ఐదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం | Sakshi
Sakshi News home page

ఐదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Published Fri, Apr 12 2024 7:18 PM

Retail Inflation Declines To 4.85 Percent In March - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం 4.85 శాతంతో ఐదు నెలల కనిష్ట స్థాయిలో క్షీణించింది. వినియోగదారుల ధరల సూచిక (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 5.09 శాతం, మార్చిలో 5.66 శాతంగా ఉంది. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది.

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార  ద్రవ్యోల్బణం మార్చిలో 8.52 శాతంగా ఉంది, ఫిబ్రవరిలో 8.66 శాతానికి తగ్గింది.

ద్రవ్యోల్బణం  2-4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్‌కు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 3.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

Advertisement
Advertisement