భారత్‌లో ‘టెస్లా’పై..కేంద్ర మంత్రి పీయూష్‌ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

భారత్‌లో ‘టెస్లా’పై..కేంద్ర మంత్రి పీయూష్‌ కీలక వ్యాఖ్యలు

Published Sun, Apr 14 2024 8:10 PM

Elon Musk Planning To Set Up Entire Ecosystem Of Tesla In India - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో తన మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. టెస్లా అధినేత ఎలోన్‌ మస్క్‌ భారత్‌లో టెస్లా ఇకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.   

పియూష్‌ గోయల్ ప్రకారం..మస్క్ భారత్‌ ఆటోమొబైల్‌ రంగం లాభదాయకమైన మార్కెట్‌గా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్‌లకు సేవలందించే వ్యూహాత్మక ప్రదేశంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.  

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారే నమ్మకం తమకు ఉందన్నారు. తద్వారా అన్ని ప్రధాన కంపెనీలు భారత్‌లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశం సాధించిన పురోగతిని ప్రపంచం గమనించిందని ఉద్ఘాటించారు.
 

Advertisement
Advertisement