సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్‌ దాఖలు | Sakshi
Sakshi News home page

సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్‌ దాఖలు

Published Wed, May 1 2024 4:35 PM

Maneka Gandhi files nomination from Sultanpur

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌ సుల్తాన్‌ పుర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్‌ ప్రతాలు అందించారు. నామినేషన్‌ దాఖలు సమయంలో ఎన్‌డీఏ కూటమి పార్టీలు నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌, అప్నాదల్‌ నేత, కేబినెట్‌ మంత్రి అశిష్‌ పటేల్‌లు ఆమె వెంట ఉన్నారు.

నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణలపై
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్‌ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.

వరుణ్‌ గాంధీకి నో టికెట్‌
వరుణ్‌ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్‌ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. జితిన్‌ ప్రసాదకు అప్పగించింది.

2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్‌పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. 

Advertisement
Advertisement