ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు

Published Sun, May 5 2024 3:35 AM

ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు

● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కానున్నా యని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. స్థానిక అడ్డగుంటపల్లి, మారుతీనగర్‌, హనుమాన్‌ టెంపుల్‌ వద్ద 48 డివిజన్‌ కార్పొరేటర్‌ పొన్న విద్య ఆధ్వర్యంలో శనివారం పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు బెందె నాగభూషణంగౌడ్‌, పెరుమాండ్లుగౌడ్‌, కదిరి సత్యనారాయణ, చిర్ర సంపత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు.

కాంగ్రెస్‌లో చేరిక

బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్థానిక దుర్గానగర్‌లో జరిగిన కా ర్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ వారికి కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరి న వారిలో నాయకులు అవినాశ్‌, సతీశ్‌, సురేశ్‌, అజయ్‌ తదితరులు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆసిఫ్‌పాషా, రమేశ్‌ పాల్గొన్నారు.

బొందల గడ్డగా మార్చింది కేసీఆరే..

పాలకుర్తి(రామగుండం): సింగరేణిలో ఓసీపీలు తవ్వించి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఎద్దేవా చేశారు. రామారావుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించాక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రిలో నీళ్లు, బొగ్గు లేకున్నా పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టారని అన్నారు. స్థానికంగా నీళ్లు, బొగ్గు నిక్షేపాలు అపారంగా ఉన్నా.. జెన్‌కో ప్లాంట్‌ను విస్తరించకుండా ఈప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకుని మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రభు త్వ విప్‌గా, మంత్రిగా వివిధ పదవులు అనుభవించిన బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్‌.. రామగుండం ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని మక్కాన్‌ సింగ్‌ అన్నారు. చేతిగుర్తుపై ఓటువేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కన్నాల సింగిల్‌విండో చైర్మన్‌ బయ్యపు మనోహర్‌రెడ్డి, జయ్యారం ఎంపీటీసీ గంగాధర రమేశ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య, మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గడప గడపకూ ప్రచారం

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): స్థానిక గౌతమినగర్‌లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ గడప గడప కూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. నాయకులు మహంకాళి స్వామి, బెద్రం సునీత, ఆసిఫ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement