Two-Year-Old Baby Girl Died After Hot Water Fell on Her in Mysore - Sakshi
Sakshi News home page

అయ్యో దేవుడా.. వేడి నీళ్లని తెలియకపాయె!

Published Wed, Dec 15 2021 8:58 AM

2 Years Girl Death Tragedy In Karnataka - Sakshi

సాక్షి, మైసూరు(కర్ణాటక): మైసూరులో ఘోరం చోటు చేసుకుంది. ఓ తల్లి నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు బలిగొంది. సలసల కాలే నీరు శరీరంపై పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన  మైసూరులో మంగళవారం చోటు చేసుకుంది. దాసనకొప్పలులో నివాసం ఉంటున్న రాము ఫొటోగ్రాఫర్‌ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈయనకు రెండేళ్ల కుమార్తె ఉంది.

మంగళవారం చిన్నారికి స్నానం చేయించేందుకు తల్లి తన కుమార్తెను బాత్‌రూమ్‌కు తీసుకెళ్లింది. నీరు చాలా వేడిగా ఉండటంతో చల్లటి నీరు తెచ్చేందుకు వెళ్లింది. ఈక్రమంలో చిన్నారి బక్కెట్‌లోకి చేయి పెట్టింది.

వేడి తీవ్రత తాళలేక చేయి బయటకు తీసే క్రమంలో బకెట్‌ ఒకపక్కకు ఒరిగి నీరంతా మీదపడి శరీరం బొబ్బలు ఎక్కింది. హుటాహుటిన కేఆర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కళ్లెదుటే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.    

చదవండి: కువెంపు కోడలు రాజేశ్వరి కన్నుమూత 

Advertisement
 
Advertisement
 
Advertisement