లుక్ అదిరింది! | Sakshi
Sakshi News home page

లుక్ అదిరింది!

Published Thu, May 28 2015 11:01 PM

లుక్ అదిరింది! - Sakshi

నవతరం నాయికగా నటించడం పెద్ద కష్టం కాదు కానీ, పాత తరం.. అది కూడా 285 ఏళ్ల క్రితం నాటి మహిళగా నటించడమంటే ఏ కథానాయికకైనా పెద్ద సవాలే. నటనపరంగానే కాదు, ఆహార్యం, శారీరక భాష.. ఇలా అన్నింట్లోనూ వ్యత్యాసం చూపించాల్సి ఉంటుంది.
 
 ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ ఇలా పూర్తిగా అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నారు. ఆ చిత్రం పేరు ‘సాకో 363’. 1730లో జోథ్‌పూర్‌లోని కెజార్లీ అనే గ్రామానికి చెందిన గిరిజిన మహిళ అమృతాదేవి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.
 
 ఇందులో అమృతాదేవిగా స్నేహా ఉల్లాల్ నటిస్తున్నారు. ఆమె లుక్‌ని ఇటీవల విడుదల చేశారు. ఈ లుక్ చూసినవాళ్లు స్నేహా ఉల్లాల్ అసలు సిసలు గిరిజన మహిళలా ఉందని అభినందిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement