-
కలర్‌ఫుల్ ఎంఆర్ఐ స్కానర్
న్యూఢిల్లీ: ఎంఆర్ఐ స్కానింగ్ అంటే చాలా మందికి భయం. వింత శబ్దాలతో గుహలోకి వెళ్లిన ఫీలింగ్. చిన్నారులకు ఎంఆర్ఐ అంటే మరీ కష్టం. పిల్లలు భయపడకుండా స్కాన్ తీయడం కోసం ‘చిన్నారి’ ఎంఆర్ఐ మిషన్లు వస్తున్నాయి. మిషన్‌కు రంగులద్దడంతో పాటు దానిపైన ఫిక్షనల్ కేరక్టర్స్, బొమ్మలు చిత్రీకరించి పిల్లల్ని ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ఎంఆర్ఐ మిషన్లు ఉంటున్నాయని పారిశ్రామికవేత్త హర్షగోయెంక ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ మిషన్‌ను చూసిన నెటిజన్లు భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
Global Investors Summit:గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే అతిథులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్దం చేశారు. జీఐఎస్ కి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులు సంఖ్య పెరుగుతుండగా వాహనాలు, వసతులకు డిమాండ్ ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‌కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు తరలిరానున్నారు. రెండు రోజుల సమ్మిట్ కోసంఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు. కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్‌కు తీసుకుంటున్నారు. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్‌కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి. ఇక వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్‌కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం -
ఎగుమతుల వృద్ధే లక్ష్యంగా ‘వాణిజ్య ఉత్సవం-2021
-
వాణిజ్య ఉత్సవం-2021: ఎగుమతి దారులకు ప్రోత్సహాలు
-
వాణిజ్య ఉత్సవం-2021: అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఎగుమతుల శాతం వృద్ధి చెందడంలో ప్రముఖ పాత్ర పోషించిన పలువురు వ్యాపారవేత్తలకు ఇండస్ట్రి చాంపియన్, ఎక్స్పోర్ట్ చాంపియన్ పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవార్డులు ప్రదానం చేశారు. ఇండస్ట్రి చాంపియన్ అవార్డ్.... పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి(ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సియాంట్ ), కాప్ డాంగ్లి (చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) అనిల్ చలమశెట్టి (మేనేజింగ్ డైరెక్టర్, గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) అవినాశ్ చాంద్రయ్,(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదాని కృష్ణపట్నం పోర్టు), జీజే రావు(డైరెక్టర్, అదాని కృష్ణపట్నం పోర్టు) ఈశాన్ రెడ్డి ఆళ్ల (ప్రమోటెడ్ డైరెక్టర్, రాంకీ గ్రూప్) సీవీ రాజులు(వైస్ ప్రెసిడెంట్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్) కే మదన్‌మోహనరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అరబిందో ఫార్మ లిమిటెడ్) ఎక్స్పోర్ట్ చాంపియన్ అవార్డు... సి. శర్వానంద్ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ ప్రైవేట్ లిమిటెడ్) లీ ఈ సీ (జనరల్ మూనేజర్, అపాచి ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) బీవీ కృష్ణారావు (మేనేజింగ్ డైరెక్టర్, పట్టాభి అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్) వంక రాజకుమారి(మేనేజింగ్ డైరెక్టర్, ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్) పాండవ ప్రసాద్ (జనరల్ మేనేజర్, ఎస్ఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సింగలూరి శారదా దేవి (పార్టనర్, ఆర్వీ కాప్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం
మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!
పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
మెట్ గాలాలో మరోసారి సందడి చేయనున్న సుధారెడ్డి! ఎవరీమె..?
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
సినిమా అట్టర్ ఫ్లాప్.. కొత్తిల్లు కొన్న రజనీ కూతురు
పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్ శర్మ
సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ
అందుకే ‘ఓటుకు నోటు’ విచారణ బదిలీ కోరుతున్నాం
తప్పక చదవండి
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
Advertisement