-
ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ ఏట అడుగుపెట్టాడు. బిజినెస్ మాగ్నెట్, ఆసియాకుబేరుడు ముఖేష్ అంబానీ, ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ దంపతులకు 1957 ఏప్రిల్ 19న యెమెన్‌లో పుట్టాడు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అంబానీ తన సామర్థ్యం, కృషితో రిలయన్స్‌ను ప్రపంచంలోనే ప్రముఖ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించాడు. భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా, ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో నిలవడం విశేషం. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య బాధ్యతలను తన వారసులు, ఇషా అంబానీ పిరమల్, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలకు పంచి ఇచ్చినప్పటికీ 67 ఏళ్ల వయసులో కూడా వ్యాపార దక్షతలో చురుగ్గా ఉంటాడు. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో కీలకమైన వ్యాపార నిర్ణయాలతోపాటు ఇటు కుటుంబ బాధ్యతలను కూడా దిగ్విజయంగా నిర్వరిస్తున్నాడు. అంతేకాదు తన ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకోవడంలో కూడా దిట్ట. ఆయన పాటించే ఆహారం నియమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియనప్పటికీ, ఎలాంటి వర్కవుట్ లేకుండానే ముఖేష్ అంబానీ 15 కిలోలు తగ్గారట. ఈ సందర్బంగా ఆయన డైట్ , జీవన శైలి ఏంటి అనేది చర్చలో నిలిచింది. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) కఠినమైన ఆహార నియమాలతోనే ముఖేష్ అంబానీ ఈ అద్భుత ఫలితాన్ని సాధించారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర సక్సెస్ఫుల్ వ్యక్తుల మాదిరిగానే ముఖేష్ అంబానీ యోగా, ధ్యానంతో రోజు ప్రారంభిస్తాడు. ఉదయం 5:30 గంటలకు మేల్కొంటాడు. యోగా, ధ్యానం సూర్య నమస్కారాలు, వాకింగ్ కోసం బయటికి కూడా వెళ్తాడు. ఎంత బిజీషెడ్యూల్ ఉన్నా ఈ ఉదయపు దినచర్యను మాత్రం ఎప్పుడూ దాటవేయడు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) బ్రేక్‌ఫాస్ట్, లంచ్ డిన్నర్ ఇలా.. అంబానీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్‌ని ఫాలో అవుతారు. ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. ఇక రోజులోని అంబానీ తొలి భోజనం విషయానికి వస్తే అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్, ఇడ్లీ-సాంబార్ తీసుకుంటాడు. లంచ్, డిన్నర్ కూడా సాంప్రదాయ భారతీయ ఆహారాలతో చాలా సింపుల్‌గా కానిచ్చేస్తారట. గుజరాతీ తరహాలో దాల్, సబ్జీ, అన్నం, సూప్‌లు , సలాడ్లను ఇష్టపడతాడు. అది కూడా ఇంట్లో వండిన భోజనం మాత్రమే. కాగా ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలిగా ఐపీఎల్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. నీతా, అంబానీ దంపతులు ఇప్పటికేపెద్ద కుమారుడు ఆకాష్ అంబానీకి, కుమార్తె ఇషా అంబానీకి వివాహాలు జరపించారు. నలుగురు మనవలు కూడా ఉన్నారు. ఇక చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ ఏడాది జూన్‌లో జరగనుంది. -
నీతా అంబానీ లగ్జరీ కారు, ఫోటోలు వైరల్, ధర ఎంతంటే..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ అంటే లగ్జరీకి పెట్టింది. డైమండ్ నగలు, వాచ్‌లు, ఖరీదైన చీరలు,విలాసవంతమైన బ్యాగులు, డనుంచి చెప్పులు, లిప్‌స్టిక్ కలెక్షన్ల దాకా ప్రతీదీ ప్రత్యేకమే. తాజాగా నీతా మరో ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. స్పెషల్ గా కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB సెడాన్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు ఇది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి కారు ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.దీని స్టాండర్డ్మోడల్ ధర దాదాపు రూ.12 కోట్లు. కస్టమైజ్డ్ స్పెషల్కారుకావడంతో దీనిధర మరింత పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా కారు హెడ్రెస్ట్లపై నీతాముఖేష్ అంబానీ (ఎన్ఎంఏ) కూడా ఎంబ్రాయిడరీ చేసిన పిక్స్కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్ సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్ అధునాతన ఫీచర్లతో ఉన్న కొత్త లగ్జరీ రోల్స్ రాయిస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. గత దీపావళికి, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి రూ. 10 కోట్ల రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ప్రముఖ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారు ఉన్నవారు ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒకరు. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల జాబితా (ఫొటోలు)
-
Forbes richest list 2024: టాప్–10లో ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్–10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. 116 బిలియన్ డాలర్ల సంపదతో 66 ఏళ్ల ముకేశ్ టాప్–9గా నిలిచారు. 2023లో ముకేశ్ సంపద 83.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. దేశీయంగా సంపదలో టాప్–2గా నిలుస్తున్న గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు క్షీణించిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ 90 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌ను సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! జాబితా ఇలా ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2,781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023తో పోలిస్తే కుబేరుల ఉమ్మడి సంపద 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 14.2 ట్రిలియన్ డాలర్లను తాకింది. సరికొత్త రికార్డ్ నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల డాలర్లు జత కలసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్వీఎంహెచ్కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ 233 బిలియన్ డాలర్లతో టాప్ ర్యాంకును, 195 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ రెండో ర్యాంకునూ కొల్లగొట్టారు. 177 బిలియన్ డాలర్లతో ఫేస్బుక్ జుకర్‌బర్గ్ టాప్–3గా నిలిచారు. -
Forbes: డబ్బున్నోళ్ల లిస్ట్.. అందరికంటే రిచ్ ఈ పెద్దాయనే..
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తన 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ (LVMH) బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఆయన కుటుంబం 233 బిలియన్ డాలర్లు (రూ. 19.43 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. 2024లో రికార్డు స్థాయిలో 2,781 మంది బిలియనీర్లు ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య 141 ఎక్కువ. 2021లో నమోదైన రికార్డు కంటే 26 ఎక్కువ. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల మొత్తం సంపద 14.2 ట్రిలియన్ డాలర్లు (11.8 కోట్ల కోట్లు) అని పేర్కొంది. ఆర్నాల్ట్, ఆయన కుటుంబం తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్ల (రూ. 16.26 లక్షల కోట్లు) నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్ల (రూ. 16.17 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల (రూ. 9.67 లక్షల కోట్లు) సంపదతో టాప్ టెన్‌లో 9వ స్థానంలో నిలిచారు. ఈకాగా ఈసారి ఫోర్బ్స్ లిస్ట్‌లో కొత్తగా పలువురు సెలబ్రిటీలు చేరారు. పాప్ సంచనం టేలర్ స్విఫ్ట్ ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో అడుగు పెట్టింది. అక్టోబర్‌లో బిలియనీర్ హోదాకు చేరుకున్న ఈ పాప్ సూపర్ స్టార్, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిహన్న, కిమ్ కర్దాషియాన్, ఓప్రా విన్ఫ్రే, స్టార్ వార్స్ సృష్టికర్త జార్జ్ లూకాస్లతో కలిసి చేరారు. 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,169 కోట్లు) భారీ నెట్‌వర్త్‌తో స్విఫ్ట్ 14వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ టాప్ టెన్ లిస్ట్ ఇదే..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు (నెల్లూరు జిల్లా)
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
తప్పక చదవండి
- పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
Advertisement