దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల | Telangana: DOST 2024 Notification Released | Sakshi
Sakshi News home page

దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

Published Sat, May 4 2024 5:20 AM | Last Updated on Sat, May 4 2024 5:20 AM

Telangana: DOST 2024 Notification Released

నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న దోస్త్‌ కన్వినర్‌ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

వివిధ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు జారీ 

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరు యూనివర్సిటీల (ఉస్మానియా, మహాత్మాగాం«దీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన)తోపాటు మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ, సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, డీఫార్మసీ కోర్సుల్లో ఫస్టియర్‌ ప్రవేశాలను దోస్త్‌ ద్వారా నిర్వహించనున్నారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, దోస్త్‌ కన్వినర్‌ ఆర్‌.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం దోస్త్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. అడ్మిషన్లకు సంబ ధించిన వివరాలు వెల్లడించారు. ఇంటర్‌లో విద్యార్థుల మెరిట్‌ ఆధారంగా ఆయా కాలేజీల్లో డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వి.వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌ అలీ, కార్యదర్శి శ్రీరామ్‌ వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్‌ తేదీలు ఇలా... మొదటి విడత 
ఈ నెల 6 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 200 రిజిస్ట్రేషన్‌ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి ఈ నెల 25 వరకు దోస్త్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 27 మధ్య కాలేజీల ప్రాధాన్యత క్రమంలో వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి ఈ నెల 24, 25 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తొలివిడత సీటు అలాట్‌మెంట్‌ జూన్‌ 3న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 4 నుంచి 10లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ పూర్తి చేయాలి. 

రెండో విడత.. 
జూన్‌ 4 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి జూన్‌ 13 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అలాగే జూన్‌ 4 నుంచి 14 వరకు కాలేజీల వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్‌ 13న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. రెండో విడత సీటు అలాట్‌మెంట్‌ జూన్‌ 18న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 19 నుంచి 24లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోరి్టంగ్‌ పూర్తి చేయాలి. 

మూడో విడత.. 
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జూన్‌ 19 నుంచి మొదలవుతుంది. రూ. 400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి జూన్‌ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. జూన్‌ 19 నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు చాన్స్‌ ఇస్తారు. దివ్యాంగులు, ఇతర ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్న వారికి జూన్‌ 25న ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. మూడో విడత సీటు అలాట్‌మెంట్‌ జూన్‌ 29న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూన్‌ 29 నుంచి జూలై 3లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోరి్టంగ్‌ పూర్తి చేయాలి. 

∗ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్‌ 29 నుంచి జూలై 5లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. 
∗ డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూలై 1 నుంచి 6 వరకు ఓరియెంటేషన్‌ తరగతులుంటాయి. 
∗  ఫస్టియర్‌ సెమిస్టర్‌ తరగతులు జూలై 8 నుంచి ప్రారంభమవుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement