మెదక్‌తో ఇందిరాగాంధీ అనుబంధం | Sakshi
Sakshi News home page

మెదక్‌తో ఇందిరాగాంధీ అనుబంధం

Published Mon, Dec 3 2018 11:05 AM

 Indira Is Associated With Medak - Sakshi

మెదక్‌ అర్బన్‌: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇందిరా మరణాంతరం ఆమె స్మారకార్థం ప్రభుత్వం పట్టణంలో ఓ పోస్ట్‌ఆఫీస్‌ నిర్మించి ఇందిరాగాంధీ భవన్‌ అని పేరు పెట్టింది. మూడు అంతస్తులతో రాతితో నిర్మితమైన ఈ భవనం మెదక్‌ పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 


ఈ అతిథి గృహంలోనే ఇందిర విశ్రాంతి..
నాటి ఎన్నికల సమయంలో ప్రచారానికి ఇందిరా వచ్చినప్పుడు ప్రస్తుత జూనియర్‌ కళాశాల మైదానంలో హెలికాప్టర్‌ దిగి.. అనంతరం దగ్గరలోని అతిథి గృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకునేవారు.

ఆ సమయంలో పటిష్టమైన భారీ బందోబస్తు ఉండడంతో ఆమెను స్థానిక నాయకులు సైతం కలవడం కష్టంగా ఉండేది.  పట్టణంలోని చిల్డ్రన్స్‌పార్కులో నిర్వహించిన బహిరంగ సభలో ఇందిరా మాట్లాడారు.
 

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement