గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే | Sakshi
Sakshi News home page

Top 10 Destinations : 2023లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలివే!

Published Thu, Dec 14 2023 12:28 PM

Top 10 Travel Destinations Searched By Indian Travellers On Google - Sakshi

ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్‌ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్‌ పడనుంది. ఈ  క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్‌ డెస్టినేషన్‌ లిస్ట్‌ను గూగుల్‌ రిలీజ్‌ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన టూరిస్ట్‌ ప్రాంతాలేంటి? టాప్‌ 10 లిస్ట్‌ ఏంటన్నది చూసేద్దాం.


వియత్నాం
గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన టూరిస్ట్‌ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ‍ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ సీజన్‌లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్‌డూంగ్‌, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్‌, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు.

గోవా
2023లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్‌ యూత్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్‌ గేమ్స్‌ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్‌ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. 


బాలి
భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్‌ కావొద్దు. 

చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్‌ కోసం వెతికారో తెలుసా?


శ్రీలంక
గూగుల్‌ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్‌ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్‌,యాలా నేషనల్ పార్క్‌,మిరిస్సా బీచ్‌,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్‌ స్టైల్‌లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్‌ మ్యూజియంలు, రెయిన్‌ ఫారెస్ట్‌లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

థాయ్‌లాండ్‌
అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్‌ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్‌లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్‌ మాల్స్‌ కూడా టూరిస్టులను అట్రాక్ట్‌ చేస్తాయి. 
వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్‌-10 డెస్టినేషన్‌ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది.
 

Advertisement
Advertisement