-
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్‌ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
స్టార్ హీరోయిన్ తమ్ముడి నిశ్చితార్థం..ఈమె మూడో అమ్మాయి (ఫొటోలు)
-
నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆమెనే: యానిమల్ బ్యూటీ కామెంట్స్
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్తో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలి పాత్రలో కనిపించి మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3 చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించింది. త్రిప్తి మాట్లాడుతూ..' మరో దేశానికి వెళ్లి కెరీర్ ప్రారంభించాలంటే ధైర్యం ఉండాలి. ప్రియాంకకు ధైర్యంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. హాలీవుడ్‌కు వెళ్లి సక్సెస్‌ను సాధించింది. ఆమె నాలాంటి వారికి స్ఫూర్తి. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ప్రియాంక మూవీ బర్ఫీ మొదటిసారి చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్‌కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రతోనే మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని అన్నారు. ప్రియాంక తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని త్రిప్తి కొనియాడారు. -
అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
కాస్ట్లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?
మొన్నీమధ్యే అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ లాంటి టెక్ దిగ్గజాలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే వీళ్లందరూ వేసుకున్న డ్రస్సులు, ఆభరణాలు-వాటి ధరలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాయి. ఇప్పుడు అదే అంబానీ మరో ఈవెంట్ చేశారు. ఇందులో మిగతా వాళ్ల సంగతేమో గానీ ప్రియాంక చోప్రా.. అత్యంత ఖరీదైన నెక్లెస్‌తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన హనుమాన్.. ఎక్కడంటే?) సౌత్ సినిమాలతో మొదలుపెట్టి హిందీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. పాప్ సింగర్ నిక్ జొనాస్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయింది. అప్పుడప్పుడు మన దేశంలో కనిపించే ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్లోనే ఒకటి రెండు ప్రాజెక్టులు చేస్తూ మళ్లీ ఇక్కడ బిజీ అవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అంబానీ ఇంట జరిగిన హోలీ ఈవెంట్ లో తళుక్కున మెరిసింది. తేల గులాబీ రంగు డ్రస్సులో అందాల విందు చేసిన ప్రియాంక చోప్రా.. ఓ ఖరీదైన నెక్లెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఆభరణం గురించి ఆరా తీయగా.. అత్యంత అరుదైన వజ్రాలు పొదిగిన బెవల్గారీ కంపెనీకి చెందినది అని తెలిసింది. అలానే దీని ధర ఏకంగా రూ.9.18 కోట్ల వరకు ఉందని టాక్. నెక్లెస్ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ రేటు చూసి నెటిజన్లకి మైండ్ బ్లాక్ అయిపోతోంది. (ఇదీ చదవండి: ఎస్పీ చరణ్‌తో వివాదం.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!) I need those pictures 🔥🔥#PriyankaChopra pic.twitter.com/rFeiCGt0db — NP LEGΛCY 🇨🇴 | Loving MMCJ ❤🍼 (@np_legacy) March 16, 2024
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్.. కేవలం 61 గంటల్లోనే!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement