సమ్మర్‌ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్‌ భలే చెక్‌ పెట్టాడు! | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్‌ భలే చెక్‌ పెట్టాడు! నెటిజన్లు ఫిదా

Published Wed, May 1 2024 7:08 PM

Auto Driver Arranged Grass On Auto To Get Relief From Summer Heat

ఈ ఏడాది సమ్మర్‌ మొదలవ్వక మునుపే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఏదో ఒక పని మీద బయటకు వెళ్లకుండా పని అవ్వదు. అలాంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్‌ ఎండ నుంచి రక్షణ కోసం చేసిన ఆలోచన నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్‌ ఐడియా బాస్‌ అంటూ అతడిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

ఏం చేశాడంటే..?
మనసుంటే మార్గం ఉంటుందన్న రూటులో సరికొత్తగా ఆలోచించాడు ఈ ఆటో డ్రైవర్‌. ఈ ఎండలకు ఏసీ కారు లాంటివి తప్ప సాధారణ బస్సు, ఆటోల్లో ప్రయాణించడం మహా కష్టం. ముఖ్యంగా ఆటోలో ఎడపెడా వేడి గాల్పు కొట్టేస్తుంది. అందుకని ఈ డ్రైవర్‌ ఆటో​ చుట్టూతా చక్కగా కవర్‌ అయ్యేలా మటితో నింపిన గోను ఏర్పాటు చేసి గడ్డి నాట్లు వచ్చేలా చేశాడు.

దీంతో ఆటోలో కూర్చొన్న వాళ్లకు మండే ఎండలో చల్లటి వెన్నెల్లో ఉన్న పీల్‌ కలుగుతుంది. ఆటోలో సహజసిద్ధమైన ఏసీ కదూ ఇది..!
నిజంగా ఈ డ్రైవర్‌ ఆలోచనకు హ్యాట్సాప్‌ అని చెప్పకుండా ఉండలేం కదూ..!. మొత్తం పల్లె పచ్చదనాన్ని ఆటోతో పట్నంలోకి తీసుకొచ్చాడేమో..! అన్నంత అందంగా ఉంది కదూ ఆ డ్రైవర్‌ ఐడియా..!

 

Advertisement
Advertisement