స్ట్రాంగ్‌ రూమ్‌లకు మూడంచెల భద్రత | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌ రూమ్‌లకు మూడంచెల భద్రత

Published Fri, May 17 2024 8:25 AM

స్ట్రాంగ్‌ రూమ్‌లకు  మూడంచెల భద్రత

కర్నూలు(సెంట్రల్‌): స్ట్రాంగ్‌ రూమ్‌లకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌, స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎస్పీ జి.కృష్ణకాంత్‌, పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్యతో కలసి గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పనిచేసే పోలీసు బలగాలు 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక్కడ పనిచేసే సీసీ కెమెరాల లైవ్‌ ఫీడింగ్‌ను 24 గంటల పాటు కంట్రోల్‌ రూమ్‌ నుంచి వీక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా చర్యల్లో వైఫల్యం చెందితే వేటు తప్పదని హెచ్చరించారు. అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ చల్లా కల్యాణి, డీఆర్వో కె.మధుసూదన్‌రావు, ఎమ్మిగనూరు ఆర్వో చిరంజీవి, కూడా వైస్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, డిడ్కో ఎస్‌ఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement