతనమని కొట్టిపారేసింది.

  • ఏపీ బీజేపీలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు రాష్ట్రంలోని సీనియర్ నాయకులు ఎందుకు ప్రచారం చేయలేదు? సీనియర్లంతా ప్రచారానికి దూరం కావడానికి కారణం ఏంటి? ఈ విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలి పాత్ర ఏంటి? ఓటింగ్ ముగిసిన తర్వాత పార్టీ నాయకులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? పోలింగ్ తర్వాత ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడటానికి కారణం ఏంటి?


    బీజేపీ సీనియర్లు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. సీనియర్ నేతలంతా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి కారణంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా,  రాజ్‌నాథ్‌ సింగ్ లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం ఆయా సభలలో సీనియర్లు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు. 

    ఇలా సొంత పార్టీకి చెందిన సీనియర్లే ప్రచారానికి, పోల్ మేనేజ్ మెంట్ కి దూరంగా ఉండటం కూడా రాష్ట్ర బీజేపీని పూర్తిగా ఆత్మ రక్షణలో పడేసింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలని జార విడుచుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు కమలం పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంప ముంచిందంటున్నారు.

    తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీలో చేరి పోటీ చేసిన చోట కాకుండా మిగిలిన స్ధానాలలో టీడీపీ నుంచి పూర్తిగా సహకారం కరువైదంటున్నారు. ఇక టీడీపీ నుంచి చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్‌ తెచ్చుకుని పోటీ చేసిన స్ధానాలలో ఒరిజనల్ బీజేపీ నేతలెవరూ కూడా మనస్పూర్తిగా పనిచేయలేదని, సొంత పార్టీ జెండాను ఇతర పార్టీ నేతలు లాక్కోవడాన్ని జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. 

    ఇందుకోసమే కమల నేతల మధ్య అనైక్యతా రాగం, ఇతర పార్టీ నేతలు టిక్కెట్లు తెచ్చుకున్నచోట వారితో కలవలేకపోవడం, ఇవన్నీ పోలింగ్ రోజు తీవ్ర ప్రభావాన్నే చూపాయంటున్నారు. దీంతో పాటు చంద్రబాబు అబద్దపు అలవికాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత నష్టం చేసిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు.

    ఓటమి భయం

    మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని కనీసం చేతితో పట్టుకోవడానికి కూడా బీజేపీ ఇన్ చార్జి ఇష్టపడలేదు. అయితే టడీపీతో జతకట్టి బరిలోకి దిగిన తర్వాత ఆ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని ప్రకటించడం కూటమి మధ్య ఉన్న విభేదాలని బట్టబయలు చేసిందేగాని..ఎన్నికల సమయంలో ఓట్లని కురిపించలేకపోయిందని నేతలు భావిస్తున్నారు. 

    దీంతో పాటు కొన్ని పార్లమెంట్ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ భయం కూడా బిజెపిని వెన్నాడుతోంది. పోలింగ్‌కు ముందు పోల్ మేనేజ్ మెంట్ విషయంలో బిజెపి చేతులెత్తేయడం కూడా మైనస్‌గా మారిందంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంిపీ స్ధానాలతో పాటు మూడు లేదా నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించిన బీజేపీ పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం అంచనాలకు రాలేకపోతున్నారు. 

    అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీ ని ఓటమి భయం వెన్నాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా గెలవలేమనే ఆందోళన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ నాయకుల్లో ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి ఫలానా సీట్లలో మేము గెలుస్తున్నామని ధైర్యంగా చెప్పలేకపోయారంటున్నారు. ఓటమి భయంతోనే ఏపీ బీజేపీ నైరాశ్యంతో కూడిన నిశ్శబ్ధం ఆవరించిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

  • అనుకున్నట్లే అయింది. ఏపీలో కూటమిని కుమ్ములాటలు పూర్తిగా ముంచేసాయి. సఖ్యత లేని కారణంగానే పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటు షేర్ బదిలీ కాకపోవడం ఆయా పార్టీలను కలవరపరుస్తోంది. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నేతల్లో గెలుపుపై ధీమా లేక డీలా పడిపోయారు. పోలింగ్ పూర్తయ్యాక బిజెపి, జనసేన నేతలెవరూ మీడియా ముందుకు రాకపోవడం పరిస్ధితికి అద్దం పడుతోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య అసలేం జరిగిందో చూద్దాం.

    కూటమిగా జతకడితే విజయం ఖాయమనుకున్న టిడిపి, బిజెపి, జనసేనలలో పోలింగ్ తర్వాత అయోమయం కనిపిస్తోంది. లెక్కలు తేలిన తర్వాత ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓటు షేర్ బదిలీ కాలేదని అర్థం కావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2014లో టిడిపి, బిజెపి, జనసేనలతో జట్టుకట్టి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపికి మద్దతు పలికిన జనసేన బరిలోకి దిగలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలన్న ఉద్దేశంతో జనసేన విడిగా పోటీ చేసింది. కాని జనసేన ఒక సీటు గెలుచుకోగా..టీడీపీకి 23 మాత్రమే దక్కాయి. 152 సీట్లతో వైఎస్‌ఆర్‌సీపీ విజయఢంకా మోగించింది.

    మళ్ళీ తాజా ఎన్నికలలో ఎట్టి పరిస్ధితుల్లోనైనా వైఎస్సార్ సిపి గెలుపును అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలతో 2014లో మాదిరిగా మూడు పార్టీలు మరోసారి కూటమి కట్టాయి. మూడు పార్టీలు కలిస్తే 2019 వచ్చినట్టుగా ఓటు షేర్ దాదాపుగా 50 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. అయితే మూడు పార్టీల అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి.

    ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూటమిలో కుమ్ములాటలు పోలింగ్ రోజున దెబ్బేసాయి. కనీసం సగం సీట్లలలోనైనా పోటీ చేస్తుందని భావించిన జనసేన పార్టీ నేతల్ని పవన్ తీరు పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 21 అసెంబ్లీ సీట్లకి, రెండు పార్లమెంట్ సీట్లకి జనసేన పరిమితం కావడం ఆ పార్టీ నేతలను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. దీనికి తోడు మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో పలువురు టీడీపీ నేతల్ని జనసేనలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి ఆగ్రహం కలిగించింది. గోదావరి జిల్లాల్లో అయితే నియోజకవర్గ ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేనకు బలం ఉన్న సీట్లను టిడిపికి త్యాగం చేయడం అక్కడి కేడర్‌ను నిరాశలోకి నెట్టింది. దీంతో పలువురు నేతలు జనసేనకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ సిపిలో చేరారు.
     
    సీట్ల పంపకాల సమయంలోనే సొంత పార్టీలోనే పవన్ నిప్పు రాజేసుకున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ నేతలకి టీడీపీ నుంచి పూర్తి సహకారం లభించలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చివరి నిమిషం వరకు కంట్లో నలుసుగానే కొనసాగారు. పవన్ కళ్యాణ్ గెలుపొందితే శాశ్వతంగా పిఠాపురం నుంచి తాను దుకాణం సర్ధుకోవాల్సి ఉంటుందనే భయంతో వర్మ తన క్యాడర్ ని పవన్ కి పూర్తిగా సహకరించనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పవన్ తో పాటే వర్మ తిరిగినా టిడిపి ఓటు షేర్ జనసేనకి పూర్తిగా బదిలీ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో 21 అసెంబ్లీ స్ధానాలలో ఎన్ని సీట్లలో గెలుస్తామనేది జనసేన చెప్పలేకపోతోంది. ఎన్డీఎ కూటమి గెలుస్తుందంటూ పవన్ పోలింగ్ ముగిసిన తర్వాత కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు.   చాలా బలంగా ఉన్నామని చెప్పుకున్న గోదావరి జిల్లాలలోనూ కాపు ఓట్లు తప్పితే బిజెపి, టిడిపి ఓట్లు జనసేనకి పడలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.

    ఇక బిజెపి కూడా అదే విధమైన అయోమయంతో ఉంది. వాస్తవానికి ఈ పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు గెలుపుపై ధీమా లేకుండా చేశాయి. బిజెపి సీనియర్లెవరికీ ఇష్టం లేకపోయినా చివరి నిమిషంలో టిడిపి, జనసేన కూటమితో జతకట్టి పది అసెంబ్లీ స్ధానాలకి, ఆరు పార్లమెంట్ స్ధానాలకి పరిమితం కావడం పార్టీలో సీనియర్లకి మింగుడుపడలేదు. దీంతో పాటు బిజెపిలో మొదట నుంచి ఉన్న వారికి, సీనియర్లకి టిక్కెట్ల కేటాయింపు కోసం సీనియర్లు ఎంత ప్రయత్నించినా..రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కుతంత్రాలతో ఒరిజినల్ బిజెపి కాస్తా తెలుగు బిజెపిగా మారిపోయింది. ఇక్కడ కూడా విశాఖపై పట్టున్న జివిఎల్ కి టిక్కెట్ రాకుండా తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి చేసిన కుట్రలతో జీవీఎల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆశించిన సోము వీర్రాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడం, హిందూపూర్ ఆశించిన విష్టువర్ధన్ రెడ్డికి టిక్కెట్ రాకుండా  పురందేశ్వరి అడ్డుపడ్డారు.

    ఈ నేపధ్యంలో బీజేపీ అసలు నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టిడిపి నుంచి బిజెపిలో చేరిన, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నవారికే టిక్కెట్లు దక్కడం బిజెపిలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి నేతలు వచ్చినపుడు తప్పితే మిగిలిన సమయాలలో పార్టీ అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు సహకరించలేదని తెలుస్తోంది. దీనికి తోడు టిడిపి, జనసేన నుంచి కూడా ఓటు బదిలీ కాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బిజెపి అభ్యర్ధులు వాపోతున్నారు. జనసేన, టిడిపి ఓట్లు తమకు బదిలీ కాకపోవడం చాలా దెబ్బేసిందని వారు చెబుతున్నారు. దీంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో పూర్తిగా విఫలమయ్యామని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.

    సొంత పార్టీ నేతలకంటే బిజెపి, జనసేనను నమ్ముకుని పూర్తిగా మునిగిపోయామని టిడిపి నేతలు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటే జనసేన, బిజెపి ఓట్లు తమకు పడకపోవడంపై నైరాశ్యంలో ఉన్నారు. గాజు గ్లాజు గుర్తు ఉన్న చోట మాత్రమే ఓట్లు పడ్డాయని...టిడిపి అభ్యర్ధులు ఉన్న చోట జనసేన ఓట్లు వేయలేదని..చాలా చోట్ల తమకి నచ్చిన పార్టీకి...నేతకి ఓటు వేసుకున్నారని గోదావరి జిల్లాకి చెందిన ఓ టిడిపి నాయకుడు చెబుతున్నారు. గోదావరి జిల్లాలలో టిడిపి, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ అవుతాయని భావించామని కానీ బిజెపితో కలవడం బాగా దెబ్బ కొట్టిందని అంటున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ ఓట్లు తమకు పడలేదని..గాజు గ్లాసు లేని చోట పలువురు వైఎస్సార్ సిపికి ఓటు వేయడంతో తమ విజయవకాశాలను దెబ్బ కొట్టిందంటున్నారు. కొన్ని చోట్ల గత అయిదేళ్లగా పార్టీ కోసం కష్టపడిన నేతలని పక్కన పెట్టడం కూడా టిడిపికి మైనస్ అయింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని వైఎస్సార్ సిపి బహిషృత నేత రఘరామకృష్ణంరాజుకి ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా మైనస్ గా మారిందంటున్నారు.

    దీనికి తోడు టిడిపి రెబెల్ గా ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో ఉండటం కూడా పూర్తిగా వ్యతిరేకమైందంటున్నారు. ఇలా పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలని కాదని బయట పార్టీ వారికి ఇవ్వడం కూటమి అభ్యర్ధుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. టిక్కెట్ రాని నేతలంతా చివరి నిమిషంలో కూటమి నేతలకి షాక్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు జనసేన, బిజెపి ఓట్లు కూడా పూర్తిగా టిడిపికి పడలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే గెలుపుపై టిడిపి ధీమా కోల్పోయి..ఓటమి ఖాయమై నేతలంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.

     

  • దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. బీహార్‌లో మరో వారసత్వ పోరుకు తెరలేచింది. బీహార్‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ఇప్పుడు తన కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపారు. వారే మిసా భారతి.. రోహిణి ఆచార్య. అసలు మిసా అంటే ఏమిటి..? రోహిణికి లాలూ ఆ పేరు ఎందుకు పెట్టారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య  పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించి సోషల్‌ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరి పేర్ల వెనుక ఉన్న అర్థం ఏంటి..? అసలు లాలు యాదవ్‌ ఆ పేరు పెట్టడం వెనుక ఏమైనా స్టోరీ ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేసేస్తున్నారు.

    మిసా భారతి
    1976 దేశంలో ఎమర్జెన్సీ విధించిన నాటి రోజులు. అప్పటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో  లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడే ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని 'మిసా' అని పిలుస్తారు. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తన మొదటి  కుమార్తెకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 'మిసా భారతి' అని పేరు పెట్టారు

    రోహణి ఆచార్య
    ఇక.. తన రెండో కూతురు రోహణి ఆచార్యకు ఒక వైద్యురాలి పేరు వచ్చేలా పెట్టారు లాలూ ప్రసాద్‌ యాదవ్‌. 1979లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి మరోసారి తల్లి అయ్యారు. అయితే.. ఆమెకు డెలివరీకి ముందు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రబ్రీదేవీకి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్‌ గురించి తెలిసి భయపడిన లాలూ యాదవ్‌కు డాక్టర్‌ కమలా ఆచార్య ధైర్యం చెప్పారు. ఆ తరువాత రబ్దీదేవికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు.

    ఆపరేషన్ పూర్తయిన తరువాత.. ఆపరేషన్‌కు అయిన ఖర్చును కూడా లాలూ యాదవ్‌ నుంచి తీసుకునేందుకు డాక్టర్‌ కమలా ఆచార్య ఒప్పుకోలేదు. అంతే కాకుండా రెండో కుమార్తె పుట్టిన నక్షత్రం రోహిణి కావడంతో.. డాక్టర్ పేరు, రోహిణి నక్షత్రం వచ్చేలా 'రోహిణి ఆచార్య' అని పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ ఇద్దరు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మిసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తుండగా.. రోహిణి ఆచార్య బీహార్‌లోని సారణ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్‌పై పోటీ చేస్తున్నారు.

    2013లో వరకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సారణ్‌ సేట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి తన చిన్న కూతురు రోహిణి ఆచార్యను బరిలోకి దించారు. ఇక్కడ మే 20న పోలింగ్‌ జరగనుండగా.. పాటలీపుత్రలో జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. పాటలిపుత్ర నుంచి పోటీ చేస్తున్న మిసా భారతి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే.. లాలూ కూతుళ్లు ఇద్దరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఇదే తొలిసారి.

  • న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్‌పై దాడిని ఆప్‌ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్‌ కుమార్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్‌ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హం

    ఈ ఘటనపై కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పందించారు.

    తన నివాసంలోనే స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడిపై కేజ్రీవాల్‌ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్‌ కుమార్‌తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.

    ‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్‌ మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్‌ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

    చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు

  • సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని  ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్‌ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.

    ‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం​ లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ చేశారు. జగన్‌ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం​ లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.

    ‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.

    ‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.

    మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న  తీరు చూస్తుంటే  మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.

    ‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు  కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.

    ‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ  సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

     

     

Family

  • పాకిస్థాన్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్‌గా పాపులర్‌ అయిన మహమ్మద్ షిరాజ్  తన ఫ్యాన్స్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా  ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న షిరాజ్‌ ఇదే నా చివరి వ్లాగ్‌ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది.

    మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్‌ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్‌లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)"   అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.  "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్‌లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.

    అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు.  ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్‌ సాధించింది.

    కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం  నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్‌లు  కూడా చేయి మొరకరు కమెంట్‌ చేశారు.  చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని  కమెంట్‌ చేశారు.

    కాగా పాక్‌లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్‌ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ బాగా పేరు సంపాదించాడు.  
     

  • ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్‌ కార్పెట్‌పై వివిధ రకాల డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అక్కడున్న వారందర్నీ తమ స్టన్నింగ్‌ లుక్‌తో మైమరిపించారు. అందాల సుందరీ, బాలీవుడ్‌ ​నటి ఐశ్వర్యారయ​ చక్కటి డిజైనర్‌ గౌనుతో అలరించిగా, మిగతా సెలబ్రిటీలో తమదైన శైలిలో మిస్మరైజ్‌ చేశారు.

    ఇక సూపర్ మోడల్, మాజీ మిస్ ఎర్త్ ఇండియా, బాలీవుడ్‌ నటి శోభితా ధూళిపాళ కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే శోభితా తొలిసారిగా ఈ రెడ్‌కార్పెట్‌పై మెరిశారు. ఆమె ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అధ్భతంగా కనిపించారు. శోభిత నమ్రత జోషిపురా జంప్‌సూట్‌ ధరించి రెడ్‌కార్పెట్‌పై ర్యాంప్‌ వాక్‌ చేసింది. ఆమె అత్యుత్తమ స్టైల్‌ని ఎంపిక చేసుకుని మరీ ఈ వేడుకలో మెరిశారు. 

    మిరుమిట్లు గొలిపే ఊదారంగు డ్రస్‌లో ఆకర్షణీయంగా కనిపించారు. దానిపై ఉన్న సీక్విన్‌ వర్క్‌ శోభితా లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. వీ నెక్‌ డ్రస్‌కి తగ్గట్టుగా ఉంగరాల జుట్టుతో గ్లామరస్‌గా కనిపించింది శోభిత. అయితే ఆమె ధరించి డిజైనర్‌వేర్‌ ప్రధాన ఆకర్షణగాక కనిపించినప్పటికీ..ఇది గతంలో అతియ శెట్టి ధరించిన డిజైనర్‌వేర్‌కి దగ్గరగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

    అతియా 2023లో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఇదే నమ్రత జోషిపురా జంప్‌సూట్‌ డిజైనర్‌వేర్‌ని ధరించింది. రెండు కలర్‌లు కొంచెం వేరుగానీ డిజైన్‌ దగ్గరగా దగ్గరగా ఒకేలా ఉండటం విశేషం. ఇక శోభితా సెలక్ట్‌ చేసుకున్న ఈ డిజైనర్‌ వేర్‌ ధర ఏకంగా రూ. 1.8 లక్షలు ధర పలుకుతుందట. 

     

    (చదవండి: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెక్టార్‌లో కృత్రిమ మేధ!)
     

  • సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి  హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది.  ఈ సిరీస్‌లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది.  ముఖ్యంగా  సంజయ్‌ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్‌ 'అలంజేబ్'  పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త  ఎవరు. అతని నెట్‌వర్త్‌ ఎంత అనేది  ప్రధాన చర్చగా మారింది.   ఈ నేపథ్యంలో ఆ వివరాలు  మీ కోసం.


    ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కంటెంట్ హెడ్‌గా పనిచేశారు.  తల్లి బేలా సెగల్  పాపులర్‌ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్‌ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్  లాంటి ఎన్నో  చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.

    అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్‌ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క  'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్‌ పాత్రను దక్కించుకుంది.

    రూ. 50 వేల కోట్ల ఆస్తి
    షర్మిన్ సెగల్ భర్త,  పారిశ్రామికవేత్త  అమన్ మెహతా  వేల కోట్లకు యజమాని.  గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్‌మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్‌ను అమన్‌ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్‌ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్‌గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్‌నకు  టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి  అనుబంధ  కంపెనీలున్నాయి.

    టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు  కూడా డైరెక్టర్‌గా  ఉన్నారు.

    ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. 

    అమన్ మెహతా విద్యార్హతలు
    అమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన  కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్‌లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్‌గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి  అయిన తరువాత  టోరెంట్ ఫార్మాలో  సీఎంఓగా చేరి మూడేళ్లకు  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందాడు.

  • మధుమేహం, లేదా షుగర్‌వ్యాధి వచ్చిందంటే  నియంత్రణలో  ఉంచుకోవడం చాలా అవసరం.  లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతతాయి.  ఒత్తిడి లేని జీవితం, జీవన శైలిలో మార్పులు,  క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార నిబంధనలు పాటిస్తే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో షుగర్‌ అదుపులో ఉండేలా ఒక చిన్న చిట్కాను   తెలుసుకుందాం.

    శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.మధుమేహాన్ని వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం.  అందుకే  మధుమేహం  లక్షణాలు, జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఏడోఅతిపెద్ద కిల్లర్‌గా మారుతుందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

    శరీరంలో పాంక్రియాస్‌  ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే చక్కెరను  గ్లూకోజ్‌గా మార్చి నిల్వ చేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ దీని పని. ఆహారం జీర్ణమైనప్పుడు అందులోని చక్కెర గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఈ గ్లూకోజ్‌ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అందుకే, ఆహార నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు.

    కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహం బారినపడుతున్నారు.

    కారణాలు
    సరైన వేళల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది.
    వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, ఇంకా ముందు తరం నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది.
    వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు.
    మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనవి. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’ అంటారు.

     మెంతుల వాటర్‌ 
    ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా ఇది ఉపయోగపడుతుంది.

    లేదంటే గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది. ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి గింజల్లో గ్లూకోమన్నన్ ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల చక్కెరను పేగు శోషించుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. మెంతులు చర్మం, శ్లేష్మ పొరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

    మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా  చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. నానబెట్టిన మెంతి వాటర్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

    మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్‌ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా మద్దతు ఇస్తుంది

    మెంతి సౌందర్య పోషణలోనూ బాగా ఉపయోగడుతుంది. మెంతి గింజలు పీరియడ్స్‌ సమస్యలకు కూడా మంచి చిట్కా పనిచేస్తాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి కూరను ఆకుకూరగా వాడుకోవచ్చు. 

    నోట్‌: ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే. సరియైన సమాచారం, చికిత్స కోసం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం

     

  • ఆహార ప్రాసెసింగ్ రంగంలో కృత్రిమ మేధా వినియోగాన్ని వేగవంతం చేయాలని భారత్‌ చూస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐఎప్‌టీఈఎం) నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. నిజానికి ఇది భారత్‌లో ప్రారంభ దశలోనే ఉన్నాయని అన్నారు. ఈ ఆహార ప్రాసెసింగ్‌ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని వేగవంతం చేయాలనుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

    ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై  సీనియర్ బ్యూరోక్రాట్‌లు, ప్రభుత్వ సలహాదారులు ఏఐ పరిష్కారాలను అమలు చేసేందుకు సరైన రోడ్‌మ్యాప్‌ వ్యూహం అవసరమని అన్నారు. ఈ ఎన్‌ఐఎప్‌టీఈఎం సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ అనితా ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ఒక పరిశ్రమగా మనం ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి. దీనికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈటీవై) మద్దతు కూడా ఉంటుందని చెప్పారు.  ఈ క్రమంలో నీతీ అయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ మాట్లాడుతూ.. సమర్థవంతమైన ఆహార ప్రాసెసింగ్‌కి ఈ "వాతావరణ స్మార్ట్‌" రైతు ఆదాయాలను పెంపొందించడానికి, వినియోగదారులను సంతృప్తిపరచడానికే కాకుండా పెరుగుతున్న వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో గొప్ప సహాయకారిగా ఉంటుందన్నారు. 

    అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి సులభమైన పోర్టబుల్ పరికరాలను అవపసరమని, అందుకసం ఏఐని ఉపయోగించాలని చెప్పారు. అదీగాక 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నందున ఈ ఏఐ పరిష్కారాలు మొత్తం రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.

    ఆహార పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ..
    ఆహార రంగంలో కృత్రిమ మేధస్సు అనేది ఆహార ఉత్పత్తి, ఖచ్చితమైన వ్యవసాయం, నాణ్యత నియంత్రణ, వ్యక్తిగతీకరించిన పోషణ, సరఫరా గొలుసు నిర్వహణ  కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి సాంకేతికతలు, డేటా అనలిటిక్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్‌లను ఉపయోగించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అప్లికేషన్లు సమర్థవంతమైన ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తూ, ఆహార పదార్థాల నాణ్యత  ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయని అర్థం.

    (చదవండి: ఓటింగ్‌ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్‌ కస్టమర్లకు భలే ఆపర్‌ అందించింది!)

     

  • పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు  టెక్ పరిశ్రమలోకి తన ఘనతను చాటుకుందో 16 ఏళ్ల బాలిక. డెల్వ్.ఏఐ (Delv.AI) స్టార్టప్‌తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.  రూ.100 కోట్ల విలువతో సక్సెస్ రూల్స్‌ను తిరగరాసింది ఈ యువ పారిశ్రామిక వేత్త. ఈ సంస్థ పరిశోధన కోసం డేటా వెలికితీతకు సంబందించిన సేవలను అందిస్తుంది. ఇప్పుడు తన సంస్థలో  పది మందికి  ఉపాధి కల్పిస్తోంది. 

    ప్రాంజలి అవస్థి 2022లో Delv.AIని ప్రారంభించింది. ఈ స్టార్టప్ ఇప్పటికే రూ.100 కోట్ల (12 మిలియన్ల డాలర్లు) విలువను కలిగి ఉంది.  డెల్వ్.ఏఐ  లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ఇప్పటికే 10 మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని కలిగి  ఉండటం విశేషం.

    పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యను ప్రోత్సహించడం ద్వారా ఆమె తండ్రి అవస్థి  ఉన్నతికి పునాది వేశారు.  ఈ ప్రోత్సాహంతోనే ఆమెను కేవలం ఏడు సంవత్సరాల వయస్సులో కోడింగ్ ప్రారంభించింది.  ఆమెకు 11 ఏళ్లున్నపుడు  కుటుంబం భారతదేశం నుంచి ఫ్లోరిడాకు మారింది. 

    13 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్స్‌లో ఆమె ఇంటర్న్‌షిప్  ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ఆమె ప్రవేశించింది. ఇంటర్న్‌షిప్ సమయంలో, కోవిడ్‌ మహమ్మారి కారణంగా వర్చువల్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు ప్రాంజలి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లలోకి ప్రవేశించింది.  ఓపెన్‌ ChatGPT-3 బీటా విడుద లైన క్రమంలోనే ఈ వెంచర్‌ కూడా మొదలైంది.

    హైస్కూల్ విద్యార్థిని లూసీ గువో, బ్యాకెండ్ క్యాపిటల్‌కు చెందిన డేవ్ ఫాంటెనోట్ నాయకత్వంలో మియామిలో AI స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ నుంచి పెట్టుబడులను పొందడంలో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అవస్థికి సహాయపడింది. ఆ తర్వాత ఆమె వ్యాపార ప్రయాణం ప్రారంభమైంది. 

    ప్రాంజలి అవస్తి తన కంపెనీని జనవరి 2022లో స్థాపించింది. దాదాపు రూ3.7 కోట్లతో ప్రారంభ నిధులను సేకరించింది.  కేవలం ఒక ఏడాదిలోనే  రూ100 కోట్లకు చేరింది.
     

  • ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతుంటే ఆ ఉల్లాసమే వేరు. అందులో ఆ గేమ్‌ అడ్వెంచర్‌, థ్రిల్లర్‌, యాక్షన్‌ని కలిగి ఉంటే అబ్బో చెప్పనక్కర్లేదు. అలాంటి రకాలనే ఈ గేమ్‌ కూడా కలిగి ఉంది. మరి అదేంటో ఆడేద్దామా!

    రియల్‌–టైమ్‌ టాక్టిక్స్, రియల్‌–టైమ్‌ స్ట్రాటజీ గేమ్‌ మెన్‌ ఆఫ్‌ వార్‌–2. 2011లో వచ్చిన మెన్‌ ఆఫ్‌ వార్‌: అసల్ట్‌ స్వా్కడ్‌  సీక్వేల్‌గా వస్తున్న ఈ గేమ్‌ వరల్డ్‌ వార్‌–2 నేపథ్యంలో సాగుతుంది. 2016లో వచ్చిన  ‘మెన్‌ ఆఫ్‌ వార్‌’కు  ఇది మోడ్రన్‌ రీమాస్టర్‌. లార్జ్‌ స్కేల్‌ టాంక్‌ కంబాట్‌ చేసే ప్లేయర్స్‌ కోసం స్కీమిష్‌ మోడ్‌ ఉంది.

    ఇంజిన్‌: జెమ్‌ 2
    ప్లాట్‌ఫామ్‌: మైక్రోసాఫ్ట్‌ విండోస్‌
    జానర్స్‌: రియల్‌–టైమ్‌ టాక్టిక్స్, రియల్‌–టైమ్‌ స్ట్రాటజీ  
    మోడ్స్‌: సింగిల్‌–ప్లేయర్, మల్టీప్లేయర్‌

    ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్‌’ మ్యూజిక్‌ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్‌ అనాల్సిందే..!

  • వేసవి వచ్చిందంటే పచ్చళ్ల  సీజన్‌ మొదలవుతుంది.  పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు,  ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో  ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు,  బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు  నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించే వారంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇక పండుగలు పబ్బాలు వచ్చాయింటే నువ్వుల నూనెతో  నలుగులు, మసాజ్‌లు ఆ సందడే  వేరుగా ఉండేది. 

    వేల ఏళ్లుగా మన సంస్కృతిలో, మన  ఆహార పదార్థాల్లో కీలకమైనవి నువ్వులు. నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉదాహరణకు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి  రక్షణ పొందవచ్చు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యపోషణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

    నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.

    ఫైబర్‌ ఎక్కువ
    నువ్వుల గింజలలో పైబర్‌ ఎక్కువగా లభిస్తుంది. కొన్ని అధ్యయనాలు క్రమం తప్పకుండా నువ్వులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది.   కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రోటీన్ చాలా అవసరం. ఆ కొరతను నువ్వుల ద్వారా తీర్చుకోవచ్చు.  

    రక్తపోటును తగ్గించడంలో
    నువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు , స్ట్రోక్‌లకు ప్రధాన ప్రమాద కారకం.  అలాగే  కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలకు మంచి శక్తినిస్తుంది.  

    సౌందర్య పోషణలో
    నువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. 

    నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. 

    నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల  చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. 

    నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల  జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. ఈ నూనెతో  మాడును మసాజ్‌ చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి.   రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తే మేని ఛాయ మెరిసిపోతుంది.

     

  • ప్రజలు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా స్వయం సహాయక బృందాల నుంచి ఆఫీసర్ల వరకు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించే యత్నం చేశారు.  అలానే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) కూడా చేరి తన వంతుగా ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించింది. ఓటు వేస్తే మా రెస్టారెంట్‌లలో తక్కువ బిల్లుకే మంచి భోజనం తినొచ్చు అంటూ చక్కటి 'డెమోక్రసీ డిస్కౌంట్‌'ని అందిచింది కస్టమర్లకు. ఎక్కడంటే..

    ముంభైలోని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసీయేషన్‌ ఆప్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) ఈ ఆఫర్‌ అందిస్తోంది. ఈ ఎన్నికల సీజన్‌లో బయటకు వెళ్లేందుకు కారణం కోసం చూస్తున్నారా! ఐతే ఇది మీకు మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో ఓటు వేయండి. ఓటువేసినట్లు సిరా చుక్క వేయించకున్నా.. మీ వేలుని చూపించి ముంబై నగరంలోని రెస్టారెంట్‌లో చక్కటి భోజనం ఆస్వాదించి బిల్లులో 20% డిస్కౌంట్‌ పొందండి అంటూ ప్రచారం చేస్తోంది ఎన్‌ఆర్‌ఏఐ. 

    నగరంలో దాదాపు వంద రెస్తారెంట్లు ఈ ఆఫర్‌ని అందిస్తున్నాయిని ఎన్‌ఆర్‌ఏఐ పేర్కొంది. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూసేందుకు తమ వంతుగా చేస్తున్న ప్రయత్నం అని ముంబై ఎన్‌ఆర్‌ఏఐ సీఈవో రాచెల్ గోయెంకా చెప్పారు. మహారాష్ట్రలో మే 20, 21వ తేదీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా వినూత్నమైన రీతీలో ప్రచారం చేస్తోంది ఎన్‌ఆర్‌ఏఐ. 

    ఇప్పటికే ముంభైలో సుమారు 150 రెస్టారెంట్లు ఈ ఆపర్లను అందిస్తున్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన డెమోక్రసీ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఇచ్చే రెస్టారెంట్‌ల పూర్తి జాబితాను కూడా వెల్లడించారు. మీ సమీపంలో  ఉన్న రెస్టారెంట్‌ని ఎంచుకుని చక్కగా ఓటు వేసి 20% డిస్కౌంట్‌లో చక్కటి భోజనం ఆస్వాదించడని చెబుతున్నారు గోయెంకా.  

    (చదవండి: వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!)

     

NRI

  • శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన ఈ మధ్య ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మనది చాలా వైవిద్యమున్న దేశం, ఇక్కడ దక్షిణాదివాళ్ళు ఆఫ్రికన్లలా, ఉత్తరాదివాళ్లు శ్వేతజాతీయుల్లా, తూర్పువాళ్ళు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా కనబడుతారు, అయినా మనమంతా ఒక్కటే! అన్నాడు. ఆయన మాటల్లో తప్పుందా? లేదా అన్నది పక్కనబెడితే ఆర్య, ద్రావిడ అంతరాల చర్చ మనకు కొత్తేమి కాదు. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీల మధ్య అదో వివాదాస్పద విషయం అయింది. అమెరికాలో భారత సంతతి వారిని మామూలుగానైతే బ్రౌన్స్( Wheatish ) అంటే గోధుమవర్ణం కలవారని అంటుంటారు. 

    అంతమాత్రాన ఒక ఉప ఖండమంత ఈ దేశంలో ఉన్నవారందరూ అదే రంగు కలవారు కాదు కదా! ఈ గోధుమ వర్ణం చాలావరకు ఉత్తరాది వాళ్లకు వర్తిస్తుంది, దక్షిణాదిలో నలుపు వర్ణస్తులే ఎక్కువ. తెలుపు పాశ్చాత్యుల రంగు. అమెరికాలోని 70 శాతానికి పైగా ప్రజలు కాకేసియన్ (యూరోపియన్) జాతివారు, మిగతా 30 శాతంలో లాటినో, ఆఫ్రికా అమెరికన్స్, ఆసియన్స్ వారి రంగు, రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. అయితే చాలామంది ముఖ్యంగా స్త్రీలు ఏ దేశస్తులైనా వారికి జన్మతో సహజంగా వచ్చిన శరీర వర్ణంపై, అందంపై అంతగా తృప్తి ఉన్నట్లు కనబడదు. భారత్‌లో పసుపు, కుంకుమ, కాటుకలే గొప్ప సౌందర్య సాధనాలు, మధ్యకాలంలో వచ్చినవి స్నోలు, పౌడర్లు, ఇప్పుడైతే లెక్కకు మిక్కిలి. 

    రంగు పెంచుకునే పాట్లు..
    అమెరికాలో నల్లవారైతే కాస్త తెల్లగా కనబడాలని, బ్రౌన్ కలర్ వున్నవారు కొంత తెల్లబడాలని, పూర్తి తెల్లవారు ఆ కలర్ కాస్త తగ్గితే బాగుండునని, ఉన్న శరీర వర్ణ సౌష్టవాన్ని మరింత పెంచుకోవాలని అందుకు శతప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల సౌందర్య తృష్ణ ఫలితంగా అక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతున్న బ్యూటీ సెలూన్లు, పార్లర్లు, క్లినిక్‌లు, జిమ్‌లు, స్పాలు, మసాజ్, ట్యానింగ్ ( చర్మశుద్ధి ), బ్లీచింగ్ ( చర్మాన్ని తెల్లబరచడం ) బాడీ టోనింగ్ ( కండరాల వృద్ధి), హెయిర్ టోనర్ వగైరా సెంటర్లు నడుస్తున్నాయి. నేను అమెరికా వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక సముద్రతీర సందర్శన ఉండనే ఉంటుంది. అలా ఏ రాష్ట్రంలోని ఏ బీచ్ కు వెళ్లినా ‘ సన్ బాత్ ’ చేసే స్త్రీ పురుషులతో అవి కిటకిట లాడడం గమనించాను. 

    సూర్య  స్నానాలు
    వీటివల్ల సూర్యకాంతి సోకి చర్మశుద్ధి అవుతుంది, చర్మంలో మార్పు వస్తుంది, శరీరానికి విటమిన్ డి లభిస్తుంది, ఎముకలు ధృడమౌతాయి, మనిషిలోని ఒత్తిడి తగ్గుతుంది, మంచినిద్ర కూడా వస్తుందంటారు. కానీ ఇలాంటి ‘సూర్య స్నానాలు’ సూర్యోదయం నుండి ఉదయం 10 గంటల వరకు పర్వాలేదు, ఆ తర్వాత సాయంత్రం ముందు వరకు సూర్యుని నుండి సోకే యూఏబి కిరణాలవల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం ఉందన్నది డాక్టర్ల హెచ్చరిక. ఎందుకొచ్చిన ‘అవుట్ డోర్ ట్యానింగ్’ అనుకునే వారికోసం ప్రత్యామ్నాయంగా వచ్చినవి, అమెరికన్ మహిళల ఫ్యాషన్ అయినవి ‘ఇండోర్ ఆర్టిఫిషల్ అల్ట్రా వయలెట్ సెంటర్లు . 

    ఇందులో అతి నీలలోహిత వికిరణాలను విడుదలచేసే పరికరాలు, ట్యానింగ్ లేదా సన్ బెడ్స్ ఉంటాయి. ఇక్కడ చర్మానికి హాని చేయని విధంగా కృత్రిమ కాంతిని నియంత్రిత పద్దతిలో వాడి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ చికిత్స 16-25 సంవత్సరాల వయసులో ఉన్నవారికేనట. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు వున్నవారికి కూడా ఈ చర్మశుద్ధి చికిత్సలు ఉపయోగపడుతున్నాయంటున్నారు. 

    ఇలా ట్యానింగ్ వల్ల వచ్చిన కలర్ శాశ్వతం మాత్రం కాదు సుమా! ప్రపంచం లోనే స్వీడెన్ దేశ స్త్రీలు అందమైన వారు అంటారు, భారత్ లో హిమాచల్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్ మహిళల గురించి చెబుతారు. ఎవరి వర్ణం గొప్ప , అతిలోక సుందరులు ఎవరు? అంటే అది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యవంతులు, ఉన్నంతలో తృప్తిగా, ఆనందంగా ఉండేవారే అందమైనవారు అనడం సమంజసంగా ఉంటుంది !

    వేముల ప్రభాకర్‌

    (చదవండి: US : రిటైర్మెంట్‌ హోమ్స్‌.. మంచికా.? చెడుకా?)