సినిమాను తీయడం ఒకెత్తు అయితే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేక్షకులను రీచ్ అయ్యేందుకు అదెంచ్చె ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి తర్వాతే మరెవరు అయినా. ఆయన సినిమాను తెరకెక్కించేందుకు ఎలా కష్టపడతాడు.. అంతే స్థాయిలో సినిమా ప్రమోషన్స్‌కి కష్టపడతాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విషయంలో ఆయన చేసిన ప్రమోషన్స్ బాగా కలిసొచ్చింది. ఇద్దరు హీరోలతో దేశం మొత్తం తిరిగి సినిమాను అన్ని భాషల వారికి దగ్గరయ్యేలా చేశాడు. కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు రూ.20 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతుంది ‘కల్కి’ టీమ్.
(చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?)
సినిమా ప్రమోషన్స్‌కి భారీగా ఖర్చు చేయబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం దాదాపు రూ. 50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. రీసెంట్‌గా ఐపీఎల్‌లో కూడా ‘కల్కి 2898 ఏడీ’ యాడ్‌ని రన్ చేశారు. ప్రభాస్ కల్కి అవతార్‌లో కనిపించి సినిమాను ప్రమోట్ చేశాడు. ఇది కేవలం 12 సెకన్ల యాడ్ మాత్రమే. దీని కోసం మేకర్స్ రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా ప్రమోషన్స్‌కి ఖర్చు చేసే డబ్బుతో టాలీవుడ్‌లో ఓ బడా సినిమానే తీయొచ్చు.
(చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడుతాడు)
నేడు(మే 22)రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నాడు మేకర్స్. ఈ ఈవెంట్‌లో బుజ్జిని పరిచయం చేయనున్నారు. ప్రభాస్‌తో పాటు చిత్రబృందం అంతా ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో..అందుకు తగ్గట్లే భారీ ఏర్పాట్లు చేశారట. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment