వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్‌ చిట్కాలివిగో! | Sakshi
Sakshi News home page

వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్‌ చిట్కాలివిగో!

Published Wed, Mar 27 2024 6:18 PM

How to Lose Weight Fast in Simple tips and ways - Sakshi

బరువు తగ్గడం అనుకున్నంత  ఈజీ  కాదు. దీనికి తగ్గ ఆహార నియమాలు, కమిట్‌మెంట్‌ చాలా అవసరం.   ఎలా పడితే అలా డైటింగ్‌ చేయడం కాకుండా  బాడీ తీరును అర్థం చేసుకుని, నిపుణుల సలహాలు తీసుకోవడం  మంచిది.

బరువు తగ్గించే ప్రణాళికలకు సరైన ఆహార విధానం, జీవనశైలి పాటించడం  ముఖ్యమని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, జాగ్రత్తగా తినడం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని స్థిరమైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో చేరుకోవడం అత్యవసరం. మీబాడీ మాస్‌ ఇండెక్స్‌ ఎంత ఉన్నదీ లెక్కించుకొని, దానిని బట్ట ప్రణాళిక వేసుకోవాలి.

 నో జంక్‌ ఫుడ్‌,  నో సుగర్‌
పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్‌డ్‌ఫుడ్‌ సుగర్‌ పదార్థాలకు పూర్తిగా  దూరంగా ఉండాలి. తక్కువ కేలరీలు  ఎక్కువ శక్తినిచ్చే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను తీసుకోవాలి.   తొందరగా బరువు తగ్గాలంటే కాఫీ, టీలు పూర్తిగా  మానేయ్యాలి. దీని బదులు, గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ తీసుకోవాలి.

రాత్రి 7 గంటల తరువాత భోజనం వద్దు
రాత్రి 7 గంటలకే భోజనం చేయాలి.  ఒక పూట భోజనంలోపూర్తిగా  ఉడికించిన కూరగాయలు  తీసుకుంటే ఇంకా మంచి ఫలితం . కంప్యూటర్, టీవీ ముందు కూర్చుని చిరు  తిండ్లు  (చిప్స్‌ కానీ, ఇంట్లో చేసుకున్నవైనా) మన తిండి మర ఆడుతూనే  ఉంటుందనేది గుర్తు పెట్టుకోండి.   

వ్యాయామం
బరువు ఎంత తొందరగా అంత  వ్యవధిని వ్యాయామాన్ని పెంచాలి. యోగా, నడక, ఏరోబిక్, సైక్లింగ్ వంటివి  ఎక్కువ కేలరీలు  ఖర్చయ్యేలా చూసుకోవాలి. 

పుష్కలంగా నీరు తాగాలి
బరువు తగ్గే ప్రక్రియలో నీరు  చాలా కీలక పాత్ర. రోజంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండటంతోపాటు, పరగడుపున,రాత్రి నిద్రపోయేముందు నీరు తాగాలి.  ఇది  జీర్ణక్రియకు, చర్మానికి మంచిది.  

నిద్ర తప్పనిసరి
మీరు తగినంత మంచి నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి 7 నుండి 9 గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి.

Advertisement
Advertisement