-
విజయ్ చివరి చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..ఎవరంటే?
ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన టాక్ హల్చల్ చేస్తోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చి త్రం గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టై మ్) నటి మీనాక్షి చౌదరి, స్నే హ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్,వైభవ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తదుపరి విజయ్ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే ఈయన చివరి చిత్రం అని ప్రచా రం జోరుగా సాగుతోంది. కారణం విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేయడమే. కాగా ఆయన చివరి చిత్రానికి హెచ్ వినో ద్ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో దీన్ని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందీ అన్నది కూడా తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇందులో విజయ్‌తో జత కట్టే కథానాయికల గురించి ప్రచారం జో రుగా సాగుతోంది.అలా ఈ జాబితాలో పలువురు పేర్లు చెక్కర్లు కొడుతున్నా, నటి సమంత, కీర్తీసురేష్ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. నటి సమంత ఇంతకు ముందు విజయ్ సరసన కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించారు. అలాగే నటి కీర్తీసురేష్ కూడా ఇంతకు ముందు భైరవా, సర్కార్ చిత్రాలలో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్‌తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్‌జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్‌ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్‌నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్‌స్టార్ అజిత్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్‌పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
విజయ్ సినిమాకే ఇలాంటి సమస్యలు వస్తాయా..?
నటుడు విజయ్ నటించిన చిత్రాలకు విడుదల సమయంలో సమస్యలు రావడం చాలా కాలంగా జరుగుతోంది. అలా ఈయన నటించిన తలైవా, కత్తి వంటి చిత్రాలు అసలు తెరపైకి వస్తాయా? అన్నంతగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇటీవల విడుదలైన లియో చిత్రంలోని నా రెడీయా మరవా అనే పాటపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అలాంటి సమస్య విజయ్ చిత్రాలకు ఇప్పటికీ వదలా బొమ్మాళీ అంటునే ఉంది. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం). వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటుడు ప్రభుదేవా, ప్రశాంత్, మైక్మోహన్, అజ్మల్, యోగిబాబు, నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవలే అధికారికంగా వెల్లడించారు. కాగా తాజాగా చిత్రంలోని విజిల్ పోడు అనే పల్లవితో సాగే పాటను విడుదల చేశారు. నటుడు విజయ్ పాడిన ఈ పాటలో ఆయనతో పాటు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ తదితరులు నటించారు. అసలు విషయం ఏమిటంటే ఈ పాట మద్యం తాగడం, పొగ తాగాడం వంటి అలవాట్లను ప్రోత్సహించేలా ఉందంటూ ఓ వ్యక్తి ఆన్లైన్ ద్వారా చైన్నె డీఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై డీఐజీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో? అనే చర్చ జరుగుతోంది. మరోపక్క నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో పాటు పార్టీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్‌లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్‌హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్‌హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్‌మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజయ్ చివరి సాంగ్ విడుదల
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా తర్వాత 'దళపతి 69' ప్రాజెక్ట్ మాత్రమే చేయనున్నాడు. 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తే.. తాజాగా విడుదలైన పాటను విజయ్‌తో పాటు వెంకట్ ప్రభు పాడటం జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. పలు సినిమాల్లో విజయ్ పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం కోసం చివరగా విజయ్ ఒక పాటను పాడడం విశేషం. కొన్నిరోజుల పాటు తమిళనాట ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Pagination
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
Advertisement