Sakshi News home page

డేంజర్ యాప్స్‌పై డాట్ పంజా.. డిలీట్ చేసిన గూగుల్, యాపిల్

Published Tue, Jan 9 2024 10:35 AM

Apple Google Removed eSIM Apps - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోవడంతో.. 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఈసిమ్ యాప్‌లను గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్‌లో (Airalo), హోలాఫ్లై (Holafly), eSIM వంటి యాప్‌లను తొలగించాయి. భారతదేశంలో ఈసిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని, అప్పుడు మాత్రం అధీకృత డీలర్లు విక్రయించుకోవచ్చని, విక్రయించే ముందు తప్పకుండా పాస్‌పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌ను కస్టమర్‌ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించింది. విక్రేత కూడా గ్లోబల్ సిమ్‌ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది.

ఈసిమ్ విషయాన్ని పక్కన పెడితే.. సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లో, స్పెయిన్‌కు చెందిన హోలాఫ్లై రెండు యాప్‌లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్​ ప్రో - ధర రూ.2.90 లక్షలు

నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు, దీనిని నెట్‌వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం ఈసిమ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.

ఈసిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి DoT ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement