-
తగ్గేదేలే.. ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ప్రపంచస్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకున్న ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం లభించింది. తాజాగా అమెరికాలోని 'లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు దక్కింది. (ఇది చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసింది. ఈ అవార్డ్ అందుకున్న ఫోటోలు ఆర్ఆర్ఆర్ బృందం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కీరవాణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదే ఊపులో ఆస్కార్ అవార్డ్ కూడా తీసుకురావాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. .@mmkeeravaani’s acceptance speech for #RRRMovie’s score at @LAFCA. ❤️🔥🔥🌊 pic.twitter.com/XIDhze3ZkW — RRR Movie (@RRRMovie) January 15, 2023 -
ఒలింపిక్స్‌లో క్రికెట్.. త్వరలోనే ప్రకటన..!
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ త్వరలో విశ్వక్రీడల్లో భాగంగా కానుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసే అంశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వర్గాలు వెల్లడించాయి. క్రికెట్ సహా మరో 8 కొత్త క్రీడలను ఒలింపిక్స్ క్రీడల తుది జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ జాబితాపై ఐఓసీ త్వరలోనే సమీక్ష నిర్వహించి 2028 ఒలింపిక్స్‌లో ఏఏ క్రీడలకు అనుమతి ఇవ్వాలో తేల్చనుంది. వచ్చే ఏడాది ముంబైలో జరిగే సమావేశాల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. క్రికెట్‌తో పాటు బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోస్సే, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ క్రీడలను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు ఐఓసీ ప్రతపాదించింది. కాగా, 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తొలిసారి విశ్వక్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..? -
లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా సీతారాముల కల్యాణం
లాస్ ఏంజిల్స్‌లో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. లాస్ఏంజెసెల్ నగరానికి సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో లాస్ఏంజెలెస్ నగర వీధులు కొత్త శోభను సంతరించుకున్నాయి. సిమీ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కల్యాణం అచ్చంగా భద్రచల శ్రీరాముల కల్యాణ మహోత్సవాన్ని తలపించింది. భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించి అమెరికాకు తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో మేళతాళాల సాక్షిగా పెళ్లి జరిగింది. అనంతరం ఆడ పడుచుల కోలాటాల మధ్య సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకుంది. దాదాపు 50 మంది తెలుగు ఆడపడుచులు చేసిన కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదుకలకు పట్టాభిషేకం నిర్వహించారు. గోవింద, రామ నామా స్మరణతో ఆ ప్రాంగణం అంతా మార్మోగి పోయింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న వారంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. దాదాపు 700 మందికి పైగా భక్తులు కల్యాణోత్సవంలో భాగమయ్యారు. 70 కి పైగ జంటలు సామూహికంగా కళ్యాణం లో పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటలకు పైగా ఈ వేడుకలు జరిగాయి. ఈ కల్యాణోత్సవానికి సహాకరించిన ప్రతీ ఒక్క స్వచ్చంధ సంస్థకి నిర్వాహకులు రామ్ కొడితాల, నంగినేని చందు, టీ కుమార్, ఏ మనోహార్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
టెస్లాకు గట్టి పోటీ.. ఛార్జింగ్ లేకున్నా దూసుకెళ్తుంది!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరే చెప్పుకోక ఉండలేదు. టెస్లా కార్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాతనే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది టెస్లా. అలాంటి కంపెనీ నుంచి ఒక కారు వస్తుంది అంటే? దానికి ఉండే క్రేజ్ వేరు. టెస్లా గతంలో సైబర్ ట్రక్ పేరుతో ఒక కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఈ కారుని మార్కెట్లోకి తీసుకొని రాలేదు. అయితే, అచ్చం అలాంటి ఒక కారును చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ఎడిసన్ ఫ్యూచర్ కంపెనీ ఈఎఫ్1-టీ పేరుతో రూపొందించింది. అచ్చం టెస్లా సైబర్ ట్రక్ లాగా ఈ ఎడిసన్ ఫ్యూచర్ స్టార్టప్ కంపెనీ ఈఎఫ్1-టీ సోలార్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ కాన్సెప్ట్ ను నవంబర్ 19 నుంచి జరుగుతున్న లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఈ వారం ప్రదర్శించింది. ఇది అచ్చం చూడాటానికి టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సోలార్ ట్రక్కును ఈఎఫ్1-టీ పేరుతో పిలుస్తారు. ఇది రిట్రాక్టబుల్ సోలార్ కవర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ట్రక్ పగటిపూట ప్రయాణిస్తున్నపుడు దానికి అదే ఛార్జ్ అవుతుంది. సోలార్ రూఫ్ రోజుకు 25 నుంచి 35 మైళ్ల రేంజ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ట్రక్ వెనుక భాగాన్ని మూసినప్పుడు ఈఎఫ్1-టీ పికప్ ట్రక్కు టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈఎఫ్1-టీ రిట్రాక్టబుల్ సోలార్ ప్యానెల్స్ పొరల రూపాన్ని కలిగి ఉంటుంది. 724 కిమీ రేంజ్ టెస్లా సైబర్ ట్రక్ లాగా ఈ ట్రక్ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ అవునా? కాదా అనేది తెలీదు. ఈఎఫ్1-టీ ఎలక్ట్రిక్ సోలార్ పికప్ ట్రక్కు లోపల17.5 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, మిర్రర్ కెమెరా స్క్రీన్లు, డోర్ మౌంటెడ్ టూల్ బాక్స్, రూఫ్ మౌంటెడ్ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఈఎఫ్1-టి ధర ఎంత అనేది తెలీదు, కానీ కంపెనీ 2025లో ట్రక్కును ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది ఈఎఫ్1-టీ ట్రక్ మూడు వేరియంట్స్ లలో అందుబాటులో ఉండనుంది. దీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 724 కిమీలకు పైగా దూసుకెళ్లనుంది. ఇది 0-100 కిమీ వేగాన్ని 3.9 సెకన్లలలో అందుకోనుంది. -
13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్‌కు తండ్రి నుంచి విముక్తి
Britney Spears Release Conservatorship From Her Father: ఎట్టకేలకు తండ్రి చెర నుంచి పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్(39) విముక్తి పొందింది. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను ఆమె తండ్రి జేమిని స్పియర్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిట్నీ తన తండ్రి జేమీ స్పియర్స్ తన జీవితాన్ని నాశనం చేశాడని, అతని చెర నుంచి విముక్తి కల్పించాలని ఆమె గత జులైలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శుక్రవారం(నవంబర్ 12) ఈ కేసును విచారించిన లాస్ ఎంజిల్స్ కోర్టు తనకు ఊరటనిచ్చింది. చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే.. తన తండ్రి చెర నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ‘నా జీవితంలో ఇదే అత్యుత్తమైన రోజు’ అంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. దీంతో ఆమెకు మద్దతు తెలిపేందుకు ఆమె ఫ్యాన్స్ లాస్ ఏంజిల్స్ కోర్టుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బ్రిట్నీ తన తండ్రి సంరక్షణలో భౌతికంగా, ఎమోషనల్, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయినట్లు ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదించారు. చదవండి: Kangana Ranaut: అప్పుడేం జరిగిందో చెబితే పద్శశ్రీ తిరిగి ఇచ్చేస్తా వారి వాదనలు విన్న లాస్ ఎంజిల్స్ కోర్టు ఆమెకు ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది. గత 13 ఏళ్ల నుంచి తన తండ్రి వల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు ఆమె ఇటీవల కోర్టులో పేర్కొంది. సంరక్షణ స్థానం నుంచి తన తండ్రిని తప్పించాలని, ఆయన వద్ద ఉన్న నియంత్రణాధికారాలను తొలగించాలని బ్రిట్నీ కోర్టును వేడుకుంది. 2008 నుంచి పాప్ సింగర్ బ్రిట్నీ తన తండ్రి జేమ్స్ స్పియర్స్ కస్టడీలో ఉంటున్నది. అయితే తనపై తన తండ్రికి ఉన్న న్యాయపరమైన నియంత్రణను తొలగించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది. చదవండి: విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్ చరిత్ర ఏంటో తెలుసా..? బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి జేమ్స్ చూసుకున్నారు. 13 ఏళ్ల నరకం ఇక చాలు అని, తన జీవితాన్ని తనకు వెనక్కి ఇప్పించాలని ఆమె కోర్టును కోరింది. బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్నదని, ఆమెను తండ్రి చెర నుంచి విముక్తి చేయాలని ఆన్లైన్లో ఫ్రీ బ్రిట్నీ ఉద్యమం కొనసాగించిన విషయం తెలిసిందే. సంరక్షణాధికారాలను తన తండ్రి దుర్వినియోగం చేసినట్లు బ్రిట్నీ ఆరోపించింది. చదవండి: నా జీవితం నాక్కావాలి: కన్నతండ్రిపై సింగర్ సంచలన ఆరోపణలు View this post on Instagram A post shared by Britney Spears (@britneyspears)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement