తాతా.. నీకు టాటా.. | Sakshi
Sakshi News home page

తాతా.. నీకు టాటా..

Published Sat, May 4 2024 8:43 AM

Congress party Video Release on BJP

కాంగ్రెస్‌ సరికొత్త వీడియో

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై కాంగ్రెస్‌ పార్టీ తాజాగా మరో వీడియో విడుదల చేసింది. విభజన చట్టాల అమల్లో వైఫల్యం, వరంగల్, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనుల్లో నిర్లక్ష్యం, 2020లో హైదరాబా ద్‌లో వచ్చిన భారీ వరదలకు కేంద్రం ఎలాంటి సాయం చేయకపోవడం, ఐటీఐఆర్‌ లాంటి అనేక అంశాల్లో తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాలను వీడియోలో పేర్కొంది. ‘పదేళ్ల తెలంగాణకు ద్రోహం చేసింది చాలు.. తాతా.. నీకు టాటా’ అంటూ రూపొందించిన వీడియోను శుక్రవారం విడుదల చేసింది. 

Advertisement
 
Advertisement