Horoscope Today: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..! | Today Telugu Horoscope On April 8th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయం, శుభవార్తలు వింటారు..!

Published Mon, Apr 8 2024 6:14 AM

Daily Horoscope: Rashi Phalalu On April 8th 2024 In Telugu - Sakshi

మేషం: సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభం: ఉద్యోగ, వివాహయత్నాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు సామాన్యస్థితి. ఉద్యోగాలలో సమస్యలు పెరుగుతాయి.

కన్య: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృశ్చికం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

మకరం: పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. ధనలాభం. వ్యవహార విజయం. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో కొంత పురోగతి.

కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు.  ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కొత్త వస్తువుల సేకరణ. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
 

Advertisement
Advertisement