కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పేనా? | DA Hike: Will Central Govt Employees, Pensioners To Get 18 Month DA Arrear? Details Inside - Sakshi
Sakshi News home page

DA Hike News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌ దారులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పేనా?

Published Sat, Jan 27 2024 12:23 PM

Will Central Govt Employees, Pensioners Get 18 month Da Arrear - Sakshi

ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్‌పై అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌ దారులు ఈ బడ్జెట్‌ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే ఈ బడ్జెట్‌లో సుధీర్ఘ కాలంగా నిలిచిన కరువు భత్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.    

ఈ నేపథ్యంలో ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. మధ్యంతర బడ్జెట్‌ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం ‘భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్’ జనరల్‌ సెక్రటరీ ముఖేసింగ్‌ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్ధిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే.. దేశం మహమ్మారి నుంచి కోలుకుని ఆర్ధిక పరిస్థితులు చక్కబడ్డాయని అన్నారు. 



పునసమీక్షించాలని లేఖ 
కాబట్టి, రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో మూడు విడుతల కరువు భత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునసమీకక్షించాలని లేఖ రాశారు. నిలిపివేసిన డీఏ బకాయిలను విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విమరణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలందించిన వారికి ఉపశమనం లభిస్తుందన్నారు. ముఖేష్‌ సింగ్‌ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 



కరువు భత్యం నిలిపివేసింది
కోవిడ్‌-19 మహమ్మారి దృష్ట్యా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు చెల్లించేందుకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ (డీఏ), డియర్‌నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌)ను జనవరి 2020 నుంచి జూన్‌ 2021 అంటే సుమారు 18 నెలలు పాటు నిలిపివేసింది. ఆ సమయంలో కోవిడ్‌-19 విజృంభణ కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు.  

Advertisement
Advertisement