బిట్‌కాయిన్‌ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి | Sakshi
Sakshi News home page

బిట్‌కాయిన్‌ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి

Published Wed, Feb 28 2024 7:51 PM

Bitcoin Surged 60,000 Usd Mark - Sakshi

ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్‌ కాయిన్‌ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్‌కాయిన్‌ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

తాజా ట్రేడింగ్‌తో బిట్‌కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్‌ కాయిన్‌ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది.

ఫిబ్రవరి 26న బిట్‌కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్‌ డెస్క్‌ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్‌లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్‌ను దాటి రికార్డ్‌లు సృష్టించింది. 

క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ బిట్‌సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్‌టీఎక్స్‌ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్‌కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు.  

Advertisement
 
Advertisement