నేడు ఈ రాశి వారి జీవితాల్లో ఆశ్చర్యకర సంఘటనలు | Today Telugu Horoscope On March 30th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారి జీవితంలో ఆశ్చర్యకర సంఘటనలు

Published Sat, Mar 30 2024 6:51 AM

Daily Horoscope: Rasi Phalalu On March 30 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: బ.పంచమి సా.5.34 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: అనూరాధ రా.6.48 వరకు, వర్జ్యం: రా.12.31 నుండి 2.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.01 నుండి 7.35 వరకు, అమృతఘడియలు: ఉ.7.56 నుండి 9.35 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.01, సూర్యాస్తమయం: 6.08. 

మేషం: ఆర్థిక ఇబ్బందులతో సతమతం. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం: కార్యజయం. శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిథునం: కొత్త పరిచయాలు. ఆర్థికంగా బలపడతారు. వాహనయోగం. సేవాభావంతో కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: మీ కష్టానికి ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత చికాకు పరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.

సింహం: వ్యవహారాలు నిదానిస్తాయి. ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కొన్ని బాధ్యతలు మీదపడతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

కన్య: ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు ఫలిస్తాయి.

తుల: పనుల్లో మరింత జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం: బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి సహకారం అందుతుంది. పనులు సమయానికి పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

ధనుస్సు: వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.

మకరం: ఆశ్చర్యకర సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: శ్రమపడ్డా ఫలితం ఉంటుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో చర్చలు. వస్తులాభాలు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
 

Advertisement
Advertisement