Sakshi News home page

ఆధార్ ఫ్రీ అప్‌డేట్ కోసం మరో ఛాన్స్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Published Tue, Mar 12 2024 4:59 PM

Aadhaar Card Service Deadline Extended Again 2024 June 14 - Sakshi

ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం మార్చి 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫ్రీ సర్వీస్ మై ఆధార్ (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలనే వారు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.

మీ ఆధార్ కార్డును ఎలా అప్‌డేట్ చేసుకోవాలంటే..
యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఉపయోగించి లాగిన్ చేయాలి.
లాగిన్ అయిన తరువాత మీకు డాక్యుమెంట్ అప్డేట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. 
ఏ వివరాలను అప్డేట్ చేసుకోవాలో దాన్ని సెలక్ట్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. 
చివరగా సబ్మిట్ చేయడానికి ముందు మీ వివరాలను ద్రువీకరించుకోవాలి.

కేవలం myAadhaar పోర్టల్ మాత్రమే జూన్ 14 వరకు డాక్యుమెంట్ల ఆధార్ అప్‌డేట్‌లను ఉచితంగా అందిస్తుంది. ఫిజికల్ ఆధార్ కేంద్రాలలో ఈ దీని కోసం రూ. 50 ఫీజు వసూలు చేస్తారు. 50 రూపాయలకంటే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే ఆపరేటర్ మీద చర్యలు తీసుకుంటారు.

Advertisement
Advertisement