ఆపిల్‌, స్పొటిఫైలకు సవాల్‌ విసురుతున్న అమెజాన్‌ | Sakshi
Sakshi News home page

ఆపిల్‌, స్పొటిఫైలకు సవాల్‌ విసురుతున్న అమెజాన్‌

Published Sat, Jun 26 2021 11:37 AM

Amazon Preparing To Acquire Good Share In Podcast Market Against Apple And Spotify - Sakshi

వెబ్‌డెస్క్‌ : పొడ్‌కాస్ట్‌ రంగంలో తీవ్రమైన పోటీకి రంగం సిద్ధమవుతోంది, మార్కెట్‌ లీడర్లుగా ఉన్న ఆపిల్‌, స్పొటిఫైలకు అమెజాన్‌ నుంచి గట్టిపోటీ ఎదురుకాబోతుంది. రెండేళ్లుగా పొడ్‌కాస్ట్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న అమెజాన్‌ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది పొడ్‌కాస్ట్‌లో దూసుకుపోతున్న ఆర్ట్‌ 19 కొనుగోలుకు సిద్ధమైంది. అయితే డీల్‌ వివరాలు ఇంకా బయటకు వెల్లడి కాలేదు.

ఫ్యూచర్‌లో పొడ్‌కాస్ట్‌

డిజిటల్‌ విప్లవం వచ్చిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ రూపు రేఖలు మారిపోయాయి. గత ఐదేళ్లుగా వీడియో కంటెంట్‌ ఈ విభాగంలో రాజ్యమేలుతోంది. అయితే భవిష్యత్తులో ఆడియో కంటెంట్‌కి కూడా ఇదే స్థాయిలో డిమాండ్‌ ఏర్పడనుంది. ఇప్పటికే ఆపిల్‌ పొడ్‌కాస్ట్‌లో మార్కెట్‌ లీడర్‌గా ఉంది. ఇటీవల ఆపిల్‌కి స్పొటిఫై నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. పొడ్‌కాస్ట్‌లో తనదైన మార్క్‌ చూపించేందుకు అమెజాన్‌ రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా 2020 సెప్టెంబరుల అమెజాన్‌ మ్యూజిక్‌ పేరుతో మార్కెట్‌లోకి వచ్చినా  ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. అంతకు ముందు వండరేనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆర్ట్‌ 19తో మరో ప్రయోగం చేయబోతుంది.

మార్కెట్‌పై పట్టు కోసం

వీడియో కంటెంట్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు దీటుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ వచ్చింది. అదే తరహాలో పొడ్‌కాస్ట్‌లోనూ మార్కెట్‌లో వాటా కోసం అమెజాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్ట్‌  19ని టేకోవర్‌ పూర్తైన తర్వాత పొడ్‌కాస్ట్‌ కంటెంట్‌, మార్కెటింగ్‌లో అమెజాన్‌ మరింత దూకుడు ప్రదర్శించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

చదవండి : Drone Delivery: డ్రోన్‌లతో లాజిస్టిక్స్‌ డెలివరీకి రెడీ

Advertisement
 
Advertisement
 
Advertisement