Holi 2024: స్పెషల్‌ సమోసా, ఒక్కసారి తింటే.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

హోలీ స్పెషల్‌ సమోసా: ఒక్కసారి తింటే.. వీడియో వైరల్‌

Published Mon, Mar 25 2024 11:27 AM

Holi 2024 Special Thread Samosa viral video - Sakshi

భారతీయులకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ , ఈవినింగ్‌ టీ టైంలోబెస్ట్‌ ఆప్షన్‌ సమోసా.  సాధారణంగా సమోసా అంటే మనకి త్రిభుజాకారంలో, లోపల్‌ ఏదో ఒక స్టఫ్పింగ్‌తో ఉంటుంది.  తాజాగా ఒక వెరైటీ సమోసా  ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. హోలీ స్పెషల్‌గా  ‘థ్రెడ్ సమోసా’ నెటిజనులను ఆకట్టుకుంటోంది.

గుండ్రగా చేసిన ఒక చపాతీలో నాలుగ్గు భాగాల్లోని  ఒక భాగంలో ఆలూ, బఠానీ కూరను స్టఫ్‌ చేసి  దానిక ఎదురుగా ఉన్న  భాగంతో కవర్‌ చేసింది.మిగిలిన రెండు భాగాలను   మళ్లీ రిబన్స్‌లాగా కట్‌ చేసి, ఒకదాని దాని తరువాత ఒకటి సమోసా చుట్టూ థ్రెడ్‌లాగా చక్కగా అల్లింది. దీన్ని జాగ్రత్తగా నూనెలో వేయించింది. ఈ థ్రెడ్‌ సమోసా రెసిపీని plumsandpickle ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్‌ చేయగా ఇప్పటికే ఇది 95 మిలియన్లగా  వ్యూస్‌ను సాధించడం విశేషం.

రెసిపీ, కావాల్సిన పదార్థాలు
ఉడకబెట్టిన బంగాళాదుంపలు, ఉడికించిన పచ్చి బఠానీలు, మిరపకాయ, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి , కొత్తిమీర. పిండి కోసం : 2 కప్పులు ఆల్-పర్పస్ పిండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా నూనె, 1/2 టీస్పూన్, వామ్ము, ఉప్పు ,నీరు. ముందుగా పిండి కలుపుకొని ఒక అరగంట సేపు నాన బెట్టుకోవాలి. తరువాత ఆటూ, బఠానీ కూరను తయారు చేసుకోవాలి.   వీడియోలో చూపించిన విధంగా చపాతీ చేసుకొని, థ్రెడ్‌ సమోసాను సిద్ధం చేసుకోవడమే.

Advertisement
Advertisement