SIT Summons Hassan MP Prajwal Revanna, Father For Questioning In Obscene Videos Case, Details Inside | Sakshi
Sakshi News home page

Hassan sex scandal: రాజుకుంటున్న పెన్‌డ్రైవ్‌

Published Wed, May 1 2024 12:04 PM

SIT summons Hassan MP Prajwal Revanna

శివాజీనగర/ బనశంకరి: హాసన్‌లో మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న  జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసు రోజురోజుకూ బిగుసుకుంటోంది. సిట్‌ విచారణ ప్రారంభం కాగా, ఇంతలో జాతీయ మహిళా కమిషన్‌ రంగంలోకి దిగింది.  ఈ కేసులో తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని కమిషన్‌ అధ్యక్షురాలు రేఖా శర్మ..  రాష్ట్ర డీజీపీ అలోక్‌మోహన్‌ను మంగళవారం లేఖ రాశారు. ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు మహిళల సురక్షతకు ప్రమాదకరం, హింసా సంస్కృతిని పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు వెలుగులోకి రాగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశం వదిలి వెళ్లారని సమాచారం ఉంది.

పారిపోయిన వ్యక్తిని త్వరగా అరెస్ట్‌ చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్ష విధించాలని లేఖలో కోరారు. అనేక మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నగ్న వీడియోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం మహిళా సమాజం గౌరవానికి భంగం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు వైరల్‌ కాకుండా అడ్డుకోవాలని, వ్యాప్తి చేసేవారిపై క్రిమినల్‌ కేసు పెట్టి విచారణ చేపట్టాలని కోరారు.  

బెంగళూరు, హుబ్లీలో నిరసనలు 
హాసన్‌ లైంగిక దాడి ఘటనలను ఖండిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నగరంలోని మల్లేశ్వరంలో బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. లైంగిక ఘటనల నిందితుడైన ప్రజ్వల్‌ విదేశాలకు పరారు కావడానికి బీజేపీ సహకరించిందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసుల–కార్యకర్తల మధ్య వాగి్వవాదం నెలకొంది. బెంగళూరు మహారాణి క్లస్టర్‌ కాలేజీలో ఎన్‌ఎస్‌యూఐ నేతృత్వంలో విద్యారి్థనులు ధర్నా  చేశారు. మహిళలతో చెలగాటమాడుతున్నారు, చరిత్రలో ఇలాంటి పనులు ఎవరూ  చేయలేదు. 65 సంవత్సరాల మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. మహిళలకు భద్రత కల్పించాలి. సమాజంలో ఎవరు చేసినా తప్పు తప్పే. ఆయనను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

జేడీఎస్‌ భేటీ ముట్టడికి యత్నం 
ఇక హుబ్లీలో కుమారస్వామి ఆధ్వర్యంలో జేడీఎస్‌ కోర్‌ కమిటీ సమావేశం జరిగిన హోటల్‌ వద్దకు కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీగా వచ్చారు. సమావేశం జరిగే హాల్‌లోకి చొరబడేందుకు యతి్నంచగా జేడీఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

500 మందిపై లైంగిక దాడులు: ఎంపీ 
ప్రజ్వల్‌ లైంగిక దాడులకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబమే  కారణమని ఎంపీ డీ.కే.సురేశ్‌ ఆరోపించారు. బెంగళూరులో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ హాసన్‌ బీజేపీ నాయకుడు దేవరాజేగౌడ ఈ విషయమై ముందే పార్టీ సీనియర్లకు లేఖ ద్వారా తెలిపినా దాచిపెట్టి, ప్రజ్వల్‌ను     అభ్యరి్థగా నిలబెట్టారన్నారు. సుమారు 500 మందికి పైగా మహిళలు లైంగిక దాడులకు గురయ్యారని చెప్పారు. ప్రజ్వల్‌తో సంబంధం లేదని హెచ్‌డీ కుమారస్వామి చెప్పడం సమంజసం కాదన్నారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement