ఆయన లక్షణాలే నా అక్షరాలకు స్ఫూర్తి  | Sakshi
Sakshi News home page

ఆయన లక్షణాలే నా అక్షరాలకు స్ఫూర్తి 

Published Fri, Apr 19 2024 4:49 AM

Laxman Exclusive Interview with Sakshi

‘జెండాలు జత కట్టడమే మీ అజెండా’ పాట రచయిత లక్ష్మణ్‌ 

ఓ నాయకుడి గురించి రాసేటప్పుడు కలం కదలాలంటే ఆ నాయకుడి వ్యక్తిత్వంలో బలం ఉండాలి. అక్షరాలు పరుగులు తీయాలంటే లక్షణాలు ప్రేరణ కావాలి అంటున్నారు జానపద గేయ రచయిత లక్ష్మణ్‌.‘నీ బుల్లెట్టు బండెక్కి..’ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్ని ఊపేసిన ఈ యువ రచయిత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గుణగణాల్ని వర్మిస్తూ రాసిన ‘జెండాలు జత గట్టడమేమీ అజెండా.. జనం గుండెలో గుడికట్టడమే జగన్‌ అజెండా’ అనే పాట తెలుగు నాట ఉర్రూతలూగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షితో తన అనుభూతిని పంచుకున్నారిలా...         – సత్యార్థ్‌

పేదల ముంగిట్లో పథకాలు 
పాట రాయడానికి ముందు వలంటీర్లతో స్వయంగా మాట్లాడి ఆయన అమలు చేసిన పథకాల గురించి తెలుసుకున్నా. కడుపు నిండినోడ్ని కాదు ఆకలితో కడుపు మండేవాడ్ని మాత్రమే పట్టించుకోవాలనీ, చాచిన ప్రతీ చేయికీ సాయం అందాలి అనే ఆలోచనలతోనే ఆయన ఆ పథకాలన్నీ తీర్చిదిద్దారని అర్థమైంది. ఆ అవగాహనే ‘‘మా ఇంటికే తెచ్చిండు ప్రభు త్వం మా చేతికే ఇచ్చిండు రా పథకం’’ అంటూ కీర్తించేలా చేసింది. ప్రభుత్వ పథకాలు ఇంటికి రావడం దేశంలోనే జగన్‌ సార్‌ వల్ల వచ్చిన గొప్ప మార్పు. నిరుపేదలు ఆస్పత్రి ఖర్చులతో అన్యాయం అయిపోవద్దు. రోగంతో కోలుకున్నాక కూడా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లకు పూర్తిగా నయమైంది అని కచ్చితంగా తెలుసుకోవాలి... అని ఆయన మాట విన్నప్పుడు నిజంగా నాకు కళ్లలో నీళ్లొచ్చాయి.

కార్యకర్తలు కాలర్‌ ఎగరేసేలా..
జగన్‌ పుట్టుకలో వెనుకడుగేయని తత్వం ఉంది. ఆయన్ను నమ్ముకున్న కార్యకర్త ఆత్మగౌరవంతో ఉండాలి. ధైర్యంగా కొట్లాడాలి. ఏదోవిధంగా గెలవాలని, తాను పొత్తులకు దిగజారిపోకూడదు అని ఆయన అనుకుంటారు. తన కోసం వారు మనస్సాక్షిని చంపుకుని బతకొద్దు అనేది ఆయన ఆలోచన అని నాకు అర్థమైంది. పైన ఉన్న దేవుడ్ని కింద ఉన్న జనాన్నే నేను నమ్ముకున్నా అంటూ తరచుగా ఆయన చెప్పడం నాకెంత స్ఫూర్తినిచ్చిందో... 

పరిచయమైన కొద్దీ... 
పదునెక్కిన పదం జగన్‌ మీద అప్పటికే ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి.  ఆయన కోసం పాట రాయాలంటే మామూలు విషయం కాదు.అందుకే ఈ పాట రాసే అవకాశం నాకు వచ్చినప్పుడు...  కొంచెం సందేహించిన మాట నిజం.పైగా నాది తెలంగాణ కావడంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి అంతగా తెలియదు. దాంతో పాటకు ముందు ఆయన ఇంటర్వ్యూ లు వరుసపెట్టి చూశా.. రకరకాల మార్గాల ద్వారా తెలుసుకుంటుంటే....అర్ధమవుతూ వచ్చింది జగన్‌ ఏంటో... 

నిఖార్సైన గ్రేట్‌ లీడర్‌... 
ఆయన పాట రాసి అది అందరి మెప్పూ పొందడం వల్ల ఎంత ఆనందం పొందుతున్నానో...ఆయన పాలన విశేషాలు, ప్రజాసేవ గురించి తెలుసుకోవడం వల్ల అంతకు మించిన ఆనందం పొందుతున్నాను. ఇలాంటి పేదల పక్షపాతి లాంటి నాయకుడ్ని నేనింత వరకూ చూడలేదు. ఇంత చేసినా.. రకరకాలుగా ఆయనకు చెడు చేయాలనే ఆలోచనలు కొంతమంది చేస్తున్నారని బాధ అనిపిస్తుంది.

సారిచ్చిన పథకాలు పేదింటికి ఏ స్థాయిలో అందుతున్నాయి? పేదలు ఎంత తృప్తిగా ఉన్నారు? అనేది కనపడుతున్నా.. వ్యతిరేక మీడియా దు్రష్పచారం చేస్తోంది. అందుకే నా వంతుగా ఆయన వ్యక్తిత్వాన్ని పాట ద్వారా బలంగా చెప్పాలని అను కున్నా. నేను రైటర్‌గా గతంలోనూ కొందరు నేతల గుణగణాల్ని వర్మిస్తూ రాశాను. అయితే వ్యక్తిగతంగా ఇంతగా ప్రభావితం అయింది ఇదే తొలిసారి. జగన్‌ గారి గురించి రాసేటప్పుడు తెలియని శక్తి ఏదో  ఆవహిస్తుందేమో అనిపించింది.   

Advertisement
Advertisement