రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త.. | Today Gold And Silver Prices May 17th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..

Published Fri, May 17 2024 11:34 AM | Last Updated on Fri, May 17 2024 12:06 PM

gold price today rate may 17

బంగారం ధరల మోతకు బ్రేక్‌ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 17) కాస్త దిగొచ్చాయి. రెండు రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారం రూ.280 మేర తగ్గి ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి కాస్త ఉపశమనం కలిగించింది.

తెలుగు రాష్ట్రాల్లో.. 
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.250 తగ్గి రూ.67,600 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి  రూ. 73,750 లకు దిగొచ్చింది.

ఇతర నగరాల్లో.. 
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 దిగొచ్చి రూ.73,900 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,600లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు క్షీణించింది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,950 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.280 తగ్గి రూ.73,850 లకు దిగొచ్చింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 క్షీణించి రూ.67,600 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు (మే 17) స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,500లుగా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement