ఉసురు తీసింది ఆ దేవుళ్లా...ఈ దేవుళ్లా? | Sakshi
Sakshi News home page

ఉసురు తీసింది ఆ దేవుళ్లా...ఈ దేవుళ్లా?

Published Thu, Jul 16 2015 1:43 AM

who killed the pilgrims of puskaras ?

ఇటీవలి కాలంలో జరుగుతున్న చాలా పరిణామాలు చూస్తుంటే ఆర్భాటానికి తప్ప ఆచరణకు  ప్రాధాన్యమీయడం లేదన్న వాదనలను పాలకులే బలపరుస్తున్న ట్టుగా కనిపిస్తోంది. సీరియస్‌గా తీసుకోవలసిన విష యాలను చాలా తేలిగ్గా తీసుకోవడం పరిపాటి అయిం ది. పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముం దే తెలియదా? తొలిరోజు, తొలిఘడియల్లో స్నానం చేయాలనే విశ్వాసం చాలామందిలో ఉంటుం దని తెలియదా? పుష్కర ఘడియ సమీపించక ముందే వచ్చిన జన సంఖ్య తెలియదా? ఒక్క ఘాట్ దగ్గరే గంటలతరబడి వేచి ఉన్న వైనం తెలియదా? ఇన్ని తెలిసీ ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యమా? ఏం జరగదులే అన్న ధీమానా? ఉదాసీనతా? ఆధ్యాత్మిక కార్యక్రమమన్నది కేవలం వీఐపీల కోసం కాదు. దేవుడు వీఐపీల సొత్తు కాదు. కానీ పాలకుల, ప్రముఖుల ఆలనాపాలనా సామాన్య భక్తులకు శాపమైపోయింది. వీరికోసం ప్రత్యేక సదు పాయాలున్నా జనాల్లో తిరిగి ఇమేజ్ పెంచుకుందా మనే ‘ఇజం’, దీనికోసం జరిగే ఆర్భాటాలు కొంపలు ముంచుతున్నాయి. అసలు పుష్కరాలు ప్రారంభించ డం ఏమిటి? ప్రకృతి సహజంగా ముహూర్త వేళ జరిగే కార్యక్రమం మానవమాత్రులు ప్రారంభిస్తారా? ఎం దుకు ప్రారంభించాలి? ఇది ఒక పండుగ...మీరుకూడా పండుగలాగే జరుపుకోండి...
 
ఇంతజరిగినా కఠినచర్య తీసుకోవడానికి తాత్సా రం... నిజాన్ని ఒప్పుకుంటే చులకనవుతామేమోనన్న సంశయం... ఎవరికి దూరమవుతామోనన్న ఆందోళన. ఇప్పుడైనా తప్పు ఒప్పుకోకపోతే... కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకున్నా, విచారణ చేయిస్తామంటూ ప్రకటనలు చేసినా సామాన్యునికి యాంత్రికంగానే కనిపిస్తుంది. విశ్వనాథ్ ‘స్వాతికిరణం’ సినిమాలో.. తన చర్య లతో బాలగంధర్వుడు ప్రాణాలు కోల్పోవడానికి కార కుడైన భర్తను చూపిస్తూ మతిచలించిన ఆయన భార్య అడుగుతుంది...‘గంగాధర్ ప్రాణం తీసింది ఆ దేవుడా, ఈదేవుడా’ అని. విషయం ఏదైనా, తీరు ఏదైనా మేం స్థిరమైన మతితోనే అడుగుతున్నాం...‘27 మంది అభా గ్యుల ఉసురు తీసింది ఆ దేవుళ్లా...ఈ దేవుళ్లా’?
 - ఎన్.సి. సతీష్ కుమార్, హైదరాబాద్

Advertisement
Advertisement